BigTV English

Glowing Skin Tips: నెల రోజుల పాటు ఈ డైట్ ప్లాన్ ఫాలో అయితే మెరిసిపోయే చర్మం మీ సొంతం

Glowing Skin Tips: నెల రోజుల పాటు ఈ డైట్ ప్లాన్ ఫాలో అయితే మెరిసిపోయే చర్మం మీ సొంతం

Glowing Skin: ప్రస్తుతం ఉన్న కాలంలో అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా అందంపై చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. మేకప్ మాత్రమే కాకుండా మేకప్ లేకుండా కూడా అందంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో తరచూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఏ ప్రొడక్ట్ వాడాలో అని ఉదయం లేచినప్పటి నుంచి మొదలుకుని స్నానం చేసే సమయంలో, స్నానం చేసిన తర్వాత, తిరిగి రాత్రి వేళ ఇలా ప్రొడక్ట్స్ వాడుతూ అందంగా కనిపించాలని ప్రయత్నాలు చేస్తుంటారు. మెరిసే చర్మం పొందాలని ఆహారం తీసుకునే విషయంలోను జాగ్రత్తలు పాటిస్తుంటారు.


కాలుష్యం, జంక్ ఫుడ్, ఆయిల్ వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే తరచూ బయట తిరిగితే కాలుష్యం కారణంగా చర్మం దెబ్బ తింటుందని భావిస్తారు. అందువల్ల కాంతివంతంగా ఉండాలని బయటకు వెళ్లే సమయంలో పలు జాగ్రత్తలు పాటిస్తుంటారు. ముఖంపై మొటిమలు, మచ్చలు, మరకలు ఏర్పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందువల్ల ఖరీదైన ప్రొడక్ట్స్ వాడడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ చర్మం కాంతివంతంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉంటేనే అందంగా కనిపిస్తారు. అందువల్ల తరచూ వాడే ప్రొడక్ట్స్ తో పాటు తినే ఆహారం కూడా చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల నెల రోజుల పాటు కొన్ని చిట్కాలు పాటిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని అంటున్నారు. అయితే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకు కూరలు, పండ్లు


ప్రతీ రోజూ తినే ఆహారంలో ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. అంతేకాదు ఆకుకూరల్లోను కూడా ఉండే విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు శరీరంలో విటమిన్ లోపాలు రాకుండా చేస్తుంది. మరోవైపు హైపర్ పిగ్మెంటేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం పండ్లు ఆకుకూరలను వారంలో కనీసం 3 రోజులైనా తినాలి.

ఇక మరోవైపు ముఖానికి వాడే క్రీముల్లో ఖరీదైనవి వాడడం కాకుండా, కాంతిని పెంచేవి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. అందువల్ల వంటింట్లో లభించే పసుపు, కాఫీ పౌడర్, శనగపిండి, నిమ్మకాయ వంటి వాటిని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వీటన్నింటిలో కంటే ముఖ్యమైన నీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడమే కాకుండా, అందంగా కూడా మారుస్తుంది.

కలబంద, నిమ్మ

కలబంద, నిమ్మకాయతో చర్మాన్ని ఎంతో అందంగా మార్చుకోవచ్చు. తరచూ ఉదయాన్నే నిమ్మకాయ నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు కలబంద రసం తాగినా కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అందువల్ల ఒక నెల రోజుల పాటు వీటిని తరచూ తీసుకుంటే చర్మం కాంతివంతంగా, అందంగా మారుతుంది.

పాలు, పెరుగు

పాలు, పెరుగు వంటి పదార్థాలను తరచూ తీసుకుంటే చర్మ సమస్యలను తగ్గించుకోవడం మాత్రమే కాకుండా చర్మం మెరిసిపోయేలా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు చర్మానికి రాసుకునే పదార్థాలలో కూడా పెరుగు, పాలను కలుపుకుని ముఖానికి రాసుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×