Late Night Dnner: భోజన ప్రియులు ఎక్కువమంది మధ్యాహ్నం లంచ్ కంటే రాత్రి డిన్నర్‌ని ఇష్టపడతారు. కానీ రాత్రిపూట తినే భోజనం మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా తినే ఆహారం కావొచ్చు.. తినే టైం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. అందుకే రాత్రిపూట సరైన సమయంలో.. సరైన ఆహారం తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది బిజీ లైఫ్ స్టైల్ కారణంగా రాత్రిపూట చాలా లేట్ గా ఆహారం తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఊబకాయంతో పాటు అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాత్రి లేటుగా భోజనం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇవి శరీరం యొక్క జీర్ణవ్యవస్థ, జీవక్రియ, మరియు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
రాత్రి 9 తర్వాత
చాలా మంది రాత్రి పూట తిన్న వెంటనే నిద్ర పోతుంటారు. కానీ అలా చేయకూడదు. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. తిన్న వెంటనే నిద్ర పోకూడదంటే.. మనం రాత్రి 9 గంటల లోపే తినడం మంచిది. చాలా మంది రాత్రి 9 తర్వాత తింటారు. తిన్నవెంటనే పడుకుంటుంటారు. ఇలా పడుకుంటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిగా పనిచేస్తుందని హెచ్చరిస్తున్నారు. రాత్రి లేటుగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగా పని చేయకపోవచ్చు, ఎందుకంటే శరీరం రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇది గుండెల్లో మంట, ఆమ్లం రిఫ్లక్స్, గ్యాస్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. అలాగే రాత్రి సమయంలో భారీ భోజనం తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం ఏర్పడవచ్చంటున్నారు.
సకాలంలో నిద్ర పట్టకపోవడం
రాత్రి ఆలస్యంగా తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. సకాలంలో తినకపోవడం వల్ల శరీర జీవక్రియ మందగిస్తుంది. దీని వల్ల వినియోగించే క్యాలరీలు సరిగా కరిగిపోవు. అలాగే రాత్రి సమయంలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. దీంతో శరీర కొవ్వు పెరగడం మొదలవుతుంది. ఇది ఊబకాయం దారితీస్తుంది. రాత్రి లేటు భోజనం ఇన్సులిన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది, ఇది కొవ్వు నిల్వను పెంచుతుంది. లేటు భోజనం నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. జీర్ణక్రియ కోసం శరీరం చురుకుగా ఉండటం వల్ల నిద్రలో ఆటంకం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిళ్లు సరిగ్గా నిద్రరాకపోవడానికి కారణాల్లో ఆలస్యంగా తినడం కూడా ఒకటి. లేట్‌గా తినడం వల్ల మన శరీరం దాన్ని సరిగ్గా జీర్ణించుకోలేకపోతుంది. ఫలితంగా నిద్రసరిగ్గా రాదు. ఆమ్లం రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంట వల్ల రాత్రి నిద్ర సరిగా పట్టకపోవచ్చని తెలిపారు.
తిన్న వెంటనే పడుకోవడం
ఇలా తిన్న వెంటనే పడుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిలు, హొర్మోన్ల అసమతుల్యత వంటి ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉందట. చాలా అధ్యయనాలు.. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్యే భోజనం చేయడం మంచిదని చెబుతున్నాయి. రాత్రి పూట ఆలస్యంగా తినే అలవాటు ఎన్నో రోగాలకు దారితీస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఇది జీర్ణ శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందట.
స్ట్రోక్ పెరిగే ఛాన్స్
రాత్రి లేటుగా తినడం రక్తంలో చక్కెర స్థాయిలను అస్థిరపరుస్తుంది, ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. దీర్ఘకాలంలో ఇది టైప్-2 డయాబెటిస్‌కు దారితీయవచ్చు. అంతేకాకుండా రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి, ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాలక్రమేణా ఈ అలవాటు సెరెబ్రోవాస్కులర్ డిజార్డర్స్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
నిద్ర లేమి మరియు జీర్ణ సమస్యలు ఒత్తిడి, ఆందోళన, మరియు డిప్రెషన్‌ను పెంచవచ్చు.
రాత్రి లేటు భోజనం అనారోగ్యకరమైన ఆహార ఎంపికలకు (జంక్ ఫుడ్, షుగర్ ఫుడ్స్) దారితీయవచ్చు, ఇవి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఒకవేళ రాత్రి ఆలస్యంగా తినాలనుకుంటే పండ్లను తీసుకోవచ్చు. లేదా పాలు తాగొచ్చు. వీటిని తీసుకున్న తర్వాత వెంటనే నిద్ర పోకూడదని కనీసం అరగంటైనా ఆగాలని చెబుతున్నారు.
Also Read: సాయంత్రమైతే గోళ్లను కట్ చేయకూడదు అంటే చాదస్తం కాదు.. దీని అసలు కథ ఇదే..
హెచ్చరిక
రాత్రి భోజనం సాయంత్రం 7 లేదా 8 గంటలలోపు పూర్తి చేయడం మంచిది.
తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారం (సలాడ్లు, సూప్‌లు) తీసుకోవాలి.
భోజనం తర్వాత కొద్దిగా నడవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది.
రాత్రి ఆలస్యంగా తినే అలవాటును నివారించడానికి రోజు షెడ్యూల్‌ను తయారు చేసుకోవాలి.