Big Stories

Coconut: పచ్చి కొబ్బరిలోని పోషకాలు తెలిస్తే..అస్సలు వదిలిపెట్టరు !

Health Benefits Of Raw Coconut: పచ్చి కొబ్బరి తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఇంకొంత మంది ఇందులో కొవ్వు శాతం అధికంగా ఉంటుందని భావిస్తారు. కానీ పచ్చి కొబ్బరిలో అనేక పోషకాలు ఉంటాయి. దీనిలో ఐరన్, ఫైబర్ తో పాటు శరీర పెరుగుదలకు అవసరమైన మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

పచ్చి కొబ్బరి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొబ్బరి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. దీనిలో 60 శాతం కంటే అధికంగా నీరు ఉంటుంది. కొబ్బరి తినడం వల్ల మలబద్ధకం, కడుపు మంట, అజీర్ణం నుంచి ఉపశమనం పొందవచ్చు.

- Advertisement -

పచ్చి కొబ్బరిలో అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని దూరం చేస్తుంది. అంతే కాకుండా దీనిలో ఉండే ట్రైగ్లిజరైడ్ శరీరంలోని కొవ్వును కరిగించడానికి దోహదం చేస్తుంది. కొబ్బరి తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి నిలకడగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు పచ్చి కొబ్బరిని డైట్‌లో చేర్చుకోవడం మంచిది.

Also Read: చర్మ సౌందర్యానికి చెరుకు రసం ఎలా ఉపయోగపడుతుందో తెలుసా !

కొబ్బరి శరీర పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఐరన్, విటమిన్ B6 ఇందులో ఉండడం వల్లకొబ్బరి తింటే మొదడు చురుకుగా పని చేయడంతో పాటు..జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో పచ్చి కొబ్బరి ఎంత గానో ఉపయోగపడుతుంది. డయాబెటిస్ తో బాధపడే వారు కూడా పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు.

పచ్చి కొబ్బరిలో యాంటీ-ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి చర్మంతో పాటు జుట్టుకు పూర్తి పోషణ అందిస్తాయి.కొబ్బరిలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.దీన్ని తినడం వల్ల జుట్టు చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. కొబ్బరిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను నిరోదించడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News