E-Paper
Advertisement

పురుషులు ఎప్పటికీ బయటికి చెప్పరు.. రిలేషన్‌షిప్‌లో ఈ 9 విషయాలు కోరుకుంటారు

పురుషులు ఎప్పటికీ బయటికి చెప్పరు.. రిలేషన్‌షిప్‌లో ఈ 9 విషయాలు కోరుకుంటారు
Advertisement

What Men Want| ఒక బంధం బలంగా ఉండాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం, కష్టాల్లో తోడుగా నిలవడం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా పురుషులు తమ భావాలను బయటకు చెప్పరని, అన్ని సమస్యలను తామే ఎదుర్కొంటారని చాలామంది అనుకుంటారు. కానీ వారికి కూడా ప్రేమ, భరోసా, ప్రశంస, మానసిక మద్దతు అవసరమే. అయితే కొన్ని విషయాలను వారు తమ భాగస్వామితో కూడా చెప్పలేకపోవచ్చు. అలాంటి 9 విషయాలను తెలుసుకుంటే మీ బంధం మరింత బలంగా ఉంటుంది.

1. మనస్ఫూర్తిగా ప్రశంస

భాగస్వామి చేసే చిన్న సహాయాన్ని కూడా గుర్తించి ప్రశంసిస్తే వారికి సంతోషం కలుగుతుంది. ఇంటి పనుల్లో మీ భర్త లేదా ప్రేమికుడు సహాయం చేసినా, మీ కోసం ఏదైనా చేసినా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. ఇతరుల ముందు వారి మంచి పనులను గుర్తించడం కూడా వారికి గౌరవించే ఫీలింగ్ కలిగిస్తుంది.

2. తాము చెప్పేది భార్య అడ్డు చెప్పకుండా వినాలని

Advertisement

ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు తమ బాధలను ప్రశాంతంగా వినే వ్యక్తి ఉంటే చాలని పురుషులు భావించవచ్చు. వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపకుండా వినండి. ఇతరులతో పోల్చడం, విమర్శించడం చేయకుండా వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

3. భార్య కూడా ప్రేమను వ్యక్తం చేయాలి

ప్రతిసారీ పురుషులే ప్రేమను వ్యక్తం చేయాలని ఎదురుచూడకండి. మీరే ముందుగా దగ్గరకు వెళ్లి కౌగిలించుకోవడం, చేయి పట్టుకోవడం వంటి చిన్న పనులు చేయండి. ఇలాంటి చర్యలు మీ ప్రేమను తెలియజేస్తాయి. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఇద్దరూ ప్రయత్నిస్తున్నారనే భావన కలిగిస్తాయి.

4. తమ భావాలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం

Advertisement

సమాజం పురుషులు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని ఆశిస్తుంది. అందువల్ల తమ భయాలు, బాధలను బయటపెట్టడానికి కొందరు వెనుకాడతారు. అందుకే మీ భర్త/లివ్ ఇన్ పార్ట్‌నర్ మనసులోని మాటలను చెప్పినప్పుడు ఎగతాళి చేయకండి. అర్థం చేసుకుంటూ మాట్లాడితే మీపై నమ్మకం పెరుగుతుంది.

5. ప్రేమతో పాటు గౌరవం కూడా

బంధంలో ప్రేమ ఎంత ముఖ్యమో గౌరవం కూడా అంతే ముఖ్యం. భాగస్వామి అభిప్రాయాలు, నిర్ణయాలు, భావాలకు విలువ ఇవ్వండి. విభేదాలు వచ్చినప్పుడు కూడా అవమానించే మాటలు మాట్లాడకండి. పరస్పర గౌరవం బంధాన్ని బలపరుస్తుంది.

6. భార్య నమ్మకం

ఆత్మవిశ్వాసంతో కనిపించే వ్యక్తికి కూడా కొన్నిసార్లు ప్రోత్సాహం అవసరం. “నాకు నీపై నమ్మకం ఉంది”, “నువ్వు నాకు చాలా ముఖ్యం” వంటి మాటలు వారికి ధైర్యాన్నిస్తాయి. నిజాయితీతో ఇచ్చే భరోసా బంధంలో నమ్మకాన్ని పెంచుతుంది.

7. తమ ప్రయత్నాలను గుర్తించాలని కోరుకుంటారు

ఇంటి పనుల్లో సహాయం చేయడం, పిల్లలను చూసుకోవడం, మీకు నచ్చిన విషయాలను గుర్తుంచుకోవడం వంటి పనులను చిన్నవిగా చూడకండి. వారి ప్రయత్నాలను గుర్తించి ధన్యవాదాలు చెప్పండి. అప్పుడు తమ కృషికి విలువ ఉందని వారు భావిస్తారు.

Also Read: టీనేజ్ పిల్లలకు తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు ఎందుకు నచ్చవు? అసలు కారణం ఇదే

8. పర్సనల్ గ్యాప్

ఎప్పుడూ కలిసి ఉండటమే మంచి బంధానికి గుర్తు కాదు. స్నేహితులను కలవడం, ఇష్టమైన పనులు చేయడం లేదా కొంతసేపు ఒంటరిగా గడపడం కూడా అవసరం. ఒకరికొకరు వ్యక్తిగత సమయం ఇవ్వడం వల్ల బంధంలో స్వేచ్ఛ, ప్రశాంతత ఉంటాయి.

Also Read: స్కూల్‌ వెళ్లడానికి మీ పిల్లాడు భయపడుతున్నాడా? పిల్లలు బుల్లీయింగ్‌‌కు గురవుతున్నట్లు తెలిపే సంకేతాలు ఇవే

9. ఏ మార్పు లేకుండా తమను అంగీకరించాలని

ఇతరులతో పోల్చడం వల్ల మీ భర్తలో అభద్రతాభావం పెరగవచ్చు. అందుకే వారు ఎలా ఉన్నారో అలా అంగీకరించండి. మార్పులు అవసరమైతే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ప్రేమను పొందడానికి మరొకరిలా మారాల్సిన అవసరం లేదనే భరోసా ఇవ్వండి.

Related News

కొత్త ఇంటికి ఎలాంటి ఫ్లోరింగ్ వేయించాలి? మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేసే 5 ఫ్లోరింగ్ డిజైన్స్

చాణక్య నీతి.. జీవితంలో ఈ 5 సందర్భాల్లో భావోద్వేగాలకు లొంగకండి లేకుంటే భారీ నష్టమే

చలికాలంలో చర్మం పొడిబారుతోందా? ఇంట్లో తయారు చేసే ఈ బాడీ స్క్రబ్స్‌ ట్రై చేయండి

పిల్లల మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఎలా? ప్రతిరోజు ఇలా మాట్లాడితే స్వయంగా చెప్పేస్తారు

కంటి పరీక్షల్లో అంతా నార్మల్.. కానీ చీకటి పడితే చూపు మందగిస్తోందా? కొత్త జన్యు వ్యాధిని గుర్తించిన శాస్త్రవేత్తలు!

బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా నూడిల్స్ కట్లెట్! ఇంట్లోనే ఈజీగా చేయండిలా

ఆరెంజ్ గ్లో కోసం ఇదేం ప్రయోగం! వైరల్ ట్రెండ్‌పై షాకింగ్ ఫ్యాక్ట్స్

కరాచీ హల్వా పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ కొలతలు, టిప్స్ పక్కాగా ఫాలో అవ్వాలి!

Big Stories

Advertisement
×