Face Wash: నేటికీ చాలా మంది ముఖం శుభ్రం చేసుకోవడానికి సబ్బును ఉపయోగిస్తారు. కానీ ఇది ఏమాత్రం సరైన పద్దతి కాదని, కొన్ని రకాల సబ్బులు ముఖ చర్మం నుండి సహజ నూనెను తొలగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఇది చర్మం పొడిబారడం, దురద, దద్దుర్లు వంటి సమస్యలను కూడా కలిగిస్తుందట. కానీ వీటికి బదులుగా ఫేస్ వాష్ వాడితే ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా తేమను కూడా అందిస్తుంది. చర్మం యొక్క pH స్థాయిని కూడా సమతుల్యం చేస్తుంది.
ఏది మంచి ఫేస్ వాష్ ?
అందరి చర్మం ఒకేలా ఉండదు. కొంత మంది స్కిన్ జిడ్డుగా ఉంటుంది. అంతే కాకుండా ఇంకొంత మంది చర్మం పొడిగా ఉంటుంది. కాబట్టి, ఫేస్ వాష్ కొనేటప్పుడు.. ముందుగా మీ చర్మాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.
జిడ్డు చర్మం ఉన్నవారికి: మీ చర్మం జిడ్డుగా ఉండి.. మీ ముఖం మీద తరచుగా ఆయిల్ లేదా మొటిమలు ఉంటే, మీకు సాలిసిలిక్ యాసిడ్, టీ ట్రీ ఆయిల్ లేదా వేప వంటి పదార్థాలు ఉన్న ఫేస్ వాష్ బాగుంటుంది. ఇవి ముఖం నుండి అదనపు నూనెను తొలగించడం ద్వారా రంధ్రాలను శుభ్రపరుస్తాయి.
పొడి చర్మం ఉన్నవారికి: మీ చర్మం పొడిగా ఉంటే.. మీ ముఖాన్ని ఆరబెట్టడానికి బదులుగా తేమను అందించే ఫేస్ వాష్ మీకు అవసరం. ఇలాంటి పరిస్థితిలో, కలబంద, తేనె, పాలు మొదలైన వాటితో తయారు చేసిన క్రీమ్ ఆధారిత లేదా మాయిశ్చరైజింగ్ ఫేస్ వాష్‌లు మంచివి.
సున్నితమైన చర్మం ఉన్నవారికి: మీ చర్మం సులభంగా చికాకుగా లేదా దురదగా ఉంటే, ఎటువంటి రసాయనాలు లేని ఫేస్ వాష్ మీకు ఉపయోగపడుతుంది. సువాసన లేని , హైపోఅలెర్జెనిక్ ఫేస్ వాష్‌లు మీకు బాగా సరిపోతాయి.
వేసవిలో ఏ ఫేస్ వాష్ ఎంచుకోవాలి ?
వేసవి కాలం చర్మానికి అత్యంత సవాలుతో కూడుకున్న సమయం. ఈ సమయంలో చెమట, దుమ్ము , UV కిరణాల కారణంగా.. చర్మం జిగటగా , అలసిపోయినట్లు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. ఫేస్ వాష్‌ను తెలివిగా ఎంచుకోవాలి.
వేసవిలో.. పుదీనా, వేప, దోసకాయ లేదా నిమ్మకాయ వంటి శీతలీకరణ పదార్థాలు కలిగిన ఫేస్ వాష్‌లను ఎంచుకోండి. ఇవి చర్మాన్ని చల్లబరుస్తాయి. అంతే కాకుండా తాజాదనాన్ని ఇస్తాయి. వేసవిలో ఆయిల్-ఫ్రీ, జెల్ ఆధారిత ఫేస్‌వాష్‌లు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. ఎందుకంటే అవి అదనపు చెమట, మురికిని సమర్థవంతంగా తొలగిస్తాయి. ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ వాడటం వల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. అంతే కాకుండా మొటిమలు కూడా రాకుండా ఉంటాయి.
Also Read: తరచుగా జుట్టు జిడ్డుగా మారుతోందా ? పరిష్కారం ఇదిగో !
ఫేస్ వాష్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ?
చర్మాన్ని లోతుగా శుభ్రపరచడం: ఫేస్ వాష్ చర్మ రంధ్రాలలోకి లోతుగా చొచ్చుకుపోయి దుమ్ము, చెమట, మేకప్ కణాలతో పాటు ధూళిని తొలగిస్తుంది.
మొటిమలు, బ్లాక్ హెడ్స్ నుండి ఉపశమనం: క్రమం తప్పకుండా ఫేస్ వాష్ వాడటం వల్ల
ముఖం మీద పేరుకుపోయిన అదనపు నూనె తొలగిపోతుంది. తద్వారా మొటిమలు , బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుతుంది.
గ్లో , ఫ్రెష్‌నెస్: ఫేస్ వాష్ చర్మాన్ని రిఫ్రెష్ చేయడమే కాకుండా దాని రంగును కూడా క్లియర్ చేస్తుంది.అంతే కాకుండా ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది.