E-Paper
Advertisement

వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఈ స్టైల్‌లో చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ!

వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఈ స్టైల్‌లో చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ!
Advertisement

Vankaya nuvvula roti pachadi: తెలుగువారి వంటకాల్లో రోటి పచ్చళ్లకు ఉండే క్రేజే వేరు. మిక్సీలో పట్టుకునే.. చట్నీలకంటే రోట్లో లేదా కచ్చా-పచ్చాగా దంచే.. పచ్చళ్లలో అసలైన రుచి బయటపడుతుంది. అందులోనూ వంకాయతో .. చేసే పచ్చళ్ళు అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. వంకాయను కాల్చి చేసే పచ్చడి ఒకెత్తయితే, నువ్వులు చేర్చి చేసే ‘వంకాయ నువ్వుల రోటి పచ్చడి’ రుచి మాత్రం మాటల్లో చెప్పలేం. నువ్వుల్లో ఉండే కమ్మదనం, వంకాయలో ఉండే గుజ్జు చాలా అద్భుతమైన రుచి అందిస్తాయి. ఇంతకీ ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..

కావాల్సిన పదార్థాలు:

ఈ సూపర్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు మన ఇంట్లోనే దొరుకుతాయి. లేత వంకాయలు – 4 లేదా 5, తెల్ల నువ్వులు – 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి – 6 నుంచి 8 (కారం తగినట్లు), చింతపల్లి చిన్న నిమ్మ కాయ సైజు అంత, వెల్లుల్లి రెబ్బలు -6,జీలకర్ర -1 స్పూన్, తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నూనె. పోపు కోసం ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి అవసరమవుతాయి.

తయారీ విధానం:

Advertisement

1.ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా తరగాలి. కొద్దిగా నూనె వేసి వంకాయ ముక్కలను మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.

2.అదే బాణలిలో నువ్వులను నూనె లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. నువ్వులు మాడి పోకుండా చూసుకోవాలి. లేదంటే చేదు వస్తుంది.

Advertisement

3. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి పచ్చి మిర్చి, జీల కర్ర, వెల్లుల్లి రెబ్బలను వేయించాలి.

Also Read: సేమియా ఉప్మా బోర్ కొట్టిందా? ఇలా ఎగ్ సేమియా ట్రై చేయండి!

4.మిశ్రమం అంతా చల్లారిన తర్వాత రూట్లో.. లేదా మిక్సీ జార్‌లో వేయించిన నువ్వులు, పచ్చి మిర్చి, చింత పండు, తగినంత ఉప్పు వేసి కచ్చా-పచ్చాగా గ్రైండ్ చేయాలి.

5.ఆ తర్వాత మగ్గించి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా అందులో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా ఉండేలా రుబ్బుకోవాలి.

6.చివరగా ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువతో పోపు పెట్టి పచ్చడిలో కలిపితే సరి పోతుంది!

వంకాయలు ఎంచుకునేటప్పుడు తాజా లేత వంకాయలను వాడితే.. పచ్చడి చాలా రుచిగా వస్తుంది. అలాగే నువ్వులను వేయించేటప్పుడు సిమ్ లో పెట్టి వేయించడం చాలా ముఖ్యం. ఈ పచ్చడి వేడివేడి అన్నంతో పాటు నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోసెలకు కూడా ఇది అదిరి పోయే కాంబినేషన్‌గా పని చేస్తుంది. ఈ ట్రెండీ విలేజ్ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీ కుటుంబ సభ్యులకు వడ్డించండి!

Related News

పర్ఫెక్ట్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

రొమ్ము క్యాన్సర్ ఈ దశకు చేరితే ఏం జరుగుతుంది? ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే!

నోటికి కారంగా, సూపర్ టేస్టీగా ఆలూ పచ్చి కారం ఫ్రై!

నెల రోజులపాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు..క్షణాల్లోనే చేయండిలా!

సేమియా ఉప్మా బోర్ కొట్టిందా? ఇలా ఎగ్ సేమియా ట్రై చేయండి!

అతనంటే ఎంతో ఇష్టం.. కానీ ఐ లవ్ యు చెప్పడానికి భయం.. మనసులో మాట చెప్పేందుకు టిప్స్

ఈ ముగ్గురికి పొరపాటున కూడా సాయం చేయకండి..లేదంటే మీ జీవితమే నాశనం!

Big Stories

Advertisement
×