Nannari Sharbhat: వేసవిలో శరీరం చల్లగా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే నన్నారి వేర్లతో తయారు చేసే షర్బత్ ఒక సాంప్రదాయ శీతల పానీయం, ఇది ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఈ షర్బత్ వేసవిలో శరీరాన్ని చల్లబరచడమే కాక, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే నన్నారి యొక్క వేర్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా మందికి ఈ మొక్క ఉందని తెలియదు కానీ దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
నన్నారి షర్బత్ ఆరోగ్య ప్రయోజనాలు
శరీరాన్ని చల్లబరుస్తుంది:
నన్నారి షర్బత్ వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించే సహజమైన పానీయం. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. ఆయుర్వేదంలో నన్నారి వేర్లు శీతల గుణం కలిగి ఉంటాయని చెబుతారు, ఇది శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది.
రక్త శుద్ధి:
నన్నారి వేర్లలో డిటాక్సిఫైయింగ్ గుణాలు ఉన్నాయి, ఇవి రక్తంలోని టాక్సిన్‌లను తొలగించడంలో సహాయపడతాయి. ఇది శరీరంలోని వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతుంది, దీనివల్ల రక్తం శుద్ధి అవుతుంది. అంతేకాకుండా ఇది చర్మ సమస్యలైన మొటిమలు, దద్దుర్లు వంటి వాటిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
చర్మ ఆరోగ్యం:
నన్నారి షర్బత్ చర్మానికి కాంతిని, నిగారింపును అందిస్తుంది. ఇది చర్మంలో వృద్ధాప్య ఛాయలను తగ్గించి, చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. దీనిలోని యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి, ఇది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.
మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నివారణ:
ఈ వేర్లలో డైయురెటిక్ గుణాలు ఉన్నాయి, ఇవి మూత్ర ఉత్పత్తిని పెంచి, మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కిడ్నీలు సమర్థవంతంగా పనిచేసేలా చేసి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది:
నన్నారి షర్బత్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది అజీర్తి, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆయుర్వేదంలో నన్నారిని పిత్త దోషాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు, ఇది జీర్ణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచుతుంది. నన్నారి వేర్లలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో వాపులను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పులతో బాధపడే వారికి ఈ షర్బత్ తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
బరువు తగ్గించడంలో సహాయపడుతుంది:
ఇది శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. జీవక్రియ రేటును మెరుగుపరచి, శరీరంలో టాక్సిన్‌లను తొలగించడం ద్వారా బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
నోటి పుండ్ల నివారణ:
నన్నారి షర్బత్ నోటి పుండ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని శీతల గుణం నోటిలోని వాపును, దాహాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో నన్నారి వేర్లను కుష్టు వ్యాధి , సిఫిలిస్, ఇతర చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. ఇది పిత్త దోషాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నన్నారి వేర్లలోని పోషక గుణాలు:
నన్నారి వేర్లలో యాంటీ-ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఇతర ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే, ఇందులో డైయురెటిక్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఇది శరీరంలోని అనేక వ్యవస్థలకు మేలు చేస్తుంది.
Also Read: దడ పుట్టిస్తున్న కరోనా వైరస్..! ఒక్క రోజులో ఇన్ని కేసులా..?
అయితే దీనిని ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువగా సేవించబడుతుంది. ఈ నన్నారి వేర్లను నీటిలు ఊరవైచి, ఆ నీటిని పంచదార లేదా బెల్లం పాకంతో కలిపి షర్బత్‌గా తయారు చేస్తారు. ఇది సహజమైన, రిఫ్రెషింగ్ డ్రింక్ గా పరిగణించబడుతుంది. అయితే దీనిని అతిగా సేవించడం వల్ల దీనిలోని అధిక చక్కెరలు డయాబెటిస్ వారికి సమస్యగా మారుతుంది. కావున దీనిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నయాని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.