BigTV English
Advertisement

Bad Breath: నోటి దుర్వాసనకు చెక్ పెట్టే.. హోం రెమెడీస్ ఇవే !

Bad Breath: నోటి దుర్వాసనకు చెక్ పెట్టే.. హోం రెమెడీస్ ఇవే !

Bad Breath:  నోటి దుర్వాసన (హాలిటోసిస్) అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య. ఇది పంటి ఆరోగ్యం సరిగా లేకపోవడం, జీర్ణ సమస్యలు లేదా కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. ఈ సమస్యను సమర్థవంతంగా.. సహజంగా పరిష్కరించడానికి.. ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించవచ్చు. ఈ హోం రెమెడీస్ నోటిని తాజాగా ఉంచడానికి సహాయపడతాయి. అంతే కాకుండా పంటి సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


నోటి దుర్వాసన (Bad Breath) అంటే ఏమిటి ?
నోటి దుర్వాసన అనేది చాలామందిని వేధించే ఒక సాధారణ సమస్య. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా.. ఇతరులతో మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా అనిపించేలా చేస్తుంది. నోటిలో ఉన్న బ్యాక్టీరియా ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పుడు సల్ఫర్ సమ్మేళనాలు విడుదలవుతాయి. దీనివల్ల నోటి దుర్వాసన వస్తుంది. సరైన ఓరల్ కేర్ పాటించకపోవడ, తక్కువ లాలాజలం ఉత్పత్తి, కొన్ని ఆహారాలు (వెల్లుల్లి, ఉల్లిపాయలు), పొగాకు ఉత్పత్తులు, జీర్ణ సంబంధిత సమస్యల వంటివి నోటి దుర్వాసనకు ప్రధాన కారణాలు. ఈ సమస్యను ఇంటి వద్దే సులభంగా పరిష్కరించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.

1. మౌత్ వాష్‌గా కొబ్బరి నూనె:
ఆయిల్ పుల్లింగ్ అనేది పురాతన ఆయుర్వేద పద్ధతి. ఒక చెంచా కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని, 15-20 నిమిషాల పాటు పుక్కిలించాలి. ఇది నోటిలో ఉండే బ్యాక్టీరియా, మలినాలను తొలగించి.. నోటిని శుభ్రపరుస్తుంది. ప్రతి ఉదయం పరగడుపున ఈ పద్ధతిని పాటించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. ఫలితంగా పళ్లు కూడా తెల్లగా మారుతాయి.


2. గ్రీన్ టీతో గార్గిల్ చేయడం:
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది నోటిలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. భోజనం తర్వాత ఒక కప్పు గ్రీన్ టీ తాగడం లేదా గ్రీన్ టీతో పుక్కిలించడం వల్ల నోరు తాజాగా ఉంటుంది. ఫలితంగా నోటి దుర్వాసన తగ్గుతుంది.

3. యాపిల్ సైడర్ వెనిగర్ :
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అజీర్ణం వల్ల వచ్చే నోటి దుర్వాసనకు ఇది ఒక మంచి పరిష్కారం. అలాగే.. యాపిల్ సైడర్ వెనిగర్ తో గార్గిల్ చేయడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా కూడా తగ్గుతుంది.

4. పుదీనా ఆకులు:
పుదీనా సహజంగానే నోటిని తాజాగా ఉంచే గుణాలు కలిగి ఉంటుంది. కొన్ని పుదీనా ఆకులను నమలడం వల్ల తక్షణమే నోటి దుర్వాసన తగ్గుతుంది. పుదీనాలోని మెంతోల్ సువాసన నోటిని రిఫ్రెష్ చేస్తుంది. పుదీనా టీ తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

Also Read: 2 వారాల పాటు చియా సీడ్స్ తింటే.. శరీరంలో జరిగే మార్పులివే !

5. మెంతుల టీ:
మెంతులలో జీర్ణవ్యవస్థకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఒక చెంచా మెంతులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి.. ఆ నీటిని టీగా తాగడం వల్ల జీర్ణ సమస్యల వల్ల వచ్చే నోటి దుర్వాసన తగ్గుతుంది.

6. లవంగాలు, యాలకులు :
లవంగాలు, యాలకులు సహజమైన మౌత్ ఫ్రెషనర్లు. వీటిలో బలమైన సువాసన, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. భోజనం తర్వాత ఒక లవంగం లేదా యాలకుల గింజలను నోటిలో ఉంచుకుని నమలడం వల్ల నోరు తాజాగా ఉంటుంది.

ఈ హోం రెమెడీస్‌‌తో పాటు.. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, నాలుకను శుభ్రం చేయడం, దంతాల మధ్య శుభ్రం చేయడానికి ఫ్లాస్ వాడటం చాలా ముఖ్యం. ఏవైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Related News

Amla: ఉసిరి జ్యూస్ లేదా పొడి, దేనితో.. ఎక్కువ ప్రయోజనాలు ?

Electrolytes: ఎలక్ట్రోలైట్స్ అంటే ఏమిటి?.. మన శరీరానికి ఎందుకు అవసరం?

Homemade Facial Masks: ముఖం అందంగా మెరిసిపోవాలా ? అయితే ఇవి ట్రై చేయండి

Air Fryer Alert: ఎయిర్ ఫ్రయర్‌లో.. పొరపాటున కూడా ఇవి వండకూడదు !

Cucumber: దోసకాయతో ఇవి కలిపి తింటే.. రెట్టింపు ప్రయోజనాలు

Plants: జాగ్రత్త సుమీ.. ఇంట్లో ఈ మొక్కలు పెంచారో అంతే సంగతులు!

Tea: టీ తెగ తాగేస్తున్నారా ? ఇది తెలుసుకోకపోతే ప్రమాదమే !

Ajwain Water Vs Methi Water: బరువు తగ్గడానికి.. ఏ డ్రింక్ బెటర్ ?

Big Stories

×