Japan People: ఒక్కో దేశ ప్రజల ఆహార-దినచర్యలు వేర్వేరుగా ఉంటాయి. ఒక్కో దేశం ఒక్కో శైలిని అనుసరిస్తుంది. దాని వెనుక ఆరోగ్య కారణాలు ఉంటాయని చాలామంది చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే జపనీయుల జీవనశైలి మనకంటే భిన్నంగా ఉంటుంది. మనం పాటించే అలవాట్లకు పూర్తి విరుద్ధంగా పాటిస్తారు.
జపాన్‌వాసుల వెరైటీ అలవాట్లు-భారత్‌లో ప్రజలు ఉదయం వేళ స్నానం చేస్తేనే ఇంట్లో కాలు తీసి బయటపెడతారు. ఆ తర్వాతే ఇతర పనులు మొదలుపెడతారు. జపాన్‌లో ప్రజలు రాత్రి వేళ స్నానం చేయడానికి ఇష్టపడతారు. కేవలం ఒక అలవాటు మాత్రం కాదు. అది వారి జీవనశైలిలో ఒక అంతర్భాగం. ఈ విషయం కొంచెం ఆశ్చర్యం కలిగించవచ్చు.భారత్‌లో ఉదయం స్నానం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుందని నమ్ముతారు. దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
పరిశుభ్రతకు కేరాఫ్ జపనీయులు-జపాన్ వాసులు అంటే పరిశుభ్రతకు మారు పేరు. అందుకే అక్కడి ప్రజలు 80 నుంచి 100 ఏళ్లు మధ్య జీవిస్తారు. వారు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అందరికీ తెలుసు. రోజంతా అంటిన దుమ్ము, ధూళి, చెమటతో నిద్రపోవడం వల్ల వారి పరిశుభ్రత నియమాలకు అనుగుణంగా అనిపించదు. అందుకే నిద్రపోయే ముందు స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించడానికి ఇష్టపడతారు. జపనీస్ సంస్కృతిలో భాగంగా రాత్రి వేళ స్నానం చేయడం పగటి-రాత్రి మధ్య ఒక మానసిక సరిహద్దుగా భావిస్తారు.
రాత్రి వేళ స్నానం అదే వారి సీక్రెట్- ఎందుకంటే రాత్రి వేళ వేడి నీటితో స్నానం చేయడం వల్ల రోజంతా పని ఒత్తిడి, ఆందోళన వంటి పనులకు స్వస్తి పలకవచ్చని నమ్ముతారు. ప్రశాంతంగా నిద్రపోయే సమయం మెదడుకు మానసిక సంకేతాన్ని పంపి, ప్రశాంతమైన నిద్రకు దారి తీస్తుందని వారి నమ్మకం. మరో విషయం ఏంటంటే జపనీయులు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని కాసేపు హాయిగా కూర్చోవడాన్ని అధికంగా ఇష్టపడతారు.
ALSO READ: గోల్కండ కోటలో హిందువులు బోనాలు ఎందుకు చేస్తారో తెలుసా? ఇదే కదా మన దేశం ప్రత్యేకత!
ఎందుకంటే అక్కడ ప్రతి ఇంట్లో స్నానపు తొట్టి ఉంటుంది. ప్రజలు రోజంతా శ్రమించిన తర్వాత ఒకొక్కరుగా సేద తీరుతారు. దీనివల్ల కండరాల రిలాక్స్ అయి శరీర నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. మెరిసే చర్మం కావాలంటే మొదటి మీ నిద్రను మెరుగు పరచుకోవడమేనని ఆరోగ్య నిపుణులు నిత్యం చెబుతారు.
మంచి నిద్రకు-మెరిసే చర్మానికి నేరుగా సంబంధం ఉంటుందట. అందుకే జపనీయులు ఎక్కువగా నిద్రపోయే ముందు స్నానం చేస్తుంటారు. వారి మెదడుకు విశ్రాంతి ఇచ్చి మెలటోనిన్ అంటే నిద్ర హార్మోన్‌ను విడుదల చేస్తుందని భావిస్తుంటారు. నిద్ర గాఢంగా ఉన్నప్పుడు మీ చర్మం దానంతట అదే మెరుస్తుందని బలంగా నమ్ముతారు కూడా. ఇక ఆహారం అలవాట్ల గురించి మీకే తెల్సిందే.