Showering After Meal: తిన్న వెంటనే స్నానం చేయడం కొంత మందికి రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. కానీ అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? ఇంట్లోని పెద్దవాళ్లు కూడా తిన్న వెంటనే స్నానం చేయకూడదని చెప్పడం మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే నిజానికి దీని వెనుక ఎలాంటి మూఢనమ్మకం లేదు.. లోతైన శాస్త్రీయ కారణం మాత్రమే ఉంది. ఆయుర్వేదంతో పాటు ఆధునిక వైద్య శాస్త్రం ప్రకారం కూడా తిన్న వెంటనే స్నానం చేయకూడదని తెలుస్తోంది.
మనం తినేటప్పుడు.. మన శరీరం యొక్క రక్త ప్రవాహం జీర్ణక్రియకు సహాయపడటానికి కడుపు, పేగుల వైపు కదులుతుంది. ఈ సమయంలో.. జీర్ణక్రియ సక్రియం అవుతుంది. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి అంతే కాకుండా పోషకాలను గ్రహించడానికి ముఖ్యమైంది. కానీ తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మారుతుంది. ఫలితంగా రక్త ప్రవాహం చర్మం, కండరాల వంటి ఇతర భాగాల వైపుకు చేరుకుంటుంది.
జీర్ణ సమస్యలు:
తిన్న వెంటనే స్నానం చేస్తే.. జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఇది అజీర్ణం, గ్యాస్, వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ అలవాటు దీర్ఘకాలంలో జీర్ణ శక్తిని బలహీనపరుస్తుంది. భోజనం తర్వాత స్నానం చేయాల్సి వస్తే.. కనీసం ఎంత సమయం విరామం తీసుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది. స్నానం చేసిన తర్వాత కనీసం అరగంట నుంచి ఒక గంట తర్వాత మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆయుర్వేదం ప్రకారం.. భోజనం చేసిన తర్వాత, శరీరం యొక్క రక్త ప్రసరణ కడుపు వైపు కేంద్రీకృతమై ఉంటుంది. తద్వారా ఆహారం జీర్ణమవుతుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఫలితంగా రక్త ప్రవాహం చర్మం, కండరాలు వంటి శరీర బాహ్య భాగాల వైపు మళ్ళుతుంది. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది.
Also Read: జపనీస్ నాజుగ్గా, యవ్వనంగా కనిపించడానికి.. అసలు కారణం ఇదేనట !
ఆరోగ్యకరమైన ఆహారం తినండి:
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్నానం, భోజనాల మధ్య కనీసం 2-3 గంటల విరామం ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జీర్ణ ప్రక్రియను ప్రభావితం కాకుండా ఉంటుంది. స్నానం చేసి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి స్నానం చేసిన తర్వాత మాత్రమే తినడానికి ప్రయత్నించండి అని నిపుణులు చెబుతున్నారు.