రివ్యూ : ‘బన్ బటర్ జామ్’ మూవీ
విడుదల తేదీ: 2025 జూలై 18 (తమిళం), 2025 ఆగస్టు 22 (తెలుగు)
దర్శకుడు: రాఘవ్ మిర్దత్
నటీనటులు: రాజు జెయమోహన్, భవ్య త్రిఖ, ఆద్య ప్రసాద్, సరన్య పొన్వన్నన్, దేవదర్శిని, చార్లీ, విక్రాంత్, మైఖేల్ తంగదురై
సంగీతం: నివాస్ కె. ప్రసన్న
సినిమాటోగ్రఫీ: బాబు కుమార్
నిర్మాణం: రెయిన్ ఆఫ్ ఆరోస్ ఎంటర్‌టైన్‌మెంట్
Bun Butter Jam Review : ఇటీవల తమిళంలో రిలీజ్ అయిన జెన్ జెడ్ మూవీ ‘బన్ బటర్ జామ్’. తమిళ తంబీలను మెప్పించిన ఈ మూవీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ 2025 ఆగస్టు 22న విడుదలైంది. మరి ఈ రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ టాలీవుడ్ ఆడియన్స్ ను ఎంతమేరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ
చంద్రు (రాజు జెయమోహన్) అనే సాధారణ కాలేజీ అబ్బాయి చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ. స్నేహితుడు శరవణన్‌తో కలిసి ఎలాంటి టెన్షన్స్ లేకుండా లైఫ్ ను ఎంజాయ్ చేస్తాడు. ఈ హీరో ఇన్‌స్టాగ్రామ్ స్టార్ నందిని (భవ్య త్రిఖ)ని ప్రేమిస్తాడు. అదే సమయంలో పొరుగింటి అమ్మాయి ఆద్య (ఆద్య ప్రసాద్)తో లవ్ – హేట్ రిలేషన్షిప్ లో ఉంటాడు. మరోవైపు చంద్రు, ఆద్య తల్లులు (సరన్య, దేవదర్శిని) తమ పిల్లలకు పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ ప్రేమ, స్నేహం, తల్లుల కుట్రల మధ్య జరిగే గందరగోళం… నవ్వులు, ఎమోషన్స్ తో సినిమా సాగుతుంది. ఇంతకీ చంద్రూ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ? చివరికి ఈ లవ్ స్టోరీ ఎలాంటి మలుపు తిరిగింది? అనేది మూవీ స్టోరీ.
విశేషణ
డైరెక్టర్ రాఘవ్ మిర్దత్ ‘బన్ బటర్ జామ్’ మూవీతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రొమాంటిక్ కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమా జెన్ జీ యువత లైఫ్ స్టైల్, కాలేజీ జీవితం, సోషల్ మీడియా, స్నేహం, ప్రేమ వంటి యూత్ ఫుల్ అంశాల మేళవింపుతో సహజంగా రూపొందింది. మొదటి భాగం కామెడీ, రొమాన్స్‌తో ఆకట్టుకుంటుంది. కానీ కొన్ని సన్నివేశాలు సాధారణంగా, ముందే ఊహించదగినవిగా అనిపిస్తాయి. రెండవ భాగం మాత్రం ఎమోషనల్ సీన్స్, స్నేహం, ప్రేమపై లోతైన దృక్పథంతో ఆకట్టుకుంటుంది. నివాస్ కె. ప్రసన్న సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ‘కాజుమా’ పాట యూత్ ను ఆకట్టుకుంటుంది. బాబు కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంటుంది. చెన్నై కాలేజీ జీవితాన్ని, బీచ్ సన్నివేశాలను ఆకర్షణీయంగా చిత్రీకరించారు. జాన్ అబ్రహం ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. కానీ కొన్ని ఇన్‌స్టాగ్రామ్ రిఫరెన్స్‌లు బలవంతంగా అనిపిస్తాయి. క్లైమాక్స్ కొంత హడావిడిగా అనిపిస్తుంది.
రాజు జయమోహన్ మొదటిసారి హీరోగా చేసినా, బాగానే నటించాడు. అతని కామెడీ టైమింగ్, సహజమైన నటన సినిమాకు పెద్ద ప్లస్. భవ్య త్రిఖ నందినిగా చక్కగా నటించింది. ఆద్య ప్రసాద్ తన పాత్రలో అందంగా, చురుకుగా కనిపిస్తుంది. సరన్య పొన్వన్నన్, దేవదర్శిని తల్లుల పాత్రల్లో నవ్వించడమే కాక, భావోద్వేగాలను కూడా అద్భుతంగా పండించారు. విక్రాంత్, మైఖేల్, విజే పప్పు వంటి సహాయక నటులు కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్
రాజు జయమోహన్ నటన, కామెడీ టైమింగ్
నటీనటులు
సంగీతం
సెకండాఫ్
మైనస్ పాయింట్స్
ఫస్టాప్
ఇన్‌స్టాగ్రామ్ రిఫరెన్స్‌లు
క్లైమాక్స్
మొత్తానికి ‘బన్ బటర్ జామ్’ ఒక టేస్టీ ట్రీట్ ఫీల్-గుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా. స్నేహితులతో లేదా కుటుంబంతో జాలీగా థియేటర్‌లో ఎంజాయ్ చేయదగ్గ మూవీ.
Bun Butter Jam Rating : 2.75/5