Madhavan: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సినీ నటుడు మాధవన్(Madhavan) ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన ఇటీవల బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఎంత బిజీగా ఉన్నారు.. ఇటీవల మాధవన్ “అప్ జైసా కోయి ” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే . ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో మాధవన్ కనిపించబోతున్నారని, ఇప్పటికే ఈయనకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు షూటింగ్ కూడా పూర్తి అయ్యాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.
ఆ విషయంలో రజనీకాంత్ గారు స్ఫూర్తి…
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవన్ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగే వారందరూ కూడా తమ అందం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తెల్ల జుట్టు కనపడకుండా హీరోలు ఎప్పుడు రంగు వేసుకుంటూ ఉంటారు. కానీ మాధవన్ మాత్రం ఇందుకు చాలా భిన్నం అని చెప్పాలి. ఈయన బయటకు వచ్చినా తెల్ల జుట్టుతోనే కనిపిస్తూ ఉంటారు. ఈ విషయం గురించి మాధవన్ మాట్లాడుతూ..” తాను సినిమాలలో నటించేటప్పుడు పాత్రకు అవసరమైతే తప్ప రంగు వేయనని వెల్లడించారు. ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ గురించి తాను అసలు బాధపడనని ఈ విషయాన్ని తాను సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) గారి నుంచి నేర్చుకున్నానని” తెలిపారు.
నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు…
ప్రస్తుతం నాలా నేను ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాను. ఇతరుల కంటే వయసులో తాను చిన్నవాడిని అని చూపించుకోవాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదని, అందుకే జుట్టుకు తాను రంగు వేయను అంటూ ఈ సందర్భంగా మాధవన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే ఇంటర్వ్యూలో భాగంగా ఈయన అవార్డుల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గత నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న తనకు ఎలాంటి అవార్డులు రాలేదని చాలామంది భావించవచ్చు.. నాకు అవార్డులతో ఏమాత్రం పని లేదని తెలిపారు.
నా దృష్టిలో అవార్డులు ముఖ్యం కాదు…
దిలీప్ కుమార్ లాంటి గొప్ప వ్యక్తులకే జాతీయ అవార్డులు రాలేదు.. నా దృష్టిలో అవార్డులు ముఖ్యం కాదని, ప్రేక్షకులను అల్లరించడమే ముఖ్యమని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా తాను ఎంతో మంచి పాత్రలలో నటించే అవకాశాన్ని అందుకుంటున్నాను నటుడిగా నాకు ఇది చాలు అంటూ మాధవన్ అవార్డుల గురించి కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే ఇండస్ట్రీలో ఎంతో మంచి టాలెంట్ కలిగిన హీరోలకు కూడా కొన్ని సందర్భాలలో అవార్డులు రాకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు కానీ ఒక నటుడికి అవార్డు అనేది గుర్తింపు కాదని ప్రేక్షకులను సంపాదించుకోవడం వారికి నచ్చిన సినిమాలు చేయటమే అసలైన గుర్తింపు అంటూ మాధవన్ ఈ సందర్భంగా చెప్పకనే చెప్పారు.
Also Read: Bigg Boss New Voice: బిగ్ బాస్‌నే మార్చిపడేశారు… వాయిస్ ఏంటి ఇలా ఉంది ?