BigTV English

Mouth Ulcers: ఈ టిప్స్ పాటిస్తే.. నోటి పూతకు గుడ్ బై

Mouth Ulcers: ఈ టిప్స్ పాటిస్తే.. నోటి పూతకు గుడ్ బై

Mouth Ulcers: నోటి పూత అనేది ఏదో ఒక సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటుంది. కడుపు, కాలేయంలో వేడి పెరిగిన వెంటనే.. పూతలు కనిపించడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా డీహైడ్రేషన్ అంటే మీరు తక్కువ నీరు తాగితే లేదా కొంచెం ఎక్కువ కారంగా ఉండే ఆహారం తింటే.. వెంటనే నోటి పూతలు వస్తుంటాయి. ఇవే కాదు హార్మోన్ల అసమతుల్యత, ఆమ్లత్వం కూడా వాటికి కారణం.


నోటిలో బొబ్బలను ఎలా నయం చేయాలి ?

ఈ బొబ్బలు చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే.. ఇవి ఆహారం తినడానికి, మాట్లాడటానికి ఇబ్బంది కరంగా ఉంటాయి. కొంత మందికి నోటిలో నిప్పు రవ్వలు ఉంచినట్లు అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.


పటిక నీరు:
నోటి పూతల వల్ల తినడం, తాగడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మీకు పటిక నీరు చాలా బాగా ఉపయోగ పడుతుంది. దీనికి అద్భుతమైన యాంటీ బాక్టీరియల్ , యాంటీ సెప్టిక్ శక్తి ఉంటుంది.

పటిక నీటిని ఎలా తయారు చేయాలి ?
కొంత పటికను తీసుకొని నీటిలో కరిగించండి. తర్వాత ఆ నీటితో నోటిని నింపి 2-3 నిమిషాలు పుక్కిలించండి. తర్వాత ఉమ్మివేయండి. ఈ నీటిని అస్సలు తాగకూడదు. తరచుగా ఇలా చేస్తే నోటి పూత నుంచి ఉపశమనం లభించడమే కాకుండా బొబ్బలు కూడా త్వరగా మాయం అవుతాయి.

త్రిఫల:
నోటి పూత నుంచి మీరు తక్షణ ఉపశమనం పొందాలంటే త్రిఫల ఉపయోగించడం మంచిది. ఒక గ్లాసు నీరు తీసుకొని అందులో కొంత త్రిఫల పొడి కలపండి. ఇప్పుడు ఈ నీటిని మీ నోటిలో వేసుకని పుక్కిలించండి. కొంతసేపు అలాగే ఉంచి.. ఆపై ఉమ్మివేయండి. ఇలా రోజుకు 3 సార్లు చేయండి. మీ సమస్య నుంచి ఈజీగా బయటపడతారు.

Also Read: వీటితో.. డార్క్ సర్కిల్స్ పూర్తిగా మాయం

కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీ నోటిలో బొబ్బలు ఉంటే.. మీ నోటిలో కొద్దిగా పచ్చి కొబ్బరి నూనె వేసి.. 2-3 నిమిషాలు తిప్పండి. తర్వాత ఉమ్మివేయండి. అనంతరం నోటిని శుభ్రం చేసుకోండి. కొబ్బరి నూనెలో చాలా ప్రయోజనకరమైన లక్షణాలు ఉన్నాయి. ఇది బొబ్బలను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుంది. దీనిని వాడటం వల్ల ఎరుపు, మంట కూడా తగ్గుతాయి.

కడుపు నొప్పిగా ఉంటే.. నోటి పూతల రావడం సర్వ సాధారణం. కొన్నిసార్లు మల బద్ధకం లేదా గ్యాస్ కారణంగా నోటి పరిస్థితి చెడిపోతుంది. ఆమ్లత్వం లేదా జీర్ణ సమస్యలు కూడా ఈ సమస్యను పెంచుతాయి.

ఏమి తినకూడదు ?
నోటిలో బొబ్బలు ఉంటే.. మీరు వేయించిన, కారంగా లేదా మిరపకాయలు వాడిన ఆహారాలు తినకూడదు. అల్లం, వెల్లుల్లి , మొత్తం మసాలా దినుసులు వంటి వేడి ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి.  ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల తక్కువ సమయంలోనే నోటి పూతను తగ్గించుకోవచ్చు.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×