E-Paper
Advertisement

పర్ఫెక్ట్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

పర్ఫెక్ట్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!
Advertisement

Rayalaseema uggani recipe: తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో ఉగ్గాని అంటే కేవలం ఒక టిఫీన్ కాదు, అది ఒక ఎమోషన్! అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి వైపు ఎక్కడికి వెళ్లినా ఉదయం పూట వేడి వేడి ఉగ్గానితో పాటు మిర్చి బజ్జీ నంజుకోవడానికి ఇస్తే ఆ మజానే వేరు. ఎంతో సింపుల్‌గా.. దొరికే బొరుగులతో (మరమరాలు) చేసే ఈ వంటకం క్షణాల్లో రెడీ అయిపోతుంది. అయితే.. చాలా మంది ఇంట్లో చేసుకున్నప్పుడు ఆ హోటల్ లేదా స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ రాదని ఫీలవుతుంటారు. పర్ఫెక్ట్ రాయలసీమ రుచి రావాలంటే.. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరి పోతుంది.

కావాల్సిన పదార్థాలు:

బొరుగుల (మరమరాలు) – 4 కప్పులు

Advertisement

ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)

పచ్చిమిర్చి – 5 లేదా 6 (కారం తగినట్లు)

Advertisement

టమాటాలు – 2 (చిన్న ముక్కలు)

పుట్నాల పొడి (పుట్నాలు, వెల్లుల్లి, జీలకర్ర మిక్సీ పట్టినది) – 3 టేబుల్ స్పూన్లు

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్

పసుపు, తగినంత ఉప్పు, నూనె

తాలింపు గింజలు (ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు)

తయారీ విధానం:

1.మొదట మరమరాలను ఒక పెద్ద గిన్నెలో నీటిలో వేసి ముంచిన వెంటనే గట్టిగా పిండి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మరమరాలను ఎక్కువ సేపు నీటిలో నానబెట్టకూడదు, కేవలం తడిసి మెత్తబడేలా చూసి వెంటనే నీరు పిండేయాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి చీలికలు, కరి వేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేగనివ్వాలి.

2.ఉల్లి పాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, చిటికెడు పసుపు వేసి టమాటాలు గుజ్జులా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నాన బెట్టి పిండి ఉంచుకున్న మరమరాలను ఆ తాలింపు మిశ్రమంలో వేయాలి. మరమరాలతో.. పాటు మనం తయారు చేసుకున్న ‘పుట్నాల పొడి’ని, తగినంత ఉప్పును చల్లు కోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అన్నీ బాగా కలిసేలా గరిటెతో తిప్పాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తి మీర చల్లు కొని స్టవ్ ఆఫ్ చేయాలి.

Also Read: సేమియా ఉప్మా బోర్ కొట్టిందా? ఇలా ఎగ్ సేమియా ట్రై చేయండి!

3. ఈ ఉగ్గాని తో పాటు వేయించిన పల్లీలు లేదా పచ్చి బఠానీలు కలిపితే.. టేస్ట్ మరింత పెరుగుతుంది. అలాగే దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన ‘మిర్చి బజ్జీ’ ఉంటే తినేటప్పుడు.. ఆ రుచి నెక్స్ట్ లెవెల్‌ కి వెళ్తుంది. ఉగ్గాని పొడి వేసిన తర్వాత ఎక్కువ సేపు స్టవ్ మీద ఉంచ కూడదు. లేదంటే మమరాల టెక్చర్ మారి పోతుంది.

ఈ వీకెండ్ లో మీ ఇంట్లో ఈ ట్రెండీ రాయలసీమ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీకి కిర్రాక్ టేస్ట్ చూపించండి!

Related News

వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఈ స్టైల్‌లో చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ!

రొమ్ము క్యాన్సర్ ఈ దశకు చేరితే ఏం జరుగుతుంది? ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే!

నోటికి కారంగా, సూపర్ టేస్టీగా ఆలూ పచ్చి కారం ఫ్రై!

నెల రోజులపాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు..క్షణాల్లోనే చేయండిలా!

సేమియా ఉప్మా బోర్ కొట్టిందా? ఇలా ఎగ్ సేమియా ట్రై చేయండి!

అతనంటే ఎంతో ఇష్టం.. కానీ ఐ లవ్ యు చెప్పడానికి భయం.. మనసులో మాట చెప్పేందుకు టిప్స్

ఈ ముగ్గురికి పొరపాటున కూడా సాయం చేయకండి..లేదంటే మీ జీవితమే నాశనం!

Big Stories

Advertisement
×