Sodara Movie Review : సంపూర్ణేష్ బాబు నుండి ఒక సినిమా వస్తుంది అంటే సోషల్ మీడియా బ్యాచ్ అలర్ట్ అవుతారు. వాళ్లకి సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీలని ట్రోల్ చేసేందుకు స్టఫ్ దొరుకుతుందని. ఇప్పటికీ సంపూ సినిమాకి వాళ్ళ అటెన్షన్ ఉంది. ఇలాంటి టైంలో సంపూ నుండి కొంత గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా ‘సోదర’. మరి ఇది టార్గెటెడ్ ఆడియన్స్ ని మెప్పించిందా? లేదా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
తెలంగాణలో ఓ మారుమూల గ్రామంలో నివసించే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు చిరంజీవి(సంపూర్ణేష్ బాబు), పవన్(సంజోష్). సోడా బిజినెస్ చేసుకుంటూ కుటుంబ బాధ్యతల్లో పాలుపంచుకుంటాడు చిరు. అతనికి తన తమ్ముడు అంటే చాలా ఇష్టం. పవన్ కి కూడా అన్నయ్య అంటే ఎంతో ప్రేమ. చిరంజీవికి వయసొచ్చినా పెళ్లవ్వట్లేదని పవన్ అలాగే అతని కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు.ఇలాంటి టైంలో వాళ్ళ పక్కింట్లోకి దివి(ఆర్తి గుప్తా) అండ్ ఫ్యామిలీ వస్తుంది.
దివితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు చిరు. అతనికి తెలీకుండా అతని తమ్ముడు పవన్ కూడా దివికి లైన్ ఇస్తూ ఉంటాడు. ఒక రోజు ఈ విషయం ఇద్దరికీ తెలిసినా.. ఇద్దరూ కాంప్రమైజ్ కారు. ఇలాంటి టైంలో చిరు ప్రేమని దివి రిజెక్ట్ చేస్తుంది. దీంతో దివి ఫ్యామిలీ ఇల్లు ఖాళి చేసి వెళ్ళిపోయేలా చేస్తాడు పవన్. దీంతో పవన్ పై చిరుకి కోపం వస్తుంది? అసలు చిరు ప్రేమకి పవన్ ఎందుకు అడ్డుపడ్డాడు? అతని బ్యాక్ స్టోరీ ఏంటి? చివరికి చిరు జీవితం ఏమైంది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా?
విశ్లేషణ :
సంపూర్ణేష్ బాబు ఎక్కువగా స్పూఫ్ కామెడీ సినిమాలు చేస్తాడనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఎక్కువగా సోషల్ మీడియా మీమ్ పేజులు, ట్రోలింగ్ పేజులకి ఫీడింగ్ ఇస్తుంటాయి. ‘మార్టిన్ లూథర్ కింగ్’ వంటి సినిమా తీసినా అందులో కూడా ఓ కైండ్ ఆఫ్ కామెడీ ఉంటుంది. ‘సోదరా’ లో ఆ తరహా కామెడీ ఉండదని ఎమోషన్ పై కథ సాగుతుందని సంపూర్ణేష్ ప్రమోషన్స్ లో తెలిపాడు. అయినప్పటికీ ‘సోదర’లో మినిమమ్ కామెడీ ఉంటుంది. అది రెగ్యులర్ గానే ఉన్నా పెద్ద కంప్లైంట్ చేయలేము.
పవన్ లవ్ స్టోరీ రెగ్యులర్ గా రొటీన్ గా సాగదీసినట్టు ఉంటుంది. అది తీసేస్తే ఫస్ట్ హాఫ్ పాసబుల్ గా అనిపించొచ్చు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించని విధంగా డిజైన్ చేశారు. అందువల్ల సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్ లో కూడా సిట్యుయేషనల్ కామెడీ ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సాంకేతిక లోపాలు ఉన్నాయి. కొంతమంది నటీనటులకు డబ్బింగ్ సెట్ అవ్వలేదు. అలాగే తెలంగాణ స్లాంగ్ కూడా పట్టి పట్టి మాట్లాడిన ఫీలింగ్ కలుగుతుంది.
అయితే నిర్మాత చంద్ర… సంపూర్ణేష్ బాబు సినిమాకి ఎంతవరకు ఖర్చుపెట్టాలో.. అంతవరకు ఖర్చుపెట్టాడు. ఎటువంటి లోటు చేయలేదు. దర్శకుడు మాన్ మోహన్ మేనంపల్లి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ పర్వాలేదు అనిపించాయి. సునీల్ కశ్యప్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది.
నటీనటుల విషయానికి వస్తే.. సంపూర్ణేష్ బాబు తన శైలికి భిన్నంగా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అతని గత సినిమాల ప్రభావం ఇతనిపై గట్టిగానే ఉండటం వల్ల దాని నుండి బయటపడటానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. అయితే తన మార్క్ కామెడీ కొన్ని సీన్స్ లో నవ్విస్తుంది. తమ్ముడి పాత్ర చేసిన సంజోష్ నుండి పెద్దగా పెర్ఫార్మన్స్ ఆశించం కాబట్టి పర్వాలేదు అనిపిస్తుంది.
హీరోయిన్ ఆర్తి గుప్తా అందంగా కనిపించింది. సహజంగా కూడా కనిపించింది. ప్రాచీ బన్సాల్ లుక్స్ ఓకే.యాక్టింగ్ విషయంలో కూడా పాస్ మార్కులు వేయించుకుంటుంది. బాబు మోహన్ , గెటప్ శ్రీను, బాబా భాస్కర్ వంటి తెలిసిన నటులు ఉండటం వల్ల వాళ్ళ పంచ్..లు ఎంజాయ్ చేయగలం.
ప్లస్ పాయింట్స్ :
ఇంటర్వెల్ ట్విస్ట్
సెకండాఫ్
కామెడీ
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లో వచ్చే కాలేజ్ ఎపిసోడ్స్
కొంతమేర సాంకేతిక లోపాలు
మొత్తంగా.. ఈ ‘సోదర’ రొటీన్ స్టోరీనే అయినప్పటికీ సంపూర్ణేష్ బాబు కోసం థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ కి కాస్త టైం పాస్ ఫీలింగ్ కలిగిస్తుంది.
Sodara Telugu Movie Rating : 2.5/5