Night Skin Care: చర్మం మరమ్మత్తు, పునరుజ్జీవనానికి రాత్రి సమయం ఉత్తమమైంది. అందుకే రాత్రిపూట చర్మ సంరక్షణకు అంత ప్రాధాన్యత ఇస్తారు. రోజంతా దుమ్ము , కాలుష్యం కారణంగా చర్మంపై పేరుకుపోయిన మురికిని శుభ్రపరచడం, సరైన మాయిశ్చరైజర్ అప్లై చేయడం, చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడం వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. అందుకే నిద్రపోయే ముందు కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల చర్మ కణాలు మెరుగపడతాయి. ముడతలు, నల్లటి వలయాలు, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. దీంతో పాటు, ఒత్తిడి లేకుండా నిద్రపోవడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.
అందుకే నిద్రపోయే ముందు, మీరు చర్మ ఆరోగ్యం కోసం కొన్ని అలవాట్లను పాటించాలి. ఇది మిమ్మల్ని ఎల్లప్పుడూ అందంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మానికి మేలు చేసే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన చర్మం కోసం నిద్రపోయే ముందు ఏమి చేయాలి ?
ముఖాన్ని శుభ్రం చేయడం: రోజంతా దుమ్ము, ధూళి కారణంగా చర్మ రంధ్రాలను మూసుకుపోతాయి. ఇది మొటిమలు, మచ్చలు రావడానికి దారితీస్తుంది. ప్రతి రోజు తేలికపాటి క్లెన్సర్‌తో మీ ముఖాన్ని కడగడం వల్ల చర్మాన్ని లోతుగా శుభ్రపరుచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రిఫ్రెష్‌గా అనుభూతి చెందుతారు. అంతే కాకుండా ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోయే మెరిసే ముఖం మీ సొంతం అవుతుంది.
చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయండి: రాత్రిపూట చర్మం స్వయంగా రిపేర్ అవుతుంది. అందుకే మంచి మాయిశ్చరైజర్, నైట్ క్రీమ్ ఉపయోగించడం వల్ల చర్మానికి తేమ, పోషణ లభిస్తుంది. ఇది డ్రై స్కిన్‌ని తొలగించి, చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. తరుచుగా స్కిన్ కేర్ పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతే కాకుండా ముఖం అందంగా మెరిసిపోతుంది.
అండర్ ఐ క్రీమ్ వాడకం: కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. నల్లటి వలయాలు, వాపు నుండి స్కిన్ ను రక్షించడానికి, మంచి అండర్ ఐ క్రీమ్ లేదా జెల్ ఉపయోగించండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా ఒత్తిడి లక్షణాలను తగ్గిస్తుంది. రసాయనాలతో తయారు చేసిన ఫేస్ క్రీములు వాడకుండా వీలైనంత వరకు నేచురల్ ప్రొడక్ట్స్ వాడటం మంచిది.
ఒత్తిడిని తగ్గించుకోండి: నిద్రపోయే ముందు ధ్యానం లేదా లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా స్కిన్ మెరుస్తుంది.
Also Read: చలికాలంలో.. మృదువైన చర్మం కోసం అలోవెరా
హైడ్రేటెడ్ గా ఉండండి: రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇది చర్మంలోని విష పదార్థాలను తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
ఈ అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా, మెరుస్తూ యవ్వనంగా ఉంచుకోవచ్చు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.