Kingdom Pre Release Event: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న మూవీ కింగ్డమ్.. గత రెండేళ్లుగా విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. జెర్సీ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తుండటంతో కింగ్డమ్ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా బడ్జెట్, నార్త్ అమెరికాలో జరిగిన లేటెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఆసక్తికరంగా మారాయి.. ఈ మూవీకి భారీగా బిజినెస్ జరగడంతో హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్ కు స్టార్ హీరో చీఫ్ గెస్టు అని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్టుగా గ్లోబల్ స్టార్..
గౌతమ్ తిన్ననూరి – విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న కింగ్డమ్ చిత్రం తొలుత జూలై 4, 2025న విడుదల కావాల్సింది. కొన్ని కారణాల వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాస్త ఆలస్యం అవ్వడంతో ఈ సినిమాని వాయిదా వేశారు. జూలై 31న విడుదల కాబోతోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విజయ్ సరసన నటించింది. సత్య దేవ్ కీలక పాత్ర పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వడానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్లో స్పీడును పెంచారు మేకర్స్. ఈ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అందుకోసం హైదరాబాదులో భారీగా ఏర్పాట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..
Also Read :రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాలు చెయ్యబోతున్న స్టార్ హీరో.. ఏం జరిగింది..?
‘కింగ్డమ్’ బిజినెస్ వివరాలు..
సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్యూన్ ఫర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియో బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రూ.100 కోట్ల బడ్జెట్ తో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తుండటం విశేషం. విజయ్ దేవరకొండ కెరీయర్ లోనే ఇది అత్యధిక బడ్జెట్ చిత్రం. విజయ్ దేవరకొండ సినిమాలకు గతంలో ఎన్నడు లేని విధంగా ఈ మూవీకి బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. కింగ్డమ్ సినిమాకు ఓవర్సీస్ లో భారీ ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. కేవలం నార్త్ అమెరికాలో కింగ్డమ్ సినిమా 2.1 మిలియన్ల డాలర్లకు డిస్ట్రిబ్యూషన్ హక్కులను అమ్మినట్లు తెలుస్తుంది. నార్త్ అమెరికాలోనే రూ.18 కోట్ల వరకు తిరిగి రాబట్టాలని ట్రేడ్ నిపుణులు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను నిర్దేశించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే సినిమాకు అనుకున్న లాభాలు వస్తాయి.. ఏది ఏమైనా కూడా ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అంచనాలను పెంచుతున్నాయి. మరి రిలీజ్ అయ్యాక టాప్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు..