E-Paper
Advertisement

భూమిపై మనుషులు మాత్రమే లేరా ? ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం… ఏలియన్స్ గురించి స్పీల్‌బర్గ్ చూపించిన షాకింగ్ కథ

భూమిపై మనుషులు మాత్రమే లేరా ? ప్రపంచాన్ని కుదిపేసే రహస్యం… ఏలియన్స్ గురించి స్పీల్‌బర్గ్ చూపించిన షాకింగ్ కథ
Advertisement

Disclosure Day OTT Release : ఆకాశంలో వింత వస్తువు కనిపిస్తే అది ఏదో గ్రహశకలం అనుకుంటాం. రేడియోలోనో, టీవీలోనో విచిత్రమైన సంకేతాలు వినిపిస్తే సాంకేతిక లోపం అనుకోవచ్చు. కానీ ప్రపంచం మొత్తం చూస్తున్న ఓ లైవ్ ప్రసారంలోనే ఊహించని సంఘటన జరిగి, భూమిపై మనుషులు మాత్రమే లేరనే విషయం నిజమని తేలితే… దశాబ్దాలుగా దాచి పెట్టిన ఓ రహస్యం ఒక్కసారిగా బయట పడితే ప్రభుత్వాలు, ప్రజలు ఎలా స్పందిస్తారు ? ఇలాంటి ప్రశ్నలతో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ ‘Disclosure Day’. థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 241 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం కథలో అసలు రహస్యం ఏంటో చూద్దాం.

కథలోకి వెళ్తే…

మార్గరెట్ ఫెయిర్‌ చైల్డ్ ఓ వాతావరణ నిపుణురాలు. టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ వాతావరణ వివరాలు అందించే సమయంలో ఆమెకు ఊహించని అనుభవం ఎదురవుతుంది. అది సాధారణ ప్రసారంలో జరిగిన చిన్న పొరపాటు కాదు. ఆమె ప్రవర్తన, ఆ క్షణంలో కనిపించిన సంఘటన ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. లైవ్‌లో జరిగిన ఆ పరిణామం వెనుక ఏదో అసాధారణమైన విషయం ఉందనే అనుమానం మొదలవుతుంది.

Advertisement

సాధారణంగా ఇలాంటి సంఘటన జరిగితే దాన్ని సాంకేతిక సమస్యగా కొట్టి పారేయొచ్చు. కానీ ఈసారి ఆ సంఘటనకు సంబంధించిన ఆధారాలు, దాని వెనుక ఉన్న సమాచారం ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలవుతుంది. అప్పటి వరకు చాలామందికి ఊహాగానంలా కనిపించిన ఏలియన్స్ ఉనికి గురించి చర్చ మరింత తీవ్రమవుతుంది. ఇదే సమయంలో డాక్టర్ డేనియల్ కెల్నర్ అనే సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఈ వ్యవహారంలోకి ఎంట్రీ ఇస్తాడు. ప్రభుత్వ వ్యవస్థల్లో దాగి ఉన్న సమాచారం, రహస్య డేటా, వాటిని బయట పెట్టకుండా ఉంచే ప్రయత్నాలపై అతడు దృష్టి పెడతాడు.

ఈ సంఘటన ఒక్కరోజులో జరిగినది కాదని, దీని వెనుక చాలా కాలంగా కొనసాగుతున్న ఓ కుట్ర ఉండవచ్చని అతడికి అర్థమవుతుంది. మార్గరెట్‌ కు ఎదురైన అనుభవం, డేనియల్ వెలికితీసే రహస్యాల మధ్య ఉన్న లింకు కథను కీలక మలుపు తిప్పుతుంది. ఏలియన్స్ గురించి ప్రపంచానికి నిజం చెప్పాలనుకునే వాళ్లు ఒకవైపు ఉంటే, ఆ సమాచారాన్ని బయటకు రానివ్వకూడదని భావించే శక్తులు మరోవైపు ఉంటాయి. నిజం బయటపడితే ప్రపంచం మొత్తం మారిపోవచ్చనే భయం కూడా ఈ వ్యవహారంలో భాగమవుతుంది.

Advertisement

ఇక్కడ ఏలియన్స్ ఉన్నాయా లేదా అన్నది అసలు ప్రశ్న కాదు. వాళ్లు ఉన్నారని నిరూపించే ఆధారాలు నిజంగా బయట పడితే, ప్రభుత్వాలు ఇన్నాళ్లూ ఏం దాచాయి ? ప్రజలకు తెలియకుండా ఉంచిన రహస్యం వెనుక కారణమేంటి ? ఈ నిజాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నంలో మార్గరెట్, డేనియల్ ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటారు ? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సెన్సేషనల్ మూవీని చూడాల్సిందే.

Also Read : హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

తెలుగులో ఉందా ?

‘డిస్క్లోజర్ డే’ మూవీకి ‘జురాసిక్ పార్క్’, ‘E.T.’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వం వచ్చించారు. ఈ సినిమా అక్టోబర్ 9 నుంచి అమెరికాలో Peacockలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఎమిలీ బ్లంట్ మార్గరెట్ ఫెయిర్‌చైల్డ్‌గా, జోష్ ఓ’కానర్ డాక్టర్ డేనియల్ కెల్నర్‌గా నటించారు. కోలిన్ ఫిర్త్, ఈవ్ హ్యూసన్, కోల్మన్ డొమింగో, వ్యాట్ రసెల్ కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా అమెరికాలో 2026 జూన్ 12న థియేటర్లలో విడుదలై, అక్టోబర్ 9 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.

Tags

Related News

వరుస హత్యలు… అంతుచిక్కని ఆధారాలు… 5 భాషల్లో రచ్చ లేపుతున్న మోస్ట్ డేంజరస్ సైకో థ్రిల్లర్

హాస్పిటల్‌ మాఫియా… డాక్టర్ల గుట్టురట్టు చేసే లేడీ సర్జన్… క్రేజీ కొరియన్ మెడికల్ థ్రిల్లర్ సిరీస్

హోటల్ నిండా దెయ్యాలు… చిన్న పిల్లాడిలో డెమాన్… నవ్విస్తూనే భయపెట్టడానికి తిరిగొచ్చిన సీజన్ 2

కొడుకు కిడ్నాప్… కోట్ల డబ్బు కోసం వేట… ప్రతి నిమిషం టెన్షన్ పెంచే హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి

కరెంట్ షాక్ ఇచ్చే అమ్మాయే అతడి హార్ట్ ఛార్జర్… ఈ వింత లవ్ స్టోరీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అక్రమ ఇసుక మాఫియా పని పట్టే లేడీ రిపోర్టర్… డైరెక్ట్ గా ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులోనే స్ట్రీమింగ్

పోలీస్ స్టేషన్‌లో ఖాకీల క్రైమ్… నిజాన్ని దాచేందుకు పోలీసులే కుట్ర… ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ను మిస్ కావొద్దు

Big Stories

Advertisement
×