Weight Gain Tips: వయస్సు, ఎత్తుకు తగిన బరువు లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అంతే కాకుండా వీరు బరువు పెరగడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. తగినంత బరువు లేకపోతే వారికి పోషకాహార లోప బాధితులుగా పరిగణిస్తారు. వీరిలో కొందరు బరువు పెరగడానికి మందులు వాడతారు. కానీ ఎటువంటి ప్రభావం ఉండదు. బదులుగా వారు ఇతర వ్యాధులకు గురవుతుంటారు. మీరు కూడా తక్కువ బరువుతో ఇబ్బంది పడుతుంటే గనక కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించండి. అవి బరువు పెరగడంలో మీకు చాలా బాగా సహాయపడతాయి.
తక్కువ బరువు కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందువల్ల బరువును కాపాడుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలను మీ టైట్‌లో భాగంగా చేర్చుకోవడం ద్వారా మీరు మీ బరువును పెంచుకోవచ్చు. బరువు పెరగడానికి మీరు మందులు తీసుకోవలసిన అవసరం కూడా లేదు.
1. క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఉదాహరణకు, బంగాళదుంపలు, ఎండుద్రాక్ష, అరటిపండ్లు, ఖర్జూరం, పప్పులు, బీన్స్ మొదలైన వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి. ఇవి బరువు పెరగడానికి ఉపయోగపడతాయి.
2. ఎప్పుడూ భోజనం మానేయకండి. సమయానికి అల్పాహారం, లంచ్, రాత్రి భోజనం చేయండి. రకరకాల కూరలతో కొంచెం ఎక్కువ మొత్తంలో ఆహారం తినండి.
3. పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరానికి అనేక రకాల పోషకాలను అందిసస్తాయి . అంతే కాకుండా బరువును పెంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. పాలు, పెరుగు, జున్ను, మజ్జిగ తప్పకుండా తీసుకోండి.
4. బరువు పెరగడానికి ఒత్తిడి లేకుండా ఉండటం ముఖ్యం. ఇందుకోసం యోగా, వ్యాయామం చేయడం తప్పనిసరి.
5. బరువు పెరగడంలో క్యారెట్ జ్యూస్ చాలా మేలు చేస్తుంది. ఇది వేగంగా బరువు పెరుగేలా చేస్తుంది. క్యారెట్ జ్యూస్‌ని ఖాళీ కడుపుతో రెగ్యులర్‌గా తాగితే తేడా మీకే కనిపిస్తుంది.
6.శరీరంలోని కేలరీలను ప్రాసెస్ చేయడంలో నీరు సహాయపడుతుంది. అందుకే తిన్న 30-40 నిమిషాల తర్వాత పుష్కలంగా నీరు త్రాగాలి.
7. క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అన్నంలో పుష్కలంగా లభిస్తాయి. ఇది బరువు పెరగడంలో సహాయకరంగా ఉంటుంది. అందుకే మీ ఆహారంలో రైస్ ఎక్కువగా చేర్చండి.
8. డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీరు ప్రతిరోజు జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదంపప్పులను తప్పకుండా తినండి. మీకు కావాలంటే నానబెట్టి కూడా తినవచ్చు.
Also Read: చెడు కొలెస్ట్రాల్‌ను ఐస్‌లా తగ్గించే.. బెస్ట్ టిప్స్ ఇవే !
9. గుడ్లలో ప్రోటీన్ తగినంత పరిమాణంలో ఉంటుంది. దీని పచ్చసొనలో అన్ని పోషకాలు ఉన్నాయి. ఇవి బరువును పెంచడంలో సహాయపడతాయి. మీ ఆహారంలో గుడ్లను తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిలోని ప్రొటీన్ శరీరానికి చాలా ముఖ్యం.
10. మీకు నాన్ వెజ్ అంటే ఇష్టమైతే మీ ఆహారంలో రెడ్ మీట్ కూడా తీసుకోవచ్చు. ఇందులో కొవ్వు , కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇది బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.