Metastatic Breast Cancer: సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు దాన్ని త్వరగా గుర్తించి నయం చేయవచ్చు. కానీ, రొమ్ము భాగంలో మొదలైన క్యాన్సర్ కణాలు ఆ పరిధి దాటి… శరీరంలోని ఎముకలు, కాలేయం, ఊపిరితిత్తులు లేదా మెదడు వంటి ఇతర ముఖ్యమైన అవయవాలకు పాకితే దాన్ని మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ లేదా స్టేజ్ 4 క్యాన్సర్ అంటారు. ఇది రొమ్ము క్యాన్సర్లలోనే అత్యంత తీవ్రమైన చివరి దశగా వైద్యులు చెబుతారు.
బ్రెస్ట్ క్యాన్సర్‌పై నిర్లక్ష్యం వద్దు..
ఈ ప్రత్యేక రోజును కేటాయించడం వెనుక మొదటి ముఖ్య ఉద్దేశం… ప్రజల్లో పూర్తి అవగాహన తీసుకరావడం. ఎందుకంటే, సాధారణ రొమ్ము క్యాన్సర్ చికిత్సకు, ఈ స్టేజ్ 4 క్యాన్సర్ మేనేజ్‌మెంట్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి, సరికొత్త చికిత్స విధానాలు ఏంటి అనే అంశాలపై పేషెంట్లకు, వారి కుటుంబాలకు సరైన అవగాహన కల్పించడం చాలా అవసరం.
మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ విశేషాలు..
మరొక ప్రధానమైన అంశం… రీసెర్చ్ ఫండింగ్. మెటాస్టాటిక్ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించే శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడంతో పాటు, బాధితుల ఆయుష్షును పెంచే టార్గెటెడ్ థెరపీలు, ఆధునిక వైద్య పరిశోధనల కోసం నిధులు సేకరించడం ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం.
ధైర్యమే నిజమైన మందు!
చివరిగా… స్టేజ్ 4 క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగులు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. అలాంటి సమయంలో ‘మేమున్నాం’ అనే కొండంత అభయం ఇవ్వడం, వారికి సామాజికంగా, మానసికంగా భరోసానివ్వడం ఈ అంతర్జాతీయ దినోత్సవం ఇచ్చే ముఖ్యమైన సందేశం. సరైన అవేర్‌నెస్‌తో ఎంతోమంది ప్రాణాలను, వారి కుటుంబాల్లో వెలుగులను కాపాడుకోవచ్చు.
Also Read:పాత నోట్ల పేరుతో రూ.70 కోట్ల దందా.. AIని వాడి విచిత్ర మోసం!