BigTV English

How to Live 100 Years: వీటితో ఈజీగా వందేళ్లు బతికేయొచ్చు..!

How to Live 100 Years: వీటితో ఈజీగా వందేళ్లు బతికేయొచ్చు..!


How to Live 100 Years in Perfect Health: మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. అది కూడా 100 ఏళ్ల పాటు ఆరోగ్యంగా జీవించాలంటే తీసుకునే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అందుకు కొన్ని రకాల విటమిన్లను మీ ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపొచ్చు. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో విటమిన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా విటమిన్లను పొందొచ్చు. దీనివల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనం తీసుకునే ఆహారంతో ఎక్కువకాలం జీవించాలంటే 5 రకాల విటమిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విటమిన్లు ఏంటో తెలుసుకుందాం.

విటమిన్ డి


దీన్ని సన్‌షైన్ విటమిన్ అని కూడా అంటారు. అంతేకాకుండా దీనివల్ల మానసిక ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ పనితీరు, ఎముకులు ధృడంగా ఉంటాయి. విటమిన్ డి.. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సూర్యకాంతి, చేపలు, బలవర్థకమైన ఆహారాలు ద్వారా విటమిన్ డి లభిస్తుంది.

READ MORE : భోజనం తర్వాత మజ్జిగ తాగితే బోలెడు లాభాలు.. తెలిస్తే వదలరు!

విటమిన్ సి

విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోయాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కణాలను రక్షిస్తుంది. ఇది కొల్లాజెన్‌ను నిర్మించడంలో సహాయపడుతుంది. శరీరంపై గాయలను కూడా నయం చేస్తుంది. విటమిన్ సి వల్ల గుండె జబ్బులు, అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాల నుంచి బయటపడొచ్చు.
బ్రోకలీ,బెల్ పెప్పర్స్, కివి, సిట్రస్ పండ్లు, బెర్రీలలో సి విటమిన్ నిండుగా ఉంటుంది.

విటమిన్ ఈ

ఈ విటమిన్‌లో బలమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. విటమిన్ ఈ ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఈ సమస్యలు వృద్ధాప్యం, దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంటాయి. అలానే ఇది ఆరోగ్యకరమైన చర్మం, బలమైన రోగనిరోధక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. విటమిన్ ఈ అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గింజలు, ఆకుకూరలు, కూరగాయల నూనెలు, ధాన్యాలలో విటమిన్ ఈ ఉంటుంది.

విటమిన్ బి12

బి12 విటమిన్ ఎర్ర రక్త కణాల నిర్మాణం, న్యూరాన్ పనితీరుకు అవసరమైంది. మొత్తం ఆరోగ్యాన్ని పెంచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బి12 విటమిన్ రక్తహీనతను నివారిస్తుంది. గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది. మాంసం, సముద్రపు ఆహారం, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో బి12 విటమిన్ ఉంటుంది.

READ MORE :  మీ పొట్టలో ఇవి పడితే.. పొట్ట క్యాన్సర్ రావడం ఖాయం!

విటమిన్ కె2

విటమిన్ కె2 గుండె ఆరోగ్యానికి, ఆరోగ్యకరమైన రక్తానికి అవసరమైంది. బోలు ఎముకల వ్యాధి రాకుండా రక్షిస్తుంది. దంతాలు, ఎముకలకు కాల్షియం అందిస్తుంది. అలానే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చీజ్, గుడ్డు సొనలు, పులియబెట్టిన ఆహారాలు, జంతు ఉత్పత్తుల్లో విటమిన్ K2 అధికంగా ఉంటుంది.

Disclaimer : ఈ సమాచారాన్ని పలు అధ్యయనాల ఆధారంగా ఆరోగ్య నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా మాత్రమే భావించండి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×