E-Paper
Advertisement

మార్కెట్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే వెల్లుల్లి పంట.. ఒక్క రెబ్బ ఉంటే చాలు

మార్కెట్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. ఇంట్లోనే వెల్లుల్లి పంట.. ఒక్క రెబ్బ ఉంటే చాలు
Advertisement

Grow Garlic Plant At Home| వంటల్లో వెల్లుల్లి లేకపోతే చాలా వంటకాల రుచే మారిపోతుంది. పప్పు, కూరలు, పచ్చళ్లు ఇలా ఎన్నో వంటకాల్లో వెల్లుల్లిని ఉపయోగిస్తుంటాం. అయితే ప్రతిసారీ మార్కెట్‌కు వెళ్లి వెల్లుల్లి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఒక చిన్న కుండీలో కేవలం ఒక్క వెల్లుల్లి రెబ్బతో పెద్ద మొక్క పెంచుకోవచ్చు. దీనికి పెద్ద తోట అవసరం లేదు. కొద్దిగా మట్టి, ఒక కుండీ, సరైన సూర్యరశ్మి ఉంటే చాలు. మరి ఇంట్లోనే తాజా వెల్లుల్లి ఆ ప్రక్రియ వివరాలు చూద్దాం.

ముందుగా ఆరోగ్యకరమైన వెల్లుల్లి రెబ్బ ఎంచుకోండి

వెల్లుల్లి మొక్కను పెంచడానికి ముందుగా మంచి రెబ్బను ఎంచుకోవాలి. పెద్దగా, గట్టిగా, ఎలాంటి మచ్చలు లేకుండా ఉన్న రెబ్బను తీసుకోవాలి. మెత్తగా ఉన్నవి, కుళ్లినవి లేదా ఎండిపోయిన రెబ్బలు ఉపయోగించకూడదు. రెబ్బపై ఉండే పలుచని పొట్టును తొలగించకూడదు. ఇది మొక్క పెరిగే సమయంలో రెబ్బకు రక్షణగా ఉంటుంది. వెల్లుల్లి గడ్డ నుంచి రెబ్బను వేరు చేసిన వెంటనే నాటడం మంచిది.

సరైన కుండీ, మట్టి సిద్ధం చేసుకోండి

Advertisement

వెల్లుల్లి పెంచడానికి కనీసం 8 నుంచి 10 అంగుళాల లోతు ఉన్న కుండీ ఎంచుకోండి. కుండీ అడుగున నీరు బయటకు వెళ్లేందుకు రంధ్రాలు ఉండాలి. మట్టిని సిద్ధం చేసేటప్పుడు తోట మట్టిలో కొద్దిగా పాత సేంద్రియ ఎరువు కలపాలి. అలాగే ఇసుక లేదా కోకోపీట్ కలిపితే నీరు సులభంగా బయటకు వెళ్తుంది. మట్టి గుల్లగా, పోషకాలతో నిండి ఉండాలి.

వెల్లుల్లి రెబ్బ ఇలా నాటాలి

ముందుగా కుండీలో 2 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో చిన్న గుంత చేయండి. వెల్లుల్లి రెబ్బ మొన భాగం పైకి ఉండేలా నాటాలి. తర్వాత మట్టితో పూర్తిగా కప్పాలి. ఒకే కుండీలో ఎక్కువ రెబ్బలు నాటాలనుకుంటే వాటి మధ్య తగినంత దూరం ఉంచాలి. ఇలా చేస్తే ప్రతి మొక్కకు ఎదగడానికి అవసరమైన స్థలం లభిస్తుంది.

మొక్కకు సూర్యరశ్మి అవసరం

Advertisement

వెల్లుల్లి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సూర్యరశ్మి చాలా అవసరం. ప్రతిరోజూ కనీసం ఆరు గంటల పాటు ఎండ తగిలే ప్రదేశంలో కుండీని ఉంచాలి. ఇంటి బాల్కనీ లేదా టెర్రస్ ఇందుకు అనువుగా ఉంటుంది.

నీటిని సరైన మోతాదులో పోయండి

మొక్క పెరిగే సమయంలో మట్టిలో కొద్దిగా తేమ ఉండాలి. అయితే ఎక్కువ నీరు పోస్తే రెబ్బ కుళ్లిపోయే ప్రమాదం ఉంది. మట్టి పైపొర ఎండినప్పుడు మాత్రమే నీరు పోయాలి. కుండీలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

Also Read: రోజుకు 10,000 అడుగులు వాకింగ్ చేయడం మంచిది.. ఆఫీసులో 9 గంటలు డెస్క్ జాబ్ చేసేవారు ఎలా చేయాలి?

నాలుగు నుంచి ఐదు నెలల్లో వెల్లుల్లి పంట సిద్ధం

సాధారణంగా వెల్లుల్లి పంట చేతికి రావడానికి 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవడం ప్రారంభిస్తే కోతకు సిద్ధమవుతున్నట్లు గుర్తించాలి. మొక్కను జాగ్రత్తగా బయటకు తీసి వెల్లుల్లి గడ్డలు సేకరించాలి.

Also Read: రోజూ ఆఫీస్ వెళ్లేందుకు మంచి స్కూటీ కొనాలనుకుంటున్నారా? మంచి మైలేజీ ఇచ్చే బెస్ట్ మోడల్స్ ఇవే

వెల్లుల్లి గడ్డలను ఎండబెట్టి నిల్వ చేసుకోండి

కోత తర్వాత గడ్డలకు అంటుకున్న మట్టిని తొలగించాలి. వెంటనే కడగకుండా, గాలి బాగా ఆడే నీడ ఉన్న ప్రదేశంలో కొన్ని రోజులు ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత పొడి, చల్లని ప్రదేశంలో నిల్వ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే పండించిన తాజా వెల్లుల్లిని ఉపయోగించుకుంటే వంటల్లో కూడా రుచి, తాజాదనం ఉంటుంది.

Related News

కొత్త ఇంటికి ఎలాంటి ఫ్లోరింగ్ వేయించాలి? మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేసే 5 ఫ్లోరింగ్ డిజైన్స్

చాణక్య నీతి.. జీవితంలో ఈ 5 సందర్భాల్లో భావోద్వేగాలకు లొంగకండి లేకుంటే భారీ నష్టమే

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఇంట్లో తయారు చేసే ఈ బాడీ స్క్రబ్స్‌ ట్రై చేయండి

పిల్లల మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఎలా? ప్రతిరోజు ఇలా మాట్లాడితే స్వయంగా చెప్పేస్తారు

కంటి పరీక్షల్లో అంతా నార్మల్.. కానీ చీకటి పడితే చూపు మందగిస్తోందా? కొత్త జన్యు వ్యాధిని గుర్తించిన శాస్త్రవేత్తలు!

బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా నూడిల్స్ కట్లెట్! ఇంట్లోనే ఈజీగా చేయండిలా

ఆరెంజ్ గ్లో కోసం ఇదేం ప్రయోగం! వైరల్ ట్రెండ్‌పై షాకింగ్ ఫ్యాక్ట్స్

Big Stories

Advertisement
×