E-Paper
Advertisement

పిల్లలు తరచూ అనారోగ్యానికి ఎందుకు గురవుతారు.. డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

పిల్లలు తరచూ అనారోగ్యానికి ఎందుకు గురవుతారు.. డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Advertisement

children Fell sick Frequently| పిల్లలకు తరచూ జలుబు, దగ్గు, జ్వరం లేదా ఇతర ఇన్ఫెక్షన్లు రావడం చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. ఒక సమస్య తగ్గిన కొద్దిరోజులకే మరో సమస్య మొదలైతే పిల్లల ఆరోగ్యం గురించి భయం కలగడం సహజమే. అయితే చిన్నపిల్లలకు తరచూ ఇన్ఫెక్షన్లు రావడం.. వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని సంకేతం కాదు. పిల్లల రోగనిరోధక వ్యవస్థ వయసుతో పాటు క్రమంగా అభివృద్ధి చెందుతుంది. కొత్త వైరస్‌లు, బ్యాక్టీరియాలను ఎదుర్కొంటూ క్రమంగా అలవాటు పడుతుంది. ఇందుకోసం సమయం పడుతుంది.

చిన్నపిల్లలకు తరచూ ఇన్ఫెక్షన్లు రావడం సాధారణమేనా?

చిన్న వయసులో పిల్లలకు సంవత్సరంలో పలుమార్లు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావచ్చు. ప్లేస్కూల్ లేదా డేకేర్‌కు వెళ్లే పిల్లలకు ఇతర పిల్లలతో ఎక్కువగా పరిచయం ఉంటుంది. అందువల్ల ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్లు తరచుగా వ్యాపించే అవకాశముంది. క్లాస్‌రూమ్‌లలో ఎక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల వైరస్‌లు సులభంగా వ్యాప్తి చెందుతాయి. కాలుష్యం కూడా పిల్లల శ్వాసకోశ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. సరైన పోషకాహారం లేకపోవడం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే తరచూ జలుబు రావడం మాత్రమే చూసి పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని భావించకూడదు.

అనారోగ్యం తర్వాత పిల్లల పరిస్థితిని గమనించాలి

Advertisement

పిల్లలకు ఎన్నిసార్లు అనారోగ్యం వచ్చిందన్నదానికంటే, వారు ఎలా కోలుకుంటున్నారన్నది ముఖ్యమైన విషయం. అనారోగ్యం లేని సమయంలో పిల్లలు చురుగ్గా ఉంటే సాధారణంగా ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. వారి ఎత్తు, బరువు వయసుకు తగినట్లుగా పెరుగుతున్నాయా అని తల్లిదండ్రులు గమనించాలి. బరువు పెరగకపోవడం లేదా ఎదుగుదల తగ్గడం కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

కొన్ని లక్షణాలను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు

పిల్లలకు తరచూ తీవ్రమైన న్యుమోనియా వస్తే మాత్రం దాన్ని సీరియస్‌గా పరిగణించాలి. వైద్యులకు తప్పనిసిరగా చూపించాలి. తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్లు పదేపదే రావడం కూడా గమనించాల్సిన లక్షణమే. చర్మం లేదా శరీరంలోని ఇతర భాగాల్లో తరచూ పుండ్లు లేదా చీము రావడం కూడా ముఖ్యమైన సంకేతం. చిన్న వయసు దాటిన తర్వాత కూడా నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి. సాధారణంగా కనిపించని బ్యాక్టీరియాల వల్ల పదేపదే ఇన్ఫెక్షన్లు వస్తే ప్రత్యేక పరీక్షలు అవసరం కావచ్చు.

అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వకండి

Advertisement

పిల్లలకు తరచూ జ్వరం లేదా జలుబు వస్తే కొంతమంది తల్లిదండ్రులు వెంటనే యాంటీబయాటిక్స్ ఇస్తారు. అయితే సాధారణ వైరల్ జలుబు వంటి సమస్యలకు యాంటీబయాటిక్స్ పనిచేయవు.
అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడితే దుష్ప్రభావాలు కలగవచ్చు. భవిష్యత్తులో యాంటీబయాటిక్ నిరోధకత కూడా పెరగవచ్చు. కాబట్టి వైద్యుడి సలహా లేకుండా పిల్లలకు యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు.

అలర్జీ లేదా ఆస్తమా కూడా కారణం కావచ్చు

కొన్ని సందర్భాల్లో అలర్జీ లేదా ఆస్తమాను పదేపదే వచ్చే జలుబుగా భావించే అవకాశం ఉంటుంది. తరచూ దగ్గు, తుమ్ములు, ముక్కు దిబ్బడ లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. సరైన కారణాన్ని గుర్తించడం వల్ల అవసరం లేని మందులను తగ్గించవచ్చు.

Also Read: జలుబు చేసిందా? ఈ ఫుడ్స్ అసలు తినకూడదు..

తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

పిల్లలకు తరచూ లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. పిల్లల ఎదుగుదల, పోషకాహారం, టీకాలు, గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్లను డాక్టర్లు పరిశీలిస్తారు. అవసరాన్ని బట్టి రక్త పరీక్షలు, అలర్జీ పరీక్షలు లేదా ఇతర పరీక్షలను సూచిస్తారు. పిల్లలకు సకాలంలో అవసరమైన టీకాలు వేయించాలి. ఫ్లూ టీకా గురించి కూడా వైద్యుడిని అడగవచ్చు. ఐరన్, ప్రోటీన్, పండ్లు, కూరగాయలు వంటి పోషకాలు ఉండే ఇంటి ఆహారాన్ని పిల్లలకు అందించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తగినంత నిద్రపోవడం వంటి అలవాట్లను ప్రోత్సహించాలి. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకునే వరకు పిల్లలకు తగిన విశ్రాంతి ఇవ్వాలి.

Also Read: పిల్లల్లో వేగంగా పెరుగుతున్న ఊబకాయం? తల్లిదండ్రులు చేసే ఈ 5 తప్పులే కారణం

చాలా మంది పిల్లలు వయసుతో పాటు మెరుగుపడతారు

చిన్న వయసులో తరచూ ఇన్ఫెక్షన్లు రావడం చాలాసార్లు సాధారణ ఎదుగుదలలో భాగమే. వివిధ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొంటూ పిల్లల రోగనిరోధక వ్యవస్థ క్రమంగా బలపడుతుంది. అయితే తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, ఎదుగుదలలో సమస్యలు లేదా అసాధారణ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకూడదు. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించడం ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందవచ్చు.

Related News

స్వైన్ ఫ్లూ వస్తే పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

బెడ్‌పై పడుకోగానే నిద్ర రావడం లేదా? గంటల తరబడి ఆలోచిస్తూ ఉన్నారా? పరిష్కారం ఇదిగో

రూ.1.3 లక్షల జీతం.. నెల ఖర్చు రూ.15000 మాత్రమే.. అయినా జీవితంలో అసంతృప్తి

నామ జ్యోతిష్యం.. ఈ పేర్లు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే అదృష్టం పట్టినట్లే

ఎవరికీ హాని చేయలేదు అయినా జీవితంలో ఒంటరిగా మిగిలిపోతారు.. అయినవాళ్లను దూరం చేసే 7 అలవాట్లు

ఆరోగ్యానికి మేలు చేసే జామపండు సీజన్ వచ్చేసింది.. కొనేటప్పుడు తీయని పండు ఇలా గుర్తించండి

మార్కెట్‌లో నకిలీ చక్కెర.. ఫేక్ షుగర్‌ని ఇలా గుర్తించండి

Big Stories

Advertisement
×