BigTV English
Advertisement

Sesame Seeds For Winter : నువ్వులతో శీతాకాల వ్యాధులు దూరం

Sesame Seeds For Winter : నువ్వులతో శీతాకాల వ్యాధులు దూరం

Sesame Seeds For Winter : చిన్నవిగానే ఉన్నా నువ్వులతో బోలెడంత ఆరోగ్యం. పోషకాలు అధికంగా నవ్వులను శీతాకాలంలో మరింత ఎక్కువగా తీసుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వులు, ఫైబర్, విటమిన్లు ఈ గింజల్లో పుష్కలం. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్‌కూ కొదవ ఉండదు. చలికాలంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేవి ఈ పోషకాలే. అందుకే కూరల్లో, పిండివంటల్లో వీటికి ఎనలేని ప్రాధాన్యం కల్పించారు.


నువ్వులు వేడి కలగజేస్తాయనేది విశ్వాసం.అందుకే చైనీయుల సంప్రదాయ ఔషధాల్లో, ఆయుర్వేదంలోనూ వీటికి అధిక ప్రాధాన్యం. చలి వాతావరణంలో శరీరానికి వేడిని ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది. నులివెచ్చదనం కూడా లభిస్తుంది. నువ్వుల్లోని అధిక కేలరీలు మన ఎనర్జీ లెవల్స్‌ను స్థిరంగా ఉంచుతాయి.

ఇమ్యూన్ వ్యవస్థ సరిగా పనిచేయడానికి జింక్ అవసరం. ఇమ్యూన్ సెల్స్ పెరగాలన్నా, వాటి పనితీరు బాగా ఉండాలన్నా తరచూ జింక్ తీసుకుంటుండాలి. ఇందుకు మన ఆహారంలో నువ్వులను చేరిస్తే సరి. ఇమ్యూన్ సిస్టమ్‌కు తోడ్పాటు అందించడమే కాకుండా.. శీతాకాలంలో వచ్చే వ్యాధులను దూరం పెడుతుంది.


హెల్దీ ఫ్యాట్స్, మోనోశాట్యురేటెడ్ ఫ్యాట్స్, పాలీఅన్‌శాట్యురేటెడ్ ఫ్యాట్స్ నువ్వుల గింజల్లో ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఇవే ప్రధానం. శీతాకాలంలో చర్మ సమస్యలను అధిగమించేందుకు ఆహారంలో నువ్వులను చేర్చడం తప్పనిసరి.

దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడాలంటే నల్ల నువ్వులు బెస్ట్. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి నల్వ నువ్వులు రక్షిస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. శరీరంలో టాక్సిన్స్‌ను సైతం తొలగించవచ్చు. నల్ల‌నువ్వుల్లో లభించే విటమిన్ బీ6, మెగ్నీషియం వంటివి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Related News

Okra Water: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. బెండకాయ నీటితో అద్భుత మార్పు!

Wheatgrass juice: రోజూ ఈ రసం తాగితే చాలు.. బీపీ, షుగర్, మొటిమలు అన్నీ తగ్గిపోతాయా?

Dry Fruits For Diabetes: షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే.. ఈ డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తినాల్సిందే !

Blue Light: బ్లూ లైట్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ! కంటి సమస్యలతో ఇవి కూడా..

AC Effect on Skin: ఏసీలో ఎక్కువ సేపు గడిపితే.. ఎప్పటికి ముసలోళ్లు అవ్వరా? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే?

Pineapple: వీళ్లు.. పొరపాటున కూడా పైనాపిల్ తినకూడదు !

Upma Breakfast : ఉప్మా ఇష్టం లేదా? AIIMS గ్యాస్ట్రోఎంటెరాలజిస్ట్ చెప్పింది తెలిస్తే.. వద్దనుకుండా తినేస్తారు

Stress Side Effects: ఒత్తిడితో ఈ ఆరోగ్య సమస్యలు.. తగ్గించుకోకపోతే ప్రమాదమేనట !

Big Stories

×