Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావడానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ పరువు తీసిన పాక్ రిపోర్టర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ప్రతి మ్యాచ్ లో అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ పైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో వీక్ బౌలర్లను టార్గెట్ చేసి వైభవ్, సూర్య వంశీ అదరగొడుతున్నాడని షాహిద్ అఫ్రిది ( Shahid afridi) సీరియస్ అయ్యారు. ఒక్కసారి నా అల్లుడు షాహీన్ అఫ్రిది బౌలింగ్ ను వైభవ్ ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. తన అల్లుడు వేసే మొదటి బంతికే వైభవ్ సూర్యవంశీ డకౌట్ కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు. అలా ఔట్ కాకపోతే తాను, క్రికెట్ విశ్లేషణ ఇక పైన చేయబోనని.. ఆ జోలికి వెళ్ళానని తేల్చి చెప్పారు షాహిద్ అఫ్రిది. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో అద్భుతంగా ఆడుతున్న వైభవ్ సూర్య వంశీని అటు తన్వీర్ అహ్మద్, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. వైభవ్ సూర్య వంశీ వయసు 15 సంవత్సరాలు కాదని.. అతని వయసు 25 సంవత్సరాలు ఉంటుందని ఆరోపణలు చేశారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రంగంలోకి దిగి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 15 ఏళ్ల కుర్రాడు ఇంత భయంకరంగా ఆడడం సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు తన్వీర్ ( Tanveer ahmed), షోయబ్ అక్తర్.
https://www.facebook.com/photo/?fbid=122176530386784311&set=a.122099109440784311