BigTV English

Benefits of Fasting: ఫాస్టింగ్ చేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

Benefits of Fasting: ఫాస్టింగ్ చేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

Fasting Benefits


Fasting Benefits: బరువు తగ్గడం ఈ రోజుల్లో అతిపెద్ద పనిగా పెట్టుకున్నారు చాలామంది. అటువంటి పరిస్థితిలో అంతా జిమ్, వ్యాయామం, యోగా, డైటింగ్‌లను ఫాలో అవుతున్నారు. అయితే ఈ రోజుల్లో బరువు తగ్గేందుకు కొత్తగా ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం చేయడం ద్వారా బరువు తగ్గే ట్రెండ్ బాగానే పెరిగింది. మీరు డైట్ మార్పులు, కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఈజీగానే బరువు తగ్గుతారు. ముఖ్యంగా ఉపవాసం చేయడం వల్ల కూడా ఈజీగా బరువు అదుపు చేయొచ్చు. ఇప్పుడు ఉపవాసం బరువు తగ్గించడంలో సహాయపడుతుందో లేదో తెలుసుకుందాం.

ఉపవాసం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాల్లో నటించే హీరోహీరోయిన్లు, ఇతర నటీనటులు, సమాజంలో ప్రముఖులుగా గుర్తింపు పొందిన వాళ్లు కూడా ఉపవాసాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు.


READ MORE: పెయిన్ కిల్లర్స్ ఎలా పని చేస్తాయో తెలుసా?.. సైడ్ ఎఫెక్ట్స్ ఇవే!

ఉపవాసం అంటే కొంత సమయం వరకు తినడం. తాగడానికి పూర్తిగా దూరంగా ఉండటం. ఆహారానికి పూర్తిగా దూరం ఉన్నా క్యాలరీలు లేని ద్రవ పదార్ధాలు తీసుకోవచ్చు. ఉపవాసం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇందులో భాగంగా మూడు రోజుల వరకు ఆహారం తీసుకోకుండా ఉండవచ్చు.

అలా కాకుండా రోజు మార్చి రోజు కూడా ఉపవాసం ఉండవచ్చు. దీనిలో భాగంగా ఆహారం రోజూ తీసుకోవచ్చు. అయితే అందుకు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. చెప్పాలంటే మనం రోజులో 24 గంటల్లో ఆహారం తీసుకునే సమయాన్ని పది గంటలకు తగ్గించుకుని 14 గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. దీని ప్రకారం చూస్తే పది గంటల్లోనే రెండు సార్లు లేదా మూడు సార్లు ఆహారం తీసుకోవాలి.

ఉపవాసంలో ఇంకా కఠినంగా వ్యవహరించాలంటే.. ఆహారం తీసుకునే సమయాన్ని 8 గంటలకు పరిమితం చేసి 16 గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. సాధారణంగా ఉపవాసం చేస్తున్న సమయంలో శరీరంలోని కణాలకు శక్తిని ఇచ్చే ఆహారం అందదు. పోషకాలు ప్రత్యేకించి షుగర్స్ అందవు. కానీ శరీరంలోని కణాలు ఈ పరిస్థితికి అలవాటు పడతాయి.

ఇక శరీరానికి అవసరమైన శక్తి కోసం మెటబాలిజం ఇతర మార్గాల్లో గ్రహించేందుకు ప్రయత్నిస్తుంది. ఇది ఎలా జరుగుతుందంటే కణాలు తమ పని తీరుని తగ్గించుంటాయి. దీంతో కాలేయం కీటోన్ బాడీస్ అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీరంలోని కణాలకు శక్తిని అందిస్తాయి.

ఉపవాసం పాటించడం వల్ల శరీరం మొత్తం ప్రభావితం అవుతుంది. మొదటగా.. మెదడు పని తీరు, సామర్థ్యం మెరుగుడతాయి. దీనివల్ల ఆలోచనల ఒత్తిడి తగ్గుతుంది. దీనితోపాటు గుండె చక్కగా పని చేస్తుంది. రక్తపోటు తగ్గుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. పేగుల్లో మంట తగ్గుతుంది. పేగుల్లోని మైక్రో బయోటా పెరుగుతుంది.

READ MORE: మాంసం బియ్యం.. ఇవి తింటే మాంసం తిన్నట్లే..!

ఉపవాసం వల్ల వృద్ధాప్యంలో శరీరం మరింత దృఢంగా మారుతుంది. దీనివల్ల ఆకలి బాగా వేస్తుంది. శరీర బరువు విషయానికొస్తే.. ఉపవాసం వల్ల బరువు తగొచ్చు. ముఖ్యంగా శరీరంలో కొవ్వు తగ్గించుకోవడానికి ఇదొక ఉత్తమ మార్గం. అయితే ఉపవాసం ఎక్కువగా చేయడం వల్ల కండరాలు పటుత్వం కోల్పోతాయి.

Disclaimer : ఈ సమాచారాన్ని వైద్య నిపుణుల సలహా మేరకు మీ అవగాహన కోసం అందిస్తున్నాం. దీనిని కేవలం సమాచారంగా భావించండి.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×