E-Paper
Advertisement

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?
Advertisement

Glanza CNG vs Altroz iCNG: తక్కువ ఫ్యూయల్ ఖర్చుతో పాటు మంచి ఫీచర్లు ఉన్న కారు కొనాలని చూస్తున్నారా? అయితే, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో టయోటా గ్లాంజా CNG, టాటా ఆల్ట్రోజ్ iCNG మంచి ఆప్షన్లుగా కొనసాగుతున్నాయి. గ్లాంజా మైలేజ్ విషయంలో ముందుండగా.. ఆల్ట్రోజ్ ట్విన్ సిలిండర్ టెక్నాలజీ,  పెద్ద బూట్ స్పేస్‌తో ఆకట్టుకుంటుంది. ఈ రెండు కార్లలో ఇంజిన్ పనితీరు, సేఫ్టీ, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మైలేజ్ విషయంలో గ్లాంజా ముందంజ!

మైలేజ్‌ను ప్రధానంగా చూసే వారికి టయోటా గ్లాంజా CNG బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దీని మాన్యువల్ వెర్షన్ 33.61 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుంది. AMT వెర్షన్‌లో ఈ సంఖ్య 34.47 కి.మీ/కేజీగా ఉంటుంది. మరోవైపు, టాటా ఆల్ట్రోజ్ iCNG మాన్యువల్ వెర్షన్ 26.20 నుంచి 27.80 కి.మీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారులోనూ AMT ఆప్షన్ అందుబాటులో ఉంది. అయితే, వేరియంట్‌ను బట్టి మైలేజ్ మారుతుంది.

ఇంజిన్ పనితీరులో ఏది బెటర్?

Advertisement

రెండు కార్లలోనూ 1.2-లీటర్, 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. గ్లాంజా CNG మోడ్‌లో 70 PS పవర్, 101.8 Nm టార్క్‌ ను అందిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో 83 PS పవర్, 112.4 Nm టార్క్ లభిస్తుంది. ఆల్ట్రోజ్ iCNG CNG మోడ్‌లో 73.5 PS పవర్, 103 Nm టార్క్‌ను అందిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో 88 PS పవర్, 115 Nm టార్క్ ఉంటుంది. అధికారిక లెక్కల ప్రకారం ఆల్ట్రోజ్‌కు కాస్త ఎక్కువ పవర్, టార్క్ ఉన్నాయి. అయితే, రియల్ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ రోడ్డు పరిస్థితులు, లోడ్, డ్రైవింగ్ స్టైల్‌పై ఆధారపడి ఉంటుంది.

బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్ ప్రత్యేకత!

CNG కార్లలో లగేజ్ స్పేస్ కూడా కీలకంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా సిలిండర్ వల్ల బూట్ స్పేస్ తగ్గుతుంది. టాటా ఆల్ట్రోజ్ iCNGలో ట్విన్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించారు. రెండు సిలిండర్లను బూట్ ఫ్లోర్ కింద అమర్చడం వల్ల లగేజ్ పెట్టుకోవడానికి ఎక్కువ స్థలం లభిస్తుంది. గ్లాంజా CNGలో ఒకే పెద్ద సిలిండర్ ఉంటుంది. దీంతో బూట్‌లో లగేజ్ పెట్టుకునే స్థలం తక్కువగా ఉంటుంది.

ఫీచర్లు, సేఫ్టీలో పోటీ

Advertisement

గ్లాంజాలో హెడ్ అప్ డిస్‌ ప్లే, 360 డిగ్రీ కెమెరా, వైర్‌ లెస్ ఛార్జర్, టచ్‌ స్క్రీన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఆల్ట్రోజ్‌లో పెద్ద టచ్‌ స్క్రీన్, వాయిస్ అసిస్టెంట్‌ తో సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్ లాంటి ఫీచర్లు లభిస్తాయి. సేఫ్టీ పరంగా గ్లాంజాలో ఆరు ఎయిర్‌బ్యాగులు, ESP, హిల్ హోల్డ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఆల్ట్రోజ్‌లోనూ ఆరు ఎయిర్‌బ్యాగులు, ESP, కార్నర్ బ్రేక్ కంట్రోల్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆల్ట్రోజ్‌కు భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్ ఉంది. గ్లాంజా క్రాష్ టెస్ట్ రేటింగ్ అందుబాటులో లేదు.

ధర విషయంలో ఏది ముందు?

టాటా ఆల్ట్రోజ్ iCNG ధరలు సుమారు రూ.7.30 లక్షల నుంచి రూ.10.80 లక్షల వరకు ఉంది.టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ పూర్తి ధరల లిస్టు ఇంకా వెల్లడించలేదు.

Read Also: హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

Tags

Related News

హ్యుందాయ్ బేయాన్ N లైన్ వచ్చేసింది.. టర్బో పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా!

డెంజా D9 ఇండియన్ లాంచ్‌కు రెడీ.. ధర ఎంతో తెలుసా?

కవాసకి వెర్సిస్ 900 వచ్చేసింది, భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

భారత్‌ పై విన్‌ఫాస్ట్ ఫుల్ ఫోకస్.. తెలంగాణ, ఏపీలోనూ షోరూమ్‌లు!

కొత్త కలర్, సరికొత్త ఫీచర్లు.. MG విండ్సర్ EV కొత్త ఎడిషన్ వచ్చేసింది!

మహీంద్రా XUV 3XO CNG టీజర్ విడుదల.. అక్టోబర్ 15న ఆవిష్కరణ!

జస్ట్ 150 యూనిట్స్.. BYD సీలియన్ 7 కొత్త ఎడిషన్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×