Friendship Day Gift Ideas: అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్ట్ 3 వ తేదీన( ఈ రోజు) జరుపుకుంటున్నాము. స్నేహ బంధానికి నిలువుటద్దంలా నిలిచే ఈ రోజు.. మీ స్నేహితులతో మీ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకునేందుకు ఒక మంచి అవకాశం. ఇలాంటి సందర్భంలో మీ ఫ్రెండ్స్‌కి విషెస్ తో పాటు సర్ ఫ్రైజ్ గిఫ్స్ట్ ఇవ్వండి. ఇది మీ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తుంది. మీ స్నేహితులకు ఎలాంటి బహుమతి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా ? మీ కోసం బెస్ట్ ఐడియాస్ ఇప్పుడు చూద్దాం.
1. స్పెషల్ గిఫ్ట్స్ (Personalized Gifts):
మీ ఫ్రెండ్స్‌తో మీకు ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకునేలా ఉండే బహుమతులు ఎప్పుడూ ప్రత్యేకమే. మీ ఇద్దరి పాత ఫోటోలతో కూడిన ఒక మగ్ లేదా ఫోటో ఫ్రేమ్ మీ ఫ్రెండ్స్ కి ఇవ్వండి. లేదా మీ స్నేహితుడి పేరు, లేదా మీ ఇద్దరికీ నచ్చిన ఒక మంచి కోట్‌ను రాసిన టీషర్ట్ ఇవ్వండి. ఇలాంటి గిఫ్ట్స్ ఎప్పటికీ వారికి గుర్తుండిపోతాయి.
2. గార్జెట్స్ (Tech Gifts):
మీ ఫ్రెండ్స్ గార్జెట్స్ ఇష్టపడితే.. పవర్ బ్యాంక్ లేదా మంచి బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ ఇవ్వండి. ఇవి వారికి చాలా బాగా ఉపయోగపడతాయి. సాంగ్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి హెడ్ ఫోన్స్ ఇవ్వడం బెటర్. విషెస్ తో పాటు ఇలాంటి గిప్స్ ఇస్తే.. ఈసారి ఫ్రెండ్ షిప్ డే మరింత ప్రత్యేకంగా మారుతుంది.
3. పుస్తకాలు (Books and Hobbies):
మీ ఫ్రెండ్స్‌కి చదవడమంటే ఇష్టమైతే, వారు చదవాలనుకున్న ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వొచ్చు. లేదా, వారికి ఇష్టమైన రచయిత బయోపిక్ కి సంబంధించిన పుస్తకాన్ని కూడా ఇవ్వొచ్చు. వారికి ఇష్టమైన హాబీలకు సంబంధించిన వస్తువులు, అంటే పెయింటింగ్ ఇష్టమైతే మంచి కలర్స్ , లేదా వంట ఇష్టమైతే మంచి వంట పుస్తకం ఇవ్వవచ్చు.
4. అందం, ఆరోగ్యం (Beauty and Wellness):
మీ స్నేహితుడికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంటే.. వారికి యోగా మ్యాట్ లేదా ఒక ఫిట్‌నెస్ బ్యాండ్ ఇవ్వండి. గర్స్ కి అయితే.. బ్రాండెడ్ బాడీ లోషన్, షవర్ జెల్స్, లేదా ఒక బ్యూటీ హాంపర్ కూడా ఇవ్వొచ్చు. ఇలాంటి గిప్స్ వారికి చాలా బాగా ఉపయోగపడతాయి.
5. ఇంట్లో తయారు చేసిన బహుమతులు (Handmade Gifts):
బయట కొన్న బహుమతుల కంటే.. మీరు స్వయంగా తయారు చేసిన బహుమతులు మరింత విలువైనవి. మీ చేతులతో తయారు చేసిన ఒక కార్డు, ఒక క్రాఫ్ట్ ఐటెమ్, లేదా మీ స్నేహితులకు ఇష్టమైన వంటకం తయారు చేసి వారికి ఇస్తే అది వారి మనసుకి బాగా నచ్చుతుంది.
6. కలిసి గడపడం (Experiences):
బహుమతుల కంటే.. కలిసి గడిపిన సమయానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ స్నేహితుల దినోత్సవం రోజున మీ ఇద్దరికీ ఇష్టమైన సినిమా చూడడానికి వెళ్లడం లేదా, చాలా కాలం నుంచి వెళ్లాలనుకున్న టూర్‌కి ప్లాన్ చేయండి. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
Also Read: వీళ్లు.. బీట్ రూట్ జ్యూస్ అస్సలు తాగకూడదు తెలుసా ?
స్నేహితుల దినోత్సవం రోజున, బహుమతి విలువ ఎంత అనేది ముఖ్యం కాదు.. మీ స్నేహితుడి పట్ల మీకు ఉన్న ప్రేమ, గౌరవం ముఖ్యం. చిన్న బహుమతి అయినా, అది ప్రేమతో ఇస్తే చాలా గొప్పగా ఉంటుంది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా మీకు మీ స్నేహితులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!