Insomnia Cure Diet| నిద్రలేమి లేదా ఇన్సోమ్నియా సమస్యతో బాధ పడే వారి సంఖ్య ఈ రోజుల్లో వేగంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నిద్రలేమి సమస్య వ్యాపిస్తోంది. వృద్ధులతో పాటు యువత కూడా సరైన నిద్రలేక అనారోగ్యం బారిన పడుతున్నారు. అయితే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టడానికి ఆహారంలో మార్పులు చేయాలని.. ఈ చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఆహారం తినడం వల్ల ఒక్క రోజులోనే ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు.
మీ గుండె, మెదడు ఆరోగ్యానికి రోజూ 8-9 గంటలు నిరంతర నిద్ర అవసరం. స్లీప్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన కొత్త అధ్యయనం ప్రకారం.. చాలా మంది తమ రోజువారీ జీవనంలో పండ్లు తినరు. కానీ ఇది జీవనశైలి తప్పు. రోజుకు ఐదు కప్పుల పండ్లు తినడం మొదలుపెట్టడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిదని అధ్యయనంలో తేలింది. ప్రతి రోజు తినే ఆహారం, రాత్రినిద్ర నాణ్యత మధ్య ఉన్న సంబంధంపై ఈ అధ్యయనం జరిగింది. పండ్లు ఎక్కువగా తినడం వల్ల మంచి నిద్ర పడుతుందని ఈ అధ్యయనంలో ఫలితాలు వెల్లడించాయి. “24 గంటల్లోనే ఇంత పెద్ద మార్పు కనిపించడం ఆశ్చర్యకరం. ఆహారంలో మార్పులు నిద్రను మెరుగుపర్చే సహజ, సరళమైన మార్గం,” అని అధ్యయన సహ రచయిత, నిద్ర నిపుణుడు డాక్టర్ ఎస్రా తసలి చెప్పారు.
అధ్యయనం ఎలా జరిగింది?
ఈ అధ్యయనంలో ఆరోగ్యవంతమైన యువకులు పాల్గొన్నారు. వారు తమ రోజువారీ ఆహారాన్ని ఒక యాప్‌లో నమోదు చేశారు. వారి నిద్ర విధానాలు, కదలికలను మానిటర్‌తో కొలిచారు. పరిశోధకులు “స్లీప్ ఫ్రాగ్మెంటేషన్” అనే అంశాన్ని పరిశీలించారు. అంటే రాత్రి ఎన్నిసార్లు మేల్కొంటారు లేదా గాఢ నిద్ర నుండి తేలికైన నిద్రకు మారతారనే విషయాన్ని గమనించారు.
ఫలితాల్లో వెల్లడైన విషయాలు..
రోజు ఎక్కువ పండ్లు, కూరగాయలు తిన్నవారు రాత్రి మంచి నిద్రను పొందారు. పూర్తి ధాన్యాల వంటి ఆరోగ్యకరమైన కార్బ్స్ తిన్నవారు కూడా మెరుగైన నిద్రను అనుభవించారు. రోజుకు ఐదు కప్పుల పండ్లు, కూరగాయలు తిన్నవారిలో నిద్ర నాణ్యత 16 శాతం పెరిగింది. “16 శాతం అనేది గణనీయమైన మార్పు,” అని డాక్టర్ తసలి అన్నారు.
పండ్లు, కూరగాయలు నిద్రకు ఎలా ఉపకరిస్తాయి?
నిపుణుల ప్రకారం.. కాంప్లెక్స్ కార్బ్స్, పండ్లు, కూరగాయలు సరైన మోతాదులో తినడం వల్ల మంచి నిద్ర కలుగుతుంది. త్వదారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. “ఈ చిన్న మార్పులు నిద్రపై ప్రభావం చూపుతాయి. ఇది ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. మంచి నిద్ర మీ చేతుల్లో ఉంది,” అని అధ్యయన రచయిత మేరీ-పియర్ స్ట్-ఓంజ్ చెప్పారు.
ఈ ఆహారాలలో విటమిన్లు, మెగ్నీషియం, మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటాయి. మెలటోనిన్ మీ శరీర గడియారాన్ని (సర్కేడియన్ రిథమ్) నియంత్రిస్తుంది. నిద్రకు సిద్ధం చేస్తుంది.
నిద్రలేమికి కారణాలు ఏమిటి?
నిద్రలేమి అంటే సరిగ్గా నిద్రపోలేకపోవడం. నిద్రపట్టడంలో లేదా నిద్ర కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొవడం. కొందరికి ఇది చిన్న ఇబ్బంది, కానీ మరిక౦దరికి పెద్ద సమస్య.
కుటుంబ చరిత్ర: నిద్ర సమస్యలు కుటుంబంలో ఉండొచ్చు.
మెదడు క్రియ: నిద్రలేమి ఉన్నవారి మెదడు ఎక్కువ సక్రియంగా ఉండొచ్చు.
వైద్య సమస్యలు: గాయాలు, దీర్ఘకాల వ్యాధులు (ఉదా., యాసిడ్ రిఫ్లక్స్) నిద్రను బాధిస్తాయి.
మానసిక ఆరోగ్యం: ఆందోళన, డిప్రెషన్ నిద్రలేమికి కారణం.
జీవన పరిస్థితులు: ఒత్తిడి, కష్టాలు నిద్రను ప్రభావితం చేస్తాయి.
ఆరోగ్య అలవాట్లు: కెఫీన్, ఆలస్య నిద్ర అలవాట్లు సమస్యను పెంచుతాయి.
నిద్రలేమి ప్రమాద కారకాలు
తక్కువగా నిద్రపోయేవారు
మద్యం తాగేవారు
ఇంట్లో తమకు భద్రత లేని వారు
ఏదైనా భయం, ఆందోళన ఉన్నవారు
Also Read: ఇవి తింటే ఎముకలు బలంగా, ధృడంగా.. భారతీయులకు ప్రత్యేక పోషకాహారం
ఈ చిన్న ఆహార మార్పులతో మీ నిద్రను మెరుగుపరచుకోవచ్చు!