Action Movie on OTT: ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటుడు కీ హుయ్ క్వాన్ పేరు వినగానే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా గుర్తొస్తుంది. అయితే ఆయన మరోసారి యాక్షన్ హీరోగా కనిపించిన సినిమా ‘లవ్ హర్ట్స్’ (Love Hurts). 2025లో విడుదలైన ఈ హాలీవుడ్ యాక్షన్ కామెడీ మూవీ… ఒకప్పుడు హిట్‌మ్యాన్‌గా పని చేసిన వ్యక్తి తన గతాన్ని పూర్తిగా మర్చిపోయి సాధారణ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే, అతని పాత ప్రపంచం మళ్లీ వెంటాడటం మొదలు పెడితే ఎలా ఉంటుంది ? అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. జోనాథన్ యుసేబియో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీ హుయ్ క్వాన్‌తో పాటు అరియానా డిబోస్, డేనియల్ వు కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.
మార్విన్ గేబుల్ అనే వ్యక్తి ఒకప్పుడు క్రిమినల్ ప్రపంచంలో పని చేసే ప్రొఫెషనల్ హిట్‌మ్యాన్. కానీ ఆ జీవితాన్ని పూర్తిగా వదిలేసి మిల్వాకీ నగరంలో ప్రశాంతమైన జీవితాన్ని మొదలు పెడతాడు. ఇప్పుడు అతని చేతిలో తుపాకీకి బదులుగా ఇంటి తాళాలు ఉంటాయి. నేరస్తులను వెంబడించాల్సిన వ్యక్తి.. ఇళ్లను అమ్ముకుంటూ సాధారణ జీవితం గడుపుతుంటాడు.
అంతా ప్రశాంతంగానే సాగుతున్న సమయంలో వాలెంటైన్స్ డే రోజున అతని గతం ఒక్కసారిగా తిరిగి వస్తుంది. మార్విన్ కు ఒక క్రిమ్సన్ కలర్ కవర్ అందుతుంది. అది అతను చనిపోయిందని భావించిన తన మాజీ క్రైమ్ పార్టనర్ రోజ్ నుంచి వస్తుంది. రోజ్ తిరిగి రావడంతో మార్విన్ ఇన్నాళ్లు దాచిపెట్టిన గతం ఒక్కసారిగా బయట పడుతుంది. ఆమె సాధారణంగా తిరిగి రాలేదు. మార్విన్‌కు ఒక ప్రమాదకరమైన సందేశం తీసుకుని వస్తుంది.
రోజ్ రాకతో మార్విన్ జీవితంలో అసలు సమస్య మొదలవుతుంది. ఒకప్పుడు తాను పని చేసిన క్రిమినల్ ప్రపంచంలోని వ్యక్తులు అతన్ని టార్గెట్ చేయడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా అతని సొంత సోదరుడు ఆల్విన్ ‘నకుల్స్’ గేబుల్ ఒక ప్రమాదకరమైన క్రైమ్ లార్డ్. అతనికి మార్విన్‌పై పాత కోపం ఉంటుంది. దీంతో మార్విన్‌ను చంపడానికి వరుసగా హంతకులు రంగంలోకి దిగుతారు.
ఇక్కడే సినిమా అసలు యాక్షన్ మొదలవుతుంది. ఇళ్లను అమ్మేందుకు మార్విన్ నిర్వహించే ఓపెన్ హౌస్‌లు కాస్తా యాక్షన్ బ్యాటిల్‌ఫీల్డ్స్‌గా మారిపోతాయి. సాధారణ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా కనిపించే మార్విన్, పరిస్థితి చేయి దాటిన ప్రతిసారీ తన పాత హిట్‌మ్యాన్ స్కిల్స్‌ను బయటకు తీస్తాడు. ఒకప్పుడు వదిలేసిన ఆయుధాలు, ఫైటింగ్ టెక్నిక్స్ మళ్లీ అతని జీవితంలోకి వస్తాయి.
అయితే ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు. మార్విన్ తన పాత జీవితాన్ని ఎందుకు వదిలేశాడు ? రోజ్ నిజంగా అతని దగ్గరకు ఎందుకు తిరిగి వచ్చింది ? అతని సోదరుడు నకుల్స్ ఎందుకు అతన్ని చంపాలని చూస్తున్నాడు ? రోజ్ దగ్గర ఉన్న అసలు రహస్యం ఏంటి ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలనుకుంటే ఈ సినిమాను డోంట్ మిస్.
సినిమాకు మరో ప్రత్యేకత కీ హుయ్ క్వాన్ నటన. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’లో తన నటనతో ఆస్కార్ గెలుచుకున్న ఆయనకు ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన యాక్షన్ పాత్ర దక్కింది. అమాయకంగా కనిపించే రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి ప్రమాదకరమైన ఫైటర్‌గా మారే మార్విన్ పాత్రలో ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అరియానా డిబోస్ రోజ్ పాత్రలో కనిపించగా, డేనియల్ వు మార్విన్ సోదరుడు నకుల్స్‌గా నటించారు. ‘లవ్ హర్ట్స్’ మూవీ కేవలం 1 గంట 23 నిమిషాల నిడివితో ఉంటుంది. పెద్దగా సాగదీయకుండా యాక్షన్, కామెడీ, క్రైమ్ అంశాలను వేగంగా చూపించడం దీని ప్రత్యేకత. అయితే విమర్శకుల నుంచి మాత్రం సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. IMDbలో కూడా 5.3 రేటింగ్ మాత్రమే ఉంది.
మొత్తానికి ఒకప్పుడు హిట్‌మ్యాన్‌గా పనిచేసి, ఇప్పుడు సాధారణ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిపోయిన వ్యక్తి జీవితంలో అతని గతం మళ్లీ తలుపు తడితే ఏం జరుగుతుందనే కాన్సెప్ట్‌తో వచ్చిన యాక్షన్ కామెడీ ‘లవ్ హర్ట్స్’. కీ హుయ్ క్వాన్ యాక్షన్‌ను చూడాలనుకునే వారికి, తక్కువ నిడివిలో యాక్షన్, కామెడీ, క్రైమ్ కలగలిపిన సినిమాలను చూడాలనుకునే వారికి ఈ మూవీ పర్ఫెక్ట్ మూవీ. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
Read Also: భార్య కోసం దెయ్యంగా మారిన భర్త… గోడలో దాచిన చీటీతో అదిరిపడే ట్విస్ట్