BigTV English

Viral Video: ఈ రెస్టారెంట్‌ లో గాల్లో ఎగురుతూ వడ్డిస్తారు.. భలే ఉందే!

Viral Video: ఈ రెస్టారెంట్‌ లో గాల్లో ఎగురుతూ వడ్డిస్తారు.. భలే ఉందే!

ప్రపంచ వ్యాప్తంగా పలు యూనిక్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఆయా రెస్టారెంట్లలో కస్టమర్లకు భోజనం వడ్డించే విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని చోట్ల రోబోలు భోజనాన్ని సర్వ్ చేస్తే, మరికొన్ని చోట్ల చిన్న రైలు బండ్లు కిచెన్ నుంచి కస్టమర్ల దగ్గరికి భోజనాన్ని తీసుకొస్తాయి. కొన్ని రెస్టారెంట్లు కస్టమర్లను ఆకాశంలో కూర్చొబెట్టి భోజనాన్ని వడ్డిస్తుండగా, మరికొన్ని సముద్రం లోపల ఉన్న ఫీలింగ్ కలిగించేలా ఏర్పాట్లు చేశాయి. కొన్నిరెస్టారెంట్లు బయట వాతావరణం ఎలా ఉన్నా, అక్కడ మాత్రం వర్షం కురిసేలా ఏర్పాట్లు చేశాయి. ఈ రెస్టారెంట్ కు వెళ్లే కస్టమర్లు నిజంగా వర్షం పడుతున్న వాతావరణం అనుభూతిని పొందుతారు. వీటన్నింటితో పోల్చితే బ్యాంకాక్ లోని రాయల్ డ్రాగన్ రెస్టారెంట్ మరింత డిఫరెంట్ గా ఉంటుంది. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటంటే..


గాల్లో ఎగురుతూ భోజనం వడ్డింపు

బ్యాంకాక్‌ లోని రాయల్ డ్రాగన్ అనే రెస్టారెంట్ లో కస్టమర్లకు సిబ్బంది గాల్లో ఎగురుతూ వచ్చి భోజనం వడ్డిస్తారు. ఈ పద్దతి అచ్చం సర్కర్ ఫీట్ల మాదిరిగా కనిపిస్తుంది. దీనిలో ప్రత్యేకమైన జిప్‌ లైన్ ఫుడ్ డెలివరీ వ్యవస్థ ఉంటుంది. భోజన ప్రాంతం అంతటా సర్వర్లు జిప్‌ లైన్‌ లో ఉండి, టేబుళ్లకు ఆహారాన్ని తీసుకెళ్తారు. భోజనం తీసుకెళ్లే విధానం చాలా వింతగా, ఆకట్టుకునేలా ఉంటుంది.  నాటక ప్రదర్శన చేసినట్లుగా కనిపిస్తుంది. బ్యాంకాంక్ లోనే కాదు, ప్రపంచంలోనే ఈ తరహా ఆహారం సరఫరా చేసే రెస్టారెంట్ మరెక్కడా లేదు.


రాయల్ డ్రాగన్ అనే రెస్టారెంట్  గురించి..

ప్రత్యేకమైన భోజన అనుభవం: రాయల్ డ్రాగన్ కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు. ఇదో అందమైన ప్రదేశం. జిప్‌ లైన్ వ్యవస్థ  ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇక్కడి నాటకీ దృశ్యాలను చూస్తూ కస్టమర్లు ఎంతో రిలాక్స్ గా భోజనం చేస్తారు. ఉల్లాసంగా గడుపుతారు.

గ్రాండ్ స్కేల్: ఈ  రెస్టారెంట్ చాలా పెద్దది ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ గా గిన్నీస్ బుక్ ఆఫర్ వరల్డ్ రికార్డ్ ను కలిగి ఉంది.

నాటక ప్రదర్శన: సర్వర్లు జిప్‌ లైన్‌ లో జరుతూ వేడి భోజనాన్ని పట్టుకుని రాకపోకలు కొనసాగిస్తూ కనువిందు చేస్తుంటారు. ఈ నాటకీయ పరిణామాలు ఆకట్టుకుంటాయి.

Read Also: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!

రోలర్‌ బ్లేడింగ్ సర్వర్లు: జిప్‌ లైనింగ్‌ తో పాటు, సిబ్బంది రెస్టారెంట్‌ లో ఆహారం డెలివరీ చేయడానికి టేబుళ్ల మధ్య తిరుగుతూ తిరుగుతూ ఉంటారు. ఇది కూడా చాలా ఆకట్టుకునేలా ఉంటుంది.

గత కొద్ది కాలంగా ఈ రెస్టారెంట్ మూత పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్న అధునాతన సౌకర్యాలతో మళ్లీ ఓపెన్ చేయాలని రెస్టారెంట్ నిర్వాహకులు భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కొద్ది రోజుల్లోనే ఈ అద్భుతమైన రెస్టారెంట్ మళ్లీ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.

Read Also: సహజీవనం చట్టబద్దమా? పెళ్లి కాకుండా కలిసుంటే కష్టాలే ఉండవా? లివ్-ఇన్ ఉండే కపుల్స్ ఏం చేస్తారు?

Related News

Viral Video: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

ఇది రియల్లీ మైండ్ బ్లోయింగ్ వీడియా.. తాళాన్ని క్షణాల్లో ఓపెన్ చేశాడు.. ఇక దొంగలకు తెలిస్తే..?

Drunken Trump: ఫుల్‌గా మందుకొట్టి.. పుతిన్ ముందుకు.. ట్రంప్ మామ దొరికిపోయాడు, ఎలా తడబడ్డాడో చూడండి

Mumbai Hotel: ముంబై హోటల్‌లో కప్పు టీ అక్షరాల రూ.1000.. ఈ ఎన్ఆర్ఐ రియాక్షన్ చూడండి, వీడియో వైరల్

Leopard Attack: సఫారీ రైడ్‌లో బాలుడిపై చిరుత అటాక్.. పరిగెత్తుకుంటూ వచ్చి మరీ.. వీడియో వైరల్

Big Stories

×