Rohit Sharma Angry On Gill: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ (India vs West Indies) మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ (West Indies tour of India, 2026) జరుగుతోంది. తిరువనంతపురం (Greenfield International Stadium, Thiruvananthapuram) వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ తీవ్ర అసహనంతో కనిపించాడు. టీమిండియా కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ కె ఎల్ రాహుల్ లపై మండిపడ్డారని ప్రచారం సాగుతోంది. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఎవరికి బౌలింగ్ ఇస్తున్నారు.. అసలు మ్యాచ్ లో మీ ప్లాన్ ఏంటి? ఒక్కడు సరిగ్గా వికెట్లు తీయడం లేదు.. ఎవరికి బౌలింగ్ ఇస్తున్నారో అర్థమే కావడం లేదు అంటూ ఇద్దరి దగ్గరికి వెళ్లి రోహిత్ శర్మ మండిపడ్డట్లు వీడియో బయటకు వచ్చింది. ముఖ్యంగా ప్రసిద్ కృష్ణ బౌలింగ్ పై రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
తిరువనంతపురం వేదికగా జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో భారీ స్కోర్ దిశగా వెస్టిండీస్ దూసుకు వెళ్తోంది. ఈ మ్యాచ్ లో జస్టిన్ గ్రీవ్స్ సెంచరీ నమోదు చేయగా మరో ఓపెనర్ క్యాంపు బెల్ 62 పరుగులతో ఇరగదీశారు. వీళ్ళిద్దరూ కలిసి 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వికెట్ కోల్పోవడంతో వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్పీడ్ తగ్గింది. ఈ క్రమంలో ఇప్పటివరకు 41 ఓవర్స్ ఆడిన వెస్టిండీస్, 215 పరుగులు సాధించింది. టీమిండియా ముందు 280 కి పైగా టార్గెట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో 135 పరుగులు పూర్తి చేసే వరకు ఒక్క వికెట్ కూడా పడలేదు. నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ అలాగే గుర్నూర్ ముగ్గురు కూడా చెత్త ప్రదర్శన కనబరిచారు. విరాళంగా పరువులు ఇచ్చారు. దీంతో ఈ ముగ్గురు బౌలర్లపై రోహిత్ శర్మ సీరియస్ అయ్యారు. మనోడు అక్కడితో ఆగకుండా గిల్, కేఎల్ రాహుల్ దగ్గరకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. కెప్టెన్లుగా మీరు ఏం పీకుతున్నారని నిలదీశాడట రోహిత్ శర్మ (Rohit sharma). దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. రోహిత్ శర్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత, గిల్ లైన్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వరుసగా విండీస్ వికెట్టు పడిపోయాయి.
🔴 ROHIT SHARMA UNHAPPY WITH CAPTAIN & VICE-CAPTAIN 🤯
– Rohit Sharma called Shubman Gill & KL Rahul and told them how to manage the bowling rotation from now on.
– Team India managed to take only one wicket in 26 overs, while West Indies crossed 160+ runs. pic.twitter.com/ZJAqk4BrpC
— Sam (@cricsam02) September 27, 2026