E-Paper
Advertisement

Raw Mango Rice: పచ్చి మామిడికాయ రైస్.. వేసవిలో రుచిగా చేసుకునే రైస్ రెసిపీ

Raw Mango Rice:  పచ్చి మామిడికాయ రైస్.. వేసవిలో రుచిగా చేసుకునే రైస్ రెసిపీ
Advertisement

వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్లో పచ్చి మామిడికాయలు ఎక్కువగా కనిపిస్తాయి. పచ్చి మామిడికాయతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. పచ్చడి, పప్పు, చట్నీ, పులుసు ఇలా ఎన్నో వంటకాలు ఉంటాయి. అయితే వాటిలో చాలా మందికి నచ్చే వంటకం పచ్చి మామిడికాయ రైస్. దీనిని మామిడికాయ పులిహోర అని కూడా అంటారు. పుల్లటి రుచి, మంచి వాసనతో ఉండే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. వేసవిలో తినడానికి చాలా బాగుంటుంది. ఈ రైస్‌ను ఇంట్లో చాలా సులభంగా తయారు చేయవచ్చు.

పచ్చి మామిడికాయ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం – ఒక కప్పు
పచ్చి మామిడికాయ – ఒకటి
పచ్చిమిర్చి – మూడు
ఎండుమిర్చి – రెండు
పల్లీలు – రెండు స్పూన్లు
మినప్పప్పు – ఒక స్పూన్
శెనగపప్పు – ఒక స్పూన్
ఆవాలు – అర స్పూన్
పసుపు – చిటికెడు
కరివేపాకు – కొద్దిగా
ఇంగువ – చిటికెడు
నూనె – రెండు స్పూన్లు
ఉప్పు – తగినంత
కొత్తిమీర – కొద్దిగా

Advertisement

Also read: Raw milk: ముఖానికి పచ్చిపాలు రాస్తే చర్మం మెరిసిపోవడమే కాదు మురికి మొత్తం పోతుంది

పచ్చి మామిడి కాయ రైస్ రెసిపీ
1. ముందుగా బియ్యాన్ని కడిగి పొడి పొడిగా వచ్చేలా అన్నం వండుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి.
2. పచ్చి మామిడికాయను శుభ్రంగా కడిగి తొక్క తీసి తురిమి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి.
4. నూనె వేడయ్యాక ఆవాలు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత మినప్పప్పు, శెనగపప్పు వేసి కొద్దిసేపు వేయించాలి.
5. ఇప్పుడు పల్లీలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
6. తర్వాత ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక నిమిషం వేపాలి.
7. ఇప్పుడు పసుపు, ఇంగువ వేసి కలపాలి. వెంటనే తురిమిన పచ్చి మామిడికాయను వేసి బాగా కలపాలి.
8. మామిడికాయ ఎక్కువసేపు వండాల్సిన అవసరం లేదు. కేవలం రెండు మూడు నిమిషాలు వేపితే సరిపోతుంది.
9. ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత ముందుగా ఉడికించి చల్లార్చిన అన్నాన్ని ఈ మిశ్రమంలో వేసి నెమ్మదిగా కలపాలి.
10. అన్నం మొత్తం మామిడికాయ మిశ్రమంతో బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా కొత్తిమీర చల్లి మరోసారి నెమ్మదిగా కలపాలి.

Advertisement

Also read: Beetroot Biryani: రుచికరమైన బీట్‌రూట్ బిర్యానీ.. రెసిపీ చాలా సులువు

పచ్చి మామిడికాయ రైస్ వేడిగా తింటే అదిరిపోతుంది. దీనితో పాటు పెరుగు, అప్పడం లేదా ఉల్లిపాయ ముక్కలు ఉంటే మరింత రుచిగా ఉంటుంది. కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే మామిడికాయ పుల్లటి రుచి అన్నంలో బాగా కలిసిపోతుంది.
పచ్చి మామిడికాయలో విటమిన్ C, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. అలాగే జీర్ణక్రియ కూడా బాగా జరగడానికి సహాయపడతాయి. వేసవిలో పచ్చి మామిడికాయతో చేసే వంటకాలు తినడం వల్ల కొంత తేలికగా అనిపిస్తుంది.

Tags

Related News

మీ కండరాలు త్వరగా ముసలిబారుతున్నాయా? ఇంట్లోనే ఈ మూడు పరీక్షలు చేసి తెలుసుకోండి

నోట్లో వేయగానే కరిగిపోయే క్రిస్పీ ఫిష్ అమృత్‌సరి.. ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా ఇలా చేసుకోండి!

చికెన్ కీమా పరోటా ఇలా చేసుకుని తిన్నారంటే.. టేస్ట్ వేరే లెవెల్ అంతే!

హోటల్ స్టైల్ పూరీ కర్రీ..ఇంట్లోనే పక్కా కొలతలతో ఇలా చేయండి!

పక్కా కొలతలతో అదిరిపోయే టమాటో పచ్చడి..ఎన్ని రోజులైనా టేస్ట్ మారదు!

దీపావళికి ఇంటి టెర్రస్‌పై పార్టీ ఐడియా అదుర్స్.. ఈ విధంగా డెకరేషన్ చేయండి

30 ఏళ్లు దాటాక చేతులు, కాళ్ల చర్మంపై ముడతలు కనిపిస్తున్నాయా? ఈ 4 చిట్కాలు పాటించండి

మాట్లాడేటప్పుడు కళ్లు పక్కకు తిప్పడం బలహీనత కాదా? సైకాలజీ చెప్తున్న అసలు నిజమిదే!

Big Stories

Advertisement
×