E-Paper
Advertisement

పీరియడ్స్ సమయంలో తలనొప్పి, వాంతులు, వెలుతురు పడకపోవడం? కారణం ఇదే..

పీరియడ్స్ సమయంలో తలనొప్పి, వాంతులు, వెలుతురు పడకపోవడం? కారణం ఇదే..
Advertisement

Hormonal Migraine: నెలసరి వచ్చే ముందో లేదా పీరియడ్స్ సమయంలోనో చాలామంది మహిళలకు తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది. వెలుతురు చూసినా, చిన్న శబ్దం విన్నా తల పగిలిపోతున్నంత పని అవుతుంది. వాంతులు, తీవ్రమైన నీరసంతో చీకటి గదిలో ప్రశాంతంగా పడుకోవాలనిపిస్తుంది. అయితే ఇది సాధారణ తలనొప్పి కాదు, దీనినే ‘హార్మోనల్ మైగ్రేన్’ లేదా ‘మెన్‌స్ట్రువల్ మైగ్రేన్’ అంటారు. మన శరీరంలో జరిగే కొన్ని సహజమైన మార్పుల వల్లే ఈ సమస్య ఎదురవుతుంది.

ఈ తలనొప్పికి కారణమేంటి?

మన శరీరంలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ స్థాయిలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పీరియడ్స్ మొదలయ్యే సరిగ్గా కొన్ని రోజుల ముందు ఈ హార్మోన్ స్థాయిలు ఉన్నట్టుండి ఒక్కసారిగా పడిపోతాయి. మెదడులోని నరాల వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా నొప్పిని నియంత్రించే సెరటోనిన్ అనే రసాయనం తగ్గిపోవడం వల్ల మైగ్రేన్ నొప్పులు మొదలవుతాయి. శరీరంలో జరిగే ఈ హార్మోన్ల మార్పులే ప్రతి నెల అదే సమయానికి తలనొప్పి రావడానికి ప్రధాన కారణం.

సాధారణ తలనొప్పికి దీనికి తేడా ఇదే:

Advertisement

ఇది మామూలు తలనొప్పి కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. తలలో ఒకవైపు లేదా రెండువైపులా గుభ్ గుభ్ మంటూ పల్స్ కొట్టుకున్నట్లు నొప్పి వస్తుంది. దీంతో పాటు కడుపులో తిప్పడం, వాంతులు కావడం, కళ్లు తికగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి నొప్పి ప్రతినెలా పీరియడ్స్ సమయంలో రిపీట్ అవుతుంటే.. అది హార్మోన్ల వల్ల వచ్చే మైగ్రేనే అని గుర్తించాలి.

Also Read: బరువు తగ్గాలంటే పస్తులు ఉండాలా? Eating Less వెనుక ఉన్న పెద్ద డేంజర్ ఇదే!

ఈ అలవాట్లతో నొప్పి మరింత ఎక్కువ:

Advertisement

కేవలం హార్మోన్ల మార్పులే కాకుండా మన జీవనశైలి కూడా ఈ నొప్పిని మరింత పెంచుతుంది. సరైన నిద్ర లేకపోవడం, సమయానికి తినకపోవడం, ఒత్తిడికి గురికావడం, రోజులో సరిపడా నీళ్లు తాగకపోవడం వంటివి మైగ్రేన్ తీవ్రతను పెంచుతాయి. కాఫీలు, టీలు అతిగా తాగడం కూడా ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. కాబట్టి.. పీరియడ్స్ సమయంలో మన అలవాట్ల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

వయసు పెరిగే కొద్దీ కొత్త సమస్యలు:

చాలామంది వయసు పెరిగే కొద్దీ లేదా మెనోపాజ్ దగ్గర పడే కొద్దీ పీరియడ్స్ తగ్గి ఈ తలనొప్పి పోతుందని అనుకుంటారు. కానీ పెరిమెనోపాజ్ సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఊహించని విధంగా ఉంటాయి. దీనివల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా తీవ్రమైన మైగ్రేన్ నొప్పులు మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి వయసుతో పాటు వచ్చే ఈ మార్పులను సాధారణ విషయంగా తీసిపారేయకూడదు.

తగ్గించుకోవడానికి ఏం చేయాలి?

ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే రోజూ వేళకు నిద్రపోవడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. తలనొప్పి తీవ్రంగా ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. పీరియడ్స్ వచ్చే తేదీలు, తలనొప్పి ఎప్పుడు మొదలవుతుందనే విషయాలను ఒక డైరీలో నోట్ చేసుకుంటే వైద్యులు సరైన చికిత్స అందించడానికి వీలవుతుంది.

Also Read: రాత్రి పడుకునే ముందు ఫోన్‌లో ఈ ఒక్కటి ఆన్ చేయండి.. పొద్దున్నే చాలా ఫ్రెష్‌గా లేస్తారు!

Tags

Related News

క్యాన్సర్ రీలాప్స్ అంటే ఏమిటి? చికిత్స తర్వాత మళ్లీ క్యాన్సర్ రావడానికి అసలు కారణాలివే!

బరువు తగ్గాలంటే పస్తులు ఉండాలా? Eating Less వెనుక ఉన్న పెద్ద డేంజర్ ఇదే!

తేనెటీగ లేదా కందిరీగలు గుంపు దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలి? ఈ జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి

ఆఫీస్ లేదా కాలేజీలో పీరియడ్స్ మరకలు అంటుకుంటే ఏం చేయాలి? మీ బ్యాగులొ ఈ కిట్ ఉంటే సమస్యకు చెక్

రాత్రి పడుకునే ముందు ఫోన్‌లో ఈ ఒక్కటి ఆన్ చేయండి.. పొద్దున్నే చాలా ఫ్రెష్‌గా లేస్తారు!

పరమసుందరి.. ఈ 3 రాశుల అమ్మాయిలు ఆత్మవిశ్వాసం కలిగిన అందగత్తెలు

మీ వయసు కంటే వేగంగా ముసలిబారుతున్న మీ కళ్లు.. దీనికి కారణాలు ఇవే

Big Stories

Advertisement
×