BigTV English

Seeds Benefits : సమ్మర్.. ఈ సీడ్స్‌తో వేడి తగ్గించేయండి..!

Seeds Benefits : సమ్మర్.. ఈ సీడ్స్‌తో వేడి తగ్గించేయండి..!
Seeds For Body Heat

Seeds For Body Heat (today’s latest news):


ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు మొదలయ్యాయి. వాతావరణం చూస్తుంటే ఎండలు దంచికొట్టేలా కనిపిస్తుంది. బయటకు వెళ్లాలంటే భానుడి ప్రభావంతో బయపడే పరిస్థితి ఏర్పడింది. సమ్మర్ వస్తే శరీరంలో కూడా అనేక మార్పులు సంభవిస్తాయి. కొందరి శరీరం అధిక వేడికి గురవుతుంది. అటువంటి వారు సమ్మన్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

సమ్మర్ మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. శరీరంలో నీటిశాతం తగినంత ఉండేలా చూసుకోవాలి. శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాన్ని తీసుకోండి. కొన్ని రకాల విత్తనాలు కూడా సమ్మర్‌ నుంచి మీ శరీరాన్ని రక్షిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.


Read More : వేసవిలో మీ చర్మాన్ని మెరిపించండి..!

జీలకర్ర మన అందరికి తెలిసిందే. మన ఎక్కువగా వీటిని వంటకాల్లో ఉపయోగిస్తాము. సమ్మర్‌లో జీలకర్రను వంటల్లో వేయడం అసలు మర్చిపోవద్దు. ఇది శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను కూడా జీలకర్ర సులభతరం చేస్తుంది.

చియా విత్తనాలు సమ్మర్‌లో మీ శరీరానికి చాలా మంచిది. వీటిలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. చియా గింజలు శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. అలానే ఈ గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చియా విత్తనాల జ్యూస్ శరీరాన్ని చల్లగా చేస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్ శాఖాహారులకు చాలా ముఖ్యమైనవి. వీటిని వారు కచ్చితంగా తినాలి. ఈ సీడ్స్ శరీరంలో ఫ్యాట్ లోపం రాకుండా చూస్తాయి. జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫ్లాక్ సీడ్స్ గుండె ఆరోగ్యానికి మంచిది.

సోంపు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూస్తాయి. భోజనం తర్వాత కాస్త సోంపు నమిలితే జీర్ణక్రియకు మంచిది. శరీరాన్ని చల్లగా ఉంచడం కోసం సోంపును నీటిలో మరిగించి ఆ నీటిని తాగండి. సోంపుతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

సమ్మర్‌లో గసగసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలోని అధిక వేడిని తొలగిస్తాయి. వీటిలో ఉండే ఆల్కాలాయిడ్స్ శరీరంలోని వేడి చేరకుండా చేస్తాయి. అలానే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం గసగసాల్లో పుష్కలంగా ఉంటాయి.

Read More : సమ్మర్‌లో పర్ఫెక్ట్ డ్రింక్స్ ఇవే..!

ధనియాలు వేడి నుంచి మీ శరీరాన్ని అద్భుతంగా రక్షిస్తాయి. ఈ గింజలను బెల్లంతో కలిపి తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. సమ్మర్‌లో వీటిని ఎక్కువగా వాడండి.

మెంతులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇవి శరీరంలోని వేడిని తగ్గించడంలో ముందుంటాయి. మెంతులు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తాగడం వల్ల డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. ఉష్ణోగ్రతల కారణంగా వచ్చే కడుపునొప్పులను కూడా ఇవి నయం చేస్తాయి. ఈ సమ్మర్‌లో మెంతులు వాడి మీ శరీరాన్ని కాపాడుకోండి.

Disclaimer : ఈ కథనం వైద్య నిపుణులు సూచనల మేరకు రూపొందిచబండి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×