Asthma Symptoms: ఉబ్బసం అనేది ఒక రకమైన ఊపిరితిత్తుల వ్యాధి. ఇది శ్వాస తీసుకోవడంలో సమస్యలను కలిగిస్తుంది. ఊపిరిత్తుల వ్యాధితో ఇబ్బంది పడే వారిలో శ్వాస వ్యవస్థ చాలా వరకు దెబ్బతింటుంది. ఫలితంగా వాయు మార్గాలు ఉబ్బి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. ఇదిలా ఉంటే ఆస్తమా జన్యు పరంగా కూడా సంక్రమిస్తుంది. తల్లికి ఆస్తమా ఉంటే బిడ్డకు ఆస్తమా వచ్చే అవకాశం 25 % ఉంటుంది. అంతే కాకుండా తల్లి దండ్రులకు ఇద్దరికీ ఆస్తమా ఉంటే.. పిల్లలకు 50 శాతం ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తమా ఉన్నవారికి లక్షణాలు బాల్యంలోనే కనిపించడం ప్రారంభమవుతాయి.
పిల్లలలో ఆస్తమా యొక్క కారణాలు, లక్షణాలు:
ఈ వ్యాధికి కారణాన్ని ఖచ్చింతంగా చెప్పలేరు. కానీ బాల్యంలో పిల్లల రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇది పిల్లలలో సులభంగా సంభవిస్తుంది. అందుకే వారి ఊపిరితిత్తులు సులభంగా ఇన్ఫెక్షన్ కు గురవుతాయి. పిల్లలలో కనిపించే ఈ లక్షణాల ద్వారా.. మీ బిడ్డ ఆస్తమాతో బాధపడుతున్నారో లేదో మీరు తెలుసుకోవచ్చు. అంతే కాకుండా సకాలంలో చికిత్స కూడా చేయవచ్చు.
తరచుగా దగ్గు:
ఆస్తమాతో బాధపడుతున్న పిల్లలకు దగ్గు సమస్య ఎక్కువ రోజులు కొనసాగుతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత దగ్గు ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా పిల్లలు ఏదైనా వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసినా కూడా దగ్గు సమస్య ఉంటుంది. దగ్గు కూడా ఎక్కువగా ఉత్సాహంగా ఉండటం లేదా బిగ్గరగా నవ్వడం వల్ల మొదలవుతుంది.
ఆస్తమాతో బాధపడే పిల్లలు ఏదైనా కఠినమైన పని చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం ప్రారంభిస్తారు. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఉంటుంది. కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు మెట్లు ఎక్కేటప్పుడు లేదా సైక్లింగ్ చేసేటప్పుడు అలసిపోతే.. గనకశ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడకండి.
Also Read: సమ్మర్‌లో ఎగ్స్ ఎక్కువగా తింటే.. వేడి చేస్తుందా ?
ఛాతీలో ఇబ్బంది:
మీ పిల్లలు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఛాతీలో బిగుతుగా అనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం చాలా ముఖ్యం. ఛాతీలో బిగుతుగా అనిపించడం కూడా ఆస్తమా లక్షణం.
పిల్లలలో దగ్గు:
నిద్రపోతున్నప్పుడు పిల్లలకు ఊపిరి సరిగ్గా ఆడకపోవడం లేదా ఈల వంటి శబ్దం వినిపిస్తే.. ఆస్తమా యొక్క ప్రధాన లక్షణాలలో ఇది కూడా ఒకటి అని గుర్తించండి.
దుమ్ము, పొగకు అలెర్జీ:
ఇంటిని శుభ్రపరిచేటప్పుడు లేదా పొగకు గురైనప్పుడు పిల్లలు ఎక్కువగా తుమ్మడం లేదా దగ్గు ప్రారంభిస్తే.. వారికి దుమ్ము లేదా పొగ అంటే అలెర్జీ అని అర్థం. దీనిని కూడా ఆస్తమా లక్షణంగా పరిగణించవచ్చు. ఇలాంటి పిల్లలు త్వరగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు.