BigTV English

Tips to Reduce Typhoid: ఇంట్లోనే టైఫాయిడ్‌ తగ్గించుకునే చిట్కాలు

Tips to Reduce Typhoid: ఇంట్లోనే టైఫాయిడ్‌ తగ్గించుకునే చిట్కాలు

Tips to Reduce Typhoid: కలుషిత నీరు, ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు అందులో ఉండే బ్యాక్టీరియా ద్వారా టైఫాయిడ్ జ్వరం వస్తుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ జీర్ణ వ్యవస్థ నుంచి రక్త ప్రవాహంలోకి మారుతుంది. దీంతో జ్వరం, తలనొప్పి, నీరసం, కడుపు నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సాల్మొనెల్లా ట్రఫీ అనే బ్యాక్టీరియా ద్వారా టైఫాయిడ్ వస్తుంది. ఈ జ్వరం తీవ్రత పెరిగే కొద్దీ లక్షణాలు కూడా పెరుగుతూనే ఉంటాయి. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. జ్వరం ఎక్కువయ్యేకొద్దీ వణుకు పెరగడం, ముక్కు నుంచి రక్తం కారడం లాంటి లక్షణాలు కొందరిలో కనిపిస్తాయి. ఇక మరికొందరిలో జ్వరం 104 డిగ్రీలకు చేరుతుంది. అయితే జ్వరం ఎంతకు తగ్గకపోతే దాని టైఫాయిడ్‌గా అనుమానించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. టైఫాయిడ్ వచ్చినవారు వైద్యులు ఇచ్చే మందులతో పాటు ఈ చిట్కాలను పాటిస్తే త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంది. టైఫాయిడ్ వచ్చిన వారి శరీరంలో ద్రవాలు త్వరగా బయటకు పోతుంటాయి. డీహైడ్రేషన్ బారిన పడతారు. అందుకే ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలి. నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి బోండాలు, సూప్స్ తాగాలి. టైఫాయిడ్ వచ్చినవారు ఓఆర్ఎస్ తాగితే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మెడికల్ షాపుల్లో వివిధ ఫ్లేవర్లలో ఈ ఓఆర్ఎస్ లభిస్తాయి. ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఒక లీటరు నీటిని మరిగించి అందులో కొద్దిగా చక్కెర, ఉప్పు కలిపి తాగొచ్చు. దీంతో శరీరంలోకి మినరల్స్ చేరుతాయి. తులసి ఆకుల్లో యాంటీబయోటిక్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల టైఫాయిడ్‌కు అద్భుతంగా పనిచేస్తుంది. ఒకప్పు నీటిలో నాలుగైదు తులసి ఆకులు వేసి కొద్దిగా మరిగించి ఆ నీటిని తాగితే చాలా మంచిది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. టైఫాయిడ్ వచ్చిన వారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 2 వెల్లుల్లిపాయలను తింటే చాలా మంచిది. జ్వరం వచ్చిన వారు అరటి పండ్లను తినకూడదని చెబుతుంటారు. కానీ అరటి పండ్లలో ఉండే పొటాషియం శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్స్‌ని భర్తీ చేస్తుంది. సాధారణ జ్వరం, టైఫాయిడ్ జ్వరం ఏదైనా త్రిఫల చూర్ణం తాగితే బ్యాక్టీరియాను నశింపచేస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జ్వరం వచ్చిన వారు లవంగాలను నీటిలో మరిగించి వడకట్టుకొని తాగితే బ్యాక్టీరియా నశిస్తుంది. దానిమ్మ పండ్లు తింటే డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అంతే కాకుండా జ్వరం వచ్చిన వారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ద్రవపదార్థాలను తీసుకుంటే మంచిది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×