BigTV English

Tesla: టెస్లా ఆటోపైలెట్ వాహనాలపై అనుమానాలు..

Tesla: టెస్లా ఆటోపైలెట్ వాహనాలపై అనుమానాలు..

Tesla: టెస్లా అనేది ఆటోపైలెట్ అనే టెక్నాలజీని ప్రవేశపెట్టినప్పటి నుండి ఇతర లగ్జరీ కార్లు సైతం తమకు పోటీ వచ్చిందని భావించడం మొదలుపెట్టారు. కానీ ఇందులో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని ఇతర సంస్థలు వాదనలు మొదలుపెట్టాయి. ఇన్ని రోజులు ఈ వాదనలను టెస్లా పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా ఇందులో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవడంతో టెస్లా.. తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది.


టెస్లా.. తన ఆటోపైలెట్ వాహనాల విషయంలో పలు మార్పులు చేర్పులు చేసింది. వాటిపై అమెరికా ఆటోమొబైల్ సెఫ్టీ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఈ మార్పులను దగ్గర ఉండి గమనించాలని అనుకుంది. తాజాగా ఆ మార్పులు అన్ని కస్టమర్లకు మేలు చేసేవి అని నిర్ధారణకు వచ్చింది. ఆటోపైలెట్ డ్రైవింగ్ సిస్టమ్‌లో డ్రైవర్లు ఎంతవరకు అలర్ట్‌గా ఉంటున్నారు, తన దగ్గరలో ఉన్న వాహనాలను టెస్లా ఎంతవరకు గుర్తించగలుగుతుంది అనే విషయాలలో ఈ సంస్థ మార్పులు చేసింది.

టెస్లా మార్పులకు సంబంధించిన సమాచారాన్ని నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ అడిగి తీసుకుంది. ఆ సమాచారాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసింది. టెస్లా ఆటోపైలెట్ వాహనాలు పలుమార్లు హైవేలపై ఎమర్జెన్సీ వాహనాలకు అడ్డుగా నిలిచాయి. దీంతో టెస్లా కార్లపై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. దీని కారణంగా ప్రభుత్వం ఇతర ఆటోమొబైల్ సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా దీనిపై ఫోకస్ చేస్తోంది. తాజాగా మార్పులు జరిగిన తర్వాత అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయని ఆటోమొబైల్ సేఫ్టీ రంగం భావిస్తోంది.


టెస్లా ఆటోపైలెట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయి అనే విషయంలో సేఫ్టీ ఏజెన్సీ స్పెషల్‌గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది. జులై 19 వరకు టెస్లాలో జరిగిన మార్పుల గురించి పూర్తిగా నివేదికను ఇవ్వాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని ప్రకటించింది. దీనిపై టెస్లా అనుకున్న సమయానికంటే ముందుగానే స్పందించి.. అన్ని విధాలుగా తను కరెక్ట్ అని నిరూపించుకుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×