Tomato Side Effects: టమాటోను మనం ప్రతి రోజు వంటకాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. ఇది కూరగాయలు, సూప్, సలాడ్ లేదా చట్నీలకు మంచి రుచిని అందిస్తుంది. ఇందులో విటమిన్ సి, లైకోపీన్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు. కానీ కొన్ని సమస్యలు ఉన్న వారు.. టమాటో తినడం వల్ల ప్రయోజనానికి బదులుగా హాని కలుగుతుంది.
టమాటోలు ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. అది శరీరంలో ఆమ్ల స్థాయిని మరింత పెరుగుతుంది. ఇది ఆర్థరైటిస్ లేదా కిడ్నీ సమస్యలను పెంచుతుంది. అంతే కాకుండా చర్మ సమస్యలను కూడా కలిగిస్తుంది. టమాటోలు ఏ 4 సమస్యలు ఉన్న వారు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యాస్ సమస్య:
టమాటోలలో సిట్రిక్ , ఆస్కార్బిక్ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయి కూడా పెరుగుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, గ్యాస్, తేనుపు లేదా అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఇప్పటికే యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు టమాటోలకు దూరంగా ఉండాలి.
కిడ్నీలో రాళ్ళు:
టమాటోలలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియంతో కలిసి మూత్రపిండాల్లో రాళ్లను కలిగిస్తుంది. ఈ మూలకం ముఖ్యంగా విత్తనాలలో సమృద్ధిగా కనిపిస్తుంది. ఒక వ్యక్తికి ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే.. టమాటోలు, వాటి విత్తనాలకు దూరంగా ఉండటం మంచిది.
కీళ్ళవాతం:
టమాటోలలో ఉండే సోలనిన్ అనే రసాయనం కొంతమందిలో వాపు, కీళ్ల నొప్పులను పెంచుతుంది. ఇది ఆర్థరైటిస్ రోగుల పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. ముఖ్యంగా రాత్రిపూట టమాటోలు తినడం వల్ల ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇబ్బందికరంగా ఉంటుంది.
Also Read: వర్షాకాలంలో ఇవి తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు !
అలెర్జీలు, చర్మ సమస్యలు:
కొంతమందికి టమాటోలు తినడం వల్ల అలెర్జీ కూడా రావచ్చు. అటువంటి సందర్భంలో.. వాటి లక్షణాలు చర్మంపై దురద, దద్దుర్లు, ముఖం వాపు లేదా గొంతు నొప్పి వంటివి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ పరిస్థితి ముఖ్యంగా సున్నితమైన చర్మం లేదా అలెర్జీలకు గురయ్యే వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది.