OTT Movies : ప్రతి వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు డేట్ ని ముందుగానే లాక్ చేసుకుని రిలీజ్ అవుతాయి. మరి కొన్ని సినిమాలు మాత్రం ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. నేడు శుక్రవారం రోజున ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ సినిమాలతోపాటు భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు సైతం ఉన్నాయి.. మరి ఏ ఓటీటీలో ఎలాంటి సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..
జియో హాట్‌స్టార్..
స్వీట్ హార్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఏప్రిల్ 11
రెస్క్యూ హై సర్ఫ్ (అమెరికన్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11
పీస్ బై పీస్ (అమెరికన్ మ్యూజికల్ యానిమేషన్ కామెడీ చిత్రం)- ఏప్రిల్ 11
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6 (తెలుగు డబ్బింగ్ హిందీ యానిమేషన్ మైథాలజీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11
హ్యాక్స్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11
పెయిన్‌కిలి (మలయాళ రొమాంటిక్ కామెడీ సినిమా)- మనరోమ మ్యాక్స్ ఓటీటీ- ఏప్రిల్ 11
రాచరికం (తెలుగు పొలిటికల్ డ్రామా చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఏప్రిల్ 11
పెట్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- ఏప్రిల్ 11
షణ్ముఖ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- ఆహా ఓటీటీ- ఏప్రిల్ 11
లొజ్జ (హిందీ, బెంగాలీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- ఏప్రిల్ 11
యువర్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- ఏప్రిల్ 11
అమెజాన్ ప్రైమ్..
ఛోరీ 2 (హిందీ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 11
Also Read :దేవుళ్ళ ఫై చిల్లర స్కిట్స్.. కొంచెం కూడా సిగ్గులేదా..?
నెట్‌ఫ్లిక్స్..
కోర్ట్ (తెలుగు కోర్ట్ రూమ్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 11
పెరుసు (తెలుగు, తమిళ అడల్ట్ కామెడీ డ్రామా మూవీ)- ఏప్రిల్ 11
ఛావా (హిందీ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 11
చేజింగ్ ది విండ్ (ఇంగ్లీష్ రొమాంటిక్ ఫిల్మ్)- ఏప్రిల్ 11
ది గార్డెనర్ (ఫ్రెంచ్ యాక్షన్ కామెడీ మూవీ)- ఏప్రిల్ 11
ఈరోజు మూవీ లవర్స్ కు పండగే.. ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చేసాయి. అందులో 18 స్ట్రీమింగ్ అవ్వడం మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. వీటిలో ప్రియదర్శి కోర్ట్ మూవీ, హారర్ థ్రిల్లర్ రాక్షస, పొలిటికల్ డ్రామాగా రాచరికం, రొమాంటిక్ కామెడీ చిత్రం స్వీట్ హార్ట్, ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్ షణ్ముఖ, రష్మిక మందన్నా బ్లాక్ బస్టర్ హిట్ ఛావా, నిహారిక ఎన్ఎమ్ పెరుసు వంటి సినిమాలు వెరీ స్పెషల్.. ఎందుకంటే ఇవి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలే కావడం విశేషం. అందరి దృష్టి ఛావా మూవీ పైనే ఉంది.. ఇది థియేటర్లలో రిలీజ్ అయ్యి వరుస రికార్డులను బ్రేక్ చేసింది. ఓటీటీలో ఎలాంటి టాక్ను సొంతం చేసుకుంటుందో చూడాలి..