BigTV English

Asanas for Cholesterol Reduce: ఈ ఐదు ఆసనాలతో కొలెస్ట్రాల్‌ మాయం..!

Asanas for Cholesterol Reduce: ఈ ఐదు ఆసనాలతో కొలెస్ట్రాల్‌ మాయం..!

Cholesterol


Yoga to Control Cholesterol: ప్రస్తుత కాలంలో ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకుల పరుగుల జీవితమైపోయింది. ఈ క్రమంలోనే స్ట్రీట్‌ఫుడ్, జంగ్ ఫుడ్ వంటివి ఎక్కువగా తింటున్నారు. ఇటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దీని కారణంగా అధిక బరువు, గుండె సంబంధిత, ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో యోగా కీ రోల్ పోషిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో యోగా తోడ్పాటునిస్తుంది.


యోగాతో చాలా మంచి ఆరోగ్య ఫలితాలు సాధించొచ్చు. ఇది శరీర, మనసు పనితీరును మెరుగ్గా చేస్తుంది. యోగసనాలు వేయడం వల్ల శరీరంలో హెల్దీ ఫ్యాట్స్ పెరుగుతాయి. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. మరి కొలెస్ట్రాల్‌ను తగ్గించాలంటే ఏ ఆసనాలు సహాయపడతాయో తెలుసుకుందాం..

కాపాలభాతి

కపాలభాతి ఆసనం మన శరీరం నుంచి ట్యాక్సిన్స్‌ని బయటికి పంపుతుంది. అలానే శ్వాస ప్రక్రియల ద్వారా బాడీలో రక్త ప్రసరణ పెరుగుతుంది. కాబట్టి, హాయిగా కూర్చుని శ్వాసప్రక్రియలు కొనసాగించండి. ఇలా 15 సార్లు చేయండి.

Read More: వాటర్ క్యాన్స్‌లో నీరు తాగుతున్నారా..?

చక్రాసనం

చక్రాసనం పేరుకు తగ్గట్టుగానే చక్రంలా ఉంటుంది. ఈ ఆసనం వేసేప్పుడు ఉదరకండరాలు, శరీర అవయవాలు విస్తరిస్తాయి. దీని వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. చక్రాసనం కోసం వెల్లకిలా పడుకోండి. కాళ్లను మడవండి.
దాలను నేలపై ఉంచాలి. చెవుల పక్కన చేతులు ఉంచి నేల నుంచి మీ తుంటిని పైకి ఎత్తండి. 5 నుంచి 10 సార్లు శ్వాస తీసుకోండి.

అర్థమత్సేంద్రాసన

ఈ ఆసనంలో వెన్నెముకని పక్కకు తిప్పాల్సి ఉంటుంది. అర్థమత్సేంద్రాసనం జీర్ణశక్తిని పెంచి ఉదర అవయవాలకు మసాజ్ చేస్తుంది. దీని కోసం నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాపండి. ఇప్పుడు కుడి పాదాన్ని ఎడమకాలుకి వెలుపలికి విస్తరించండి. అదే సమయంలో కుడి కాలిని వంచండి. అలానే ఎడమ చేతిని నేలపై ఉంచి.. ఎడమ చేత్తో కుడి మోకాలిని పట్టుకోండి. తర్వాత కుడి చేతిని ఎడమ తొడపై ఉంచండి. మీ బాడీని తిప్పి 5 నుంచి 10 సార్లు ఊపిరి పీల్చుకోండి.

Read More : బరువు ఈ టైమ్‌లో అసలు చెక్ చేసుకోవద్దు..!

శలభాసన

ఈ ఆసనం కూడా జీర్ణశక్తిని పెంచుతుంది. వెనుక కండరాలని ధృడంగా చేస్తుంది. ఇందుకోసం కడుపుపై పడుకుని చేతులను చాపండి. తర్వాత ఛాతీ, కాళ్లను వీలైనంత వరకూ ఎత్తండి. ఈ సమయంలో 5 నుంచి 10 సార్లు డీప్ బ్రీథ్ తీసుకోవాలి.

సర్వాంగసనం

ఈ ఆసనం మీ భుజాలను స్టాండ్‌లా ఉంచుతుంది. ఇది మీ శరీరంలో రక్తప్రసరణని పెంచి బాడీ నుండి ట్యాక్సిన్స్‌ని బయటికి పంపుతుంది. ఇందుకోసం వెనుకభాగంలో పడుకుని చేతులు, కాళ్లను చాపండి. మీ శరీరాన్ని 90 డిగ్రీల కోణంలో ఉంచి కాళ్లు, తుంటిని ఎత్తండి. 10 సార్లు శ్వాస తీసుకోండి.

Disclaimer : ఆరోగ్య నిపుణుల సలహాలు , పలు వైద్య పరిశోధనలు ఆధారంగా ఈ సమాచారాన్ని అందించాం.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×