Telugu Hero : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న నటుడు సుహాస్(Suhas) ఓ భామ అయ్యో రామ(OhBhamaAyyoRama) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జూలై 11వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో సుహాస్ మహా న్యూస్ ఛానల్(Maha News Channel) కార్యక్రమానికి హాజరయ్యారు అయితే ఈ ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఈ కార్యాలయం పై బిఆర్ ఎస్ నాయకులు దాడికి దిగడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇలా దాడి చేస్తున్న నేపథ్యంలో హీరో సుహాస్ తీవ్ర ఆందోళనలకు గురి అయ్యారు. ఈ దాడి సమయంలో ఆయన న్యూస్ ఛానల్లో లోపల ఒక గదిలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ దాడిలో హీరోకి ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం…
ఈరోజు మధ్యాహ్నం ఉన్నఫలంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై ఒక్కసారిగా కొంతమంది బి ఆర్ ఎస్ నాయకులు గుంపుగా వచ్చి ఆఫీస్ బయట ఉన్నటువంటి కార్లపై పెద్ద ఎత్తున రాళ్లతో దాడి చేశారు. అదేవిధంగా ఆఫీసులో అద్దాలు ఫర్నిచర్ కంప్యూటర్లను కూడా పూర్తిగా నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఇలా బిఆర్ఎస్ నాయకులు న్యూస్ ఛానల్ ఆఫీస్ పై దాడి చేయడానికి కారణం లేకపోలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయామంలో జరిగిన ఫోన్ టాపింగ్ వ్యవహారం పై సిట్ విచారణ జరుగుతుంది.
బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా…
ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించిన అంశాల గురించి మహా న్యూస్ ఛానల్లో ప్రసారం అయ్యాయి. అయితే ఈ కథనాలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఇలా బిఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది అయితే ఈ దాడిని ఇప్పటికే చాలామంది తీవ్రంగా ఖండించారు. ఇకపోతే ఇదే ఛానల్ లోనే హీరో సుహాస్ కూడా ఉండటం గమనార్హం. ఈయన తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
జూలై 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోయేఓ భామ అయ్యో రామ సినిమా ప్రమోషన్ల నిమిత్తం ఈ చానల్లో పాల్గొన్నారు అయితే ఒక్కసారిగా ఈ కార్యాలయం పై దాడి చేయడంతో దిక్కుతోచని స్థితిలో హీరో ఉండిపోయారు. అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఒక గదిలోకి పంపించారు ప్రస్తుతం అయితే హీరో సుహాస్ కు ఎలాంటి ప్రమాదం ఏమీ జరగలేదని తెలుస్తుంది.ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సుహాస్ మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్నారు.రామ్ గోదాల దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాలో అనితా హస్సానందాని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథివీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాత్విక్ ఆనంద్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
#mahaanews పై #BRS నాయకులు దాడి..
దాడిలో చిక్కుకున్న హీరో #Suhas And #OhBhamaAyyoRama మూవీ టీం @BRSparty @ActorSuhas #MalavikaManoj @anitahasnandani @NenuMeeRamm @HarishNallaOffl @maniDop @PradeepTallapu @brahmakadali@VArtsFilms @SpiritMediaIN pic.twitter.com/mM2MMTotfS— BIG TV Cinema (@BigtvCinema) June 28, 2025
Also Read: ఓకే ప్రేమ్‌లో పుష్ప బ్యూటీస్.. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు