BigTV English

Onion Juice For Hair: వీటిని జుట్టుకు రాస్తే.. ఊడమన్నా ఊడదు !

Onion Juice For Hair: వీటిని జుట్టుకు రాస్తే.. ఊడమన్నా ఊడదు !

Onion Juice  For Hair: ప్రస్తుతం చాలా మంది ఎదర్కుంటున్న సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. అనేక కారణాల వల్ల జుట్టు రాలుతుంది. ఇదిలా ఉంటే జుట్టు రాలడాన్ని తగ్గించడానికి చాలా రకాల హెయిర్ ఆయిల్స్ , షాంపూలను కూడా వాడుతుంటారు. కానీ ఇవి జుట్టు రాలడాన్ని ఆపుతాయని ఖచ్చితంగా చెప్పలేము. ఎలాంటి సైట్ ఎఫెక్ట్స్ లేకుండా ఉల్లిపాయ రసంతో జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరిశోధనల్లో కూడా ఇది రుజువైంది.


ఉల్లిపాయ రసం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది కూడా. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఉల్లిపాయ రసంతో మరి కొన్ని పదార్థాలను కలిపితే మాత్రం ఈ బెనిఫిట్స్ రెట్టింపు అవుతాయి. మరి ఈ ఆయిల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనె :


ఒక బౌల్ తీసుకుని అందులో సమాన మోతాదులో ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనెలను వేసి రెండింటినీ మిక్స్ చేయండి. ఈ తర్వాత ఈ మిశ్రమాన్ని బ్రష్ లేదా కాటన్ తో తలకు పట్టించి 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత మీరు వాడే షాంపూతోనే తలస్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా దీనిని తరుచుగా వాడటం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లిపాయ రసం, నిమ్మకాయ:

ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ రసం, నిమ్మరసాలను సమాన మోతాదులో తీసుకుని బాగా మిక్స్ చేయండి . ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయండి. కుదుళ్ల నుంచి కుదుళ్ల వరకు పట్టించండి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి ఇలా తరుచుగా చేయడం వల్ల జుట్టు మూలాల నుంచి బలంగా మారుతుంది. అంతే కాకుండా స్కాల్ప్ లోని మురికి కూడా తొలగిపోతుంది. జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది.

Also Read: ఇంట్లోనే ఫేస్ సీరం.. తయారు చేసుకోండిలా ?

కలబంద, ఉల్లిపాయ రసం:

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కలబంద, ఉల్లిపాయ రసంలను సమపాళ్లలో వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు జుట్టు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది.

(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×