Fruits For Diabetes: సమ్మర్ వచ్చిందంటే.. డీహైడ్రేషన్ , అలసట సర్వసాధారణం అవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. తినే ఆహారం, డ్రింక్స్ విషయంలో చిన్న పొరపాటు కూడా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. పండ్లు శరీరానికి పోషకాలను అందిస్తాయి. కానీ డయాబెటిస్ ఉన్న వారు కొన్ని రకాల పండ్లను తినకూడదు ఎందుకంటే చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుంది.
డయాబెటిస్ రోగులు ఖచ్చితంగా వారి ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకోవాలి. ఇవి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. వేసవిలో డయాబెటిస్ రోగులకు సహజ ఔషధంగా ఉపయోగపడే 5 ప్రత్యేక పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నేరేడు పండ్లు:
నేరేడు పండ్లలో ఉండే ‘జాంబోలిన్’, ‘జాంబోసిన్’ అనే సహజ సమ్మేళనాలు చక్కెర శోషణను నెమ్మది చేస్తాయి. ఈ పండు రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేసవిలో వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇన్సులిన్ ప్రభావం మెరుగుపడుతుంది. దీని విత్తనాలను ఎండబెట్టి.. పొడి చేసి తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నేరేడు పండ్లలో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇవి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా చేస్తాయి. సీజన్ సమయంలో నేరేడు పండ్లు తినడం అనేది షుగర్ పేషెంట్లకు ఉపయోగకరంగా ఉంటుంది.
జామ పండ్లు:
జామలో ఉండే కరిగే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కార్బోహైడ్రేట్ల శోషణను నియంత్రిస్తుంది. తక్కువ గ్లైసెమిక్ సూచిక కారణంగా.. ఇది మధుమేహ రోగులకు సురక్షితం. వీటి తొక్క తీసి తినడం మంచిదే. ఎందుకంటే కొన్నిసార్లు జామ తొక్క గ్యాస్‌కు కారణమవుతుంది.
Also Read: బ్లాక్ రైస్ తింటే.. ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోవడం గ్యారంటీ !
దోసకాయ:
దోసకాయ నీరు అధికంగా ఉండే పండు. డయాబెటిస్ డైట్‌లో దీనిని చేర్చుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో , రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో దీన్ని సలాడ్‌గా లేదా నిమ్మ-ఉప్పుతో కలిపి తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో ఉండే పోషకాలు సమ్మర్ లో ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే ప్రతి రోజు వీటిని తినడం వల్ల కూడా బోలెడు ప్రయోజనాలు ఉంటాయి.
స్ట్రాబెర్రీలు :
స్ట్రాబెర్రీలలో ఉండే ఆంథోసైనిన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రుచిలో తీపిగా ఉన్నప్పటికీ.. రక్తంలో చక్కెరపై చెడు ప్రభావాన్ని చూపవు. ప్రతిరోజూ కొద్ది మొత్తంలో వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.