Yoga After Delivery| ప్రతి మహిళ ప్రసవం తర్వాత శారీరక, మానసిక మార్పులను అనుభవిస్తుంది. ఈ దశలో మహిళల శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. దీంతో వారు శారీరకంగా కొంత ఫిట్‌నెస్ కోల్పోతారు. ఈ ఫిట్ నెస్ తిరిగి పొందడానికి ప్రసవానంతర యోగా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రత్యేక యోగాసనాలతో మానసికంగా మహిళలు ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉంటారు. ఈ ఆసనాలు.. శరీరం, మనసు, భావోద్వేగాలను ఉత్తేజపరిచేందుకు ఉపకరిస్తాయి. చెన్నై, కరపక్కంలోని అపోలో క్రాడిల్ & చిల్డ్రన్స్ హాస్పిటల్ లో పనిచేసే డా. సౌమ్య రాఘవన్, MBBS, MD, DGO, DNB, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ & గైనకాలజిస్ట్ ప్రకారం.. ప్రసవం తర్వాత కండరాలు, ముఖ్యంగా శరీరం మధ్య భాగం అంటే నడుము, పొత్తి కడుపు, పెల్విస్ బలహీనంగా లేదా ఒత్తిడికి గురవుతాయి. అంతేకాకుండా హార్మోన్ల మార్పుల వల్ల మూడ్ స్వింగ్స్, అలసట, ఆందోళన వంటివి కూడా వస్తాయి.
ప్రసవానంతర యోగా అభ్యాసాలు
ప్రసవానంతర యోగా యొక్క ప్రధాన లక్ష్యం శరీర కదలికలను శ్వాసక్రియను జాగ్రత్తగా నిర్వహించడం. చిన్న చిన్న వ్యాయామాలను మెల్లగా చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు పొందవచ్చు.దీని కోసం ఈ యోగా భంగిమలు ఉపయోగపడతాయి.
ఈ భంగిమలు కొత్తగా తల్లులైన మహిళలకు సరళంగా, సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడ్డాయి. వీటిని మీ సౌలభ్యం, వేగం ప్రకారం సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ కదలికలు వీపు, తుంటిలో ఒత్తిడిని తగ్గించి.. శరీర సమతుల్యత, కదలికల పరిధిని మెరుగుపరుస్తాయి.
ప్రసవానంతర యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; ఇది మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. శ్వాసక్రియ, మనసు ప్రశాంతంగా ఉంచేందుకు ఈ అభ్యాసాలు ఒత్తిడిని తగ్గించి, ఓపికను పెంచుతాయి. స్వీయ-కరుణను అభివృద్ధి చేస్తాయి. నిద్రలేని రాత్రులు, తల్లిదండ్రుల బాధ్యతల గురించి ఉన్న అనిశ్చితిలో మనశ్శాంతిని కనుగొనడంలో ఇది సహాయపడుతుంది.
యోగా సామాజిక సంబంధాలను కూడా బలపరుస్తుంది. ఒకే విధమైన అనుభవాలను పంచుకునే యోగా అభ్యాసకుల సమూహంలో భాగం కావడం, చాలా ఓదార్పుగా ఉంటుంది. ఒంటరితనం అనే భావన కూడా యోగా తగ్గిస్తుంది.
Also Read: చనిపోయిన విష సర్పం..మనిషిని కాటేసిన 5 నిమిషాల్లోనే.. అతడి రక్తంలో ఏముందంటే
ప్రసవానంతర యోగా కొత్త మాతృమూర్తుల శరీరాన్ని, మనసును బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన మార్గం. కొత్త శక్తిని, స్థిరత్వాన్ని ఆత్మవిశ్వాసాన్ని యోగా అందిస్తుంది. ఈ సరళమైన అభ్యాసాలు మీ రోజువారీ జీవితంలో సులభంగా చేర్చుకోవచ్చు, మీ శరీరాన్ని మళ్లీ బలోపేతం చేయడంలో, మీ మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి.