Nail Cutting: రాత్రి పూట కానీ.. సాయంత్రం వేళల్లో కానీ గోర్లను కట్ చేస్తే చాలా మంది తిడుతుంటారు. అలా తిట్టడం స్టార్ట్ చేయగానే మనకు కోపం మొదలవుతుంది. దీంతో ఏంటీ నీ మూఢనమ్మకం నువ్వు అని వారి పై అరుస్తు ఉంటాం. కానీ మన తెలుగు సంప్రదాయంలో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో గోర్లు కత్తిరించకూడదనే నమ్మకం విస్తృతంగా ఉంది. ఈ నమ్మకానికి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య, మరియు ఆచార సంబంధిత కారణాలు ఉన్నాయి.
సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కారణాలు
శుభ సమయం: హిందూ సంప్రదాయంలో, సాయంత్రం మరియు రాత్రి సమయాలు ఆధ్యాత్మిక కార్యకలాపాలు లేదా శుభకార్యాలకు అనుకూలమైనవిగా పరిగణించబడవు. గోర్లు కత్తిరించడం వంటి కార్యకలాపాలు “అశుభం” లేదా “అపవిత్రం” అని భావిస్తారు. ఈ సమయంలో ఇటువంటి పనులు చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ శక్తులు ప్రవేశిస్తాయని కొందరు నమ్ముతారు. అంతేకాకుండా రాత్రి పూట చంద్రుడి శక్తి వెన్నెల రూపంలో ప్రసరిస్తూ ఉంటుంది. ఇదే ఎనర్జీ మన శరీరానికి అందుతుంది. ఎప్పుడైతే గోళ్లు కట్ చేసుకుంటారో అప్పుడు ఈ శక్తి సరైన విధంగా శరీరానికి అందకుండా పోతుందని, దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని విశ్వసిస్తారు.
లక్ష్మీదేవి ఆగమనం: సాయంత్రం సమయం లక్ష్మీదేవి ఇంటిలో ప్రవేశించే సమయంగా భావిస్తారు. గోర్లు కత్తిరించడం వంటి పనులు చేస్తే, లక్ష్మీదేవి అసంతృప్తి చెంది ఇంటిని వదిలి వెళ్ళవచ్చని ఒక నమ్మకం. ఇది ఆర్థిక నష్టం లేదా దరిద్రానికి దారితీస్తుందని కొందరు భావిస్తారు.
పితృదేవతల సంబంధం: కొన్ని ప్రాంతాల్లో, రాత్రి సమయంలో గోర్లు కత్తిరించడం వల్ల పితృదేవతలు (పూర్వీకులు) అసంతృప్తి చెందుతారని, దీనివల్ల కుటుంబంలో అశాంతి లేదా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు.
పరిశుభ్రత: పురాతన కాలంలో, విద్యుత్ లేని రోజుల్లో, సాయంత్రం లేదా రాత్రి సమయంలో తగినంత వెలుతురు లేకపోవడం వల్ల గోర్లు కత్తిరించడం కష్టం. ఇది చర్మం గాయపడటానికి లేదా గోర్లు సరిగా కత్తిరించబడకపోవడానికి దారితీసేది. అందువల్ల, ఈ సమయంలో గోర్లు కత్తిరించడం నిషేధించబడి ఉంటుందని చెబుతున్నారు.
నమ్మక తప్పని నిజాలు: సాధారణంగా రోజంతా మనం ఎక్కడెక్కడో తిరుగుతాం. చాలా చోట్ల పనులు చేస్తాం. చేతులపై రకరకాల దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా వచ్చి చేరుతుంది. గోళ్లలో అవి ఇరుక్కుని ఉంటాయి. ఆ సమయంలో ఎలా పడితే అలా గోళ్లు కత్తిరించుకుంటే ఆ బ్యాక్టీరియా అంతా వ్యాప్తి చెందుతుంది. మూతి, ముక్కుపై ఆ వేళ్లు పెట్టుకుంటే అక్కడ కూడా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. చేతులు శుభ్రంగా ఉన్నప్పుడు గోళ్లు తీసుకుంటే ఎలాంటి హానీ ఉండదు.
గోర్ల వ్యర్థం: కత్తిరించిన గోర్లను ఇంట్లో ఎక్కడైనా వదిలేస్తే, అవి అపవిత్రంగా భావించబడతాయి. అలాగే రాత్రి సమయంలో వీటిని సరిగ్గా పారవేయడం కష్టం, కాబట్టి రాత్రి సమయంలో గోర్లను కత్తిరించకూడదు.
కొన్ని ప్రాంతాల్లో, రాత్రి గోర్లు కత్తిరించడం వల్ల ఆయుష్షు తగ్గుతుందని లేదా దురదృష్టం కలుగుతుందని నమ్ముతారు. రాత్రి సమయంలో గోర్లు కత్తిరించడం వల్ల చెడు శక్తులు లేదా దెయ్యాలు ఆకర్షితమవుతాయని కొందరు బాగా నమ్ముతారు. అలాగే సాయంత్రం పూట గోర్లను కట్ చేయడం వల్ల శని గ్రహానికి కోపం వస్తుందని అంటారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుందని, అలాగే అప్పులు చెల్లించడంలో ఇబ్బందులు, ఆదాయం తగ్గిపోతుందని భావిస్తారు.
Also Read: వాకింగ్ చేసేటప్పుడు ముందుకు కాకుండా.. వెనక్కి నడిస్తే ఏమౌతుందో తెలుసా?
సాధారణంగా చాలా మంది గోళ్లు కట్ చేసుకునేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. కొందరు తాము రోజూ పడుకునే బెడ్ పైనే కూర్చుని కత్తిరిస్తారు. ఇంకొందరు సోఫాలో కూర్చుని తీస్తారు. ఇలా చేసినప్పుడు కొన్ని గోళ్లు వాటిపై పడిపోతాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ గోళ్లలో మట్టి, దుమ్ము, బ్యాక్టీరియా ఉంటుంది. ఇలా అవి బెడ్, సోఫాలపై పడిపోవడం వల్ల బ్యాక్టీరియా సులువుగా వ్యాప్తి చెందుతుంది. వాటిపైనే నిద్రపోవడం వల్ల అనారోగ్యాలు తలెత్తే ముప్పు ఉంటుంది. కొన్ని సార్లు అనుకోకుండా గోళ్లు మనం తినే ఆహారంలో కలిసిపోవచ్చు. లేదా దుస్తుల్లో ఇరుక్కుని ఉండొచ్చు. ఇది ఇంకా ప్రమాదకరం. అందుకే వెలుతురు తక్కువగా ఉండే రాత్రి పూట ఇలాంటి పనులు చేయకూడదని చెబుతారు.
ఏ రోజు కత్తిరించాలి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాత్రిపూట గోళ్లు కత్తిరించకుండా ఉండటమే కాకుండా కొన్ని రోజులలో గోళ్లు కత్తిరించకూడదు. గోళ్లను రెగ్యులర్‌గా కట్ చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపరుడుతుందని నమ్ముతారు. గోళ్లను శనివారాల్లో కట్ చేయడం తగ్గించుకోవాలి. ఎందుకంటే మీ మనోబలాన్ని తగ్గిస్తాయి. ఆదివారాలు కూడా దూరంగా ఉండాలి. వారంలో వేర్వేరు రోజుల్లో గోళ్లను కత్తిరించడానికి ఇతర కారణాలను సూచిస్తాయి. సోమవారం ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తుంది. మంగళవారం నాడు కత్తిరించడకుండా ఉంటే బెటర్. బుధవారం నాడు కత్తిరించడం వల్ల సంపద పెరుగుతుందట. అన్నింటికంటే గురువారం రోజున గోళ్లు కత్తిరించుకోవడం చాలా మంచిదని చెబుతుంటారు. శుక్రవారం రోజున గోళ్లు కత్తిరిస్తే.. ప్రయాణాలు, ప్రియమైన వారిని కలిసే అవకాశాలు పెరుగుతాయి.