E-Paper
Advertisement

మరీ ఇంత ఘోరమా.. హుస్సేన్ సాగర్‌లో ఆరేళ్ల పాపను విసిరేసిన కన్నతల్లి..!

మరీ ఇంత ఘోరమా.. హుస్సేన్ సాగర్‌లో ఆరేళ్ల పాపను విసిరేసిన కన్నతల్లి..!
Advertisement

Hussain Sagar: అగ్రరాజ్యాలతో పోటీ పడుతున్నామని నాయకులు ఎంత చెప్తున్నా ఆకలి నిండని బతుకుల బాధలు భారతదేశం నిండా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రాణాలు తీసేంత పేదరిక భూతం ఈ దేశాన్ని ఇంకా వదల్లేదు. కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించే స్థోమత లేక.. ఆరేళ్ల చిన్నారిని హుస్సేన్ సాగర్‌లోకి విసిరేసింది ఓ తల్లి. అదృష్టవశాత్తూ అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ దేవుడిలా స్పందించి నీటిలోకి దిగి చిన్నారి ప్రాణాలు కాపాడాడు. అసలు ఆ తల్లి ఎందుకీ దారుణ నిర్ణయం తీసుకుంది? ఆ కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులేంటి?

ఆరేళ్ల పాప ప్రాణం..

ఓల్డ్ బోయిన్‌పల్లి, హస్మత్‌పేటలో ఉండే షబానా ఒంటరి మహిళ. భర్త వదిలేయడంతో ఇద్దరు ఆడపిల్లల బాధ్యత ఒక్కటే మోస్తోంది. ఆ ఇంట్లో, ఈ ఇంట్లో పనిచేస్తే వచ్చే ఆదాయంతోనే ఆ ఇద్దరు కూతుళ్లని సాకుతోంది. అయితే రెండో కూతురు రుక్సానా అనారోగ్యం ఆ తల్లికి భారంగా మారింది. పేగు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న చిన్నకూతురు వైద్యం ఆమె స్తోమతకు మించిపోయింది. కళ్లముందు బిడ్డపడుతున్న యాతన భరించలేకపోయింది. చివరకు చిన్నారిని తీసుకుని హుస్సేన్ సాగర్‌ దగ్గరకు వెళ్లింది. కన్నతల్లినని కాసేపు మర్చిపోయి చిన్నారిని హుస్సేన్ సాగర్‌లోకి విసిరేసింది. పేదరికం ఎంతటి దారుణమైన పరిస్థితులకు దారితీస్తుందో ఈ ఘటన అద్దం పడుతోంది. చిన్నారిని నీటిలోకి విసిరేయడాన్ని అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ గమనించాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీటిలోకి దిగి ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడాడు. సమయానికి స్పందించడంతో ఆరేళ్ల పాప ప్రాణం నిలబడింది.

అందని ద్రాక్షగా..

Advertisement

ఆర్థిక ఇబ్బందులు ఎంత తీవ్రమైనా చిన్నారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం సరికాదు. సమర్ధనీయం కాదు. కానీ వైద్యం సామాన్యులకు అందనంత దూరంలో ఉంది. ఆకలే సరిగా తీరని మనుషులకు ఆస్పత్రులు, ఖరీదైన వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. ప్రస్తుతం రుక్సానా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పాప ఈ ఘటన నుంచి కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు.

Also read: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సర్కార్ మరో సంచలన నిర్ణయం!

Tags

Related News

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

బండి భగీరథ్ పోక్సో కేసు.. సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ప్రసారాలపై హైకోర్టు నిషేధం

హరీశ్ రావు పరువు నష్టం దావా కేసు.. కాంగ్రెస్ అగ్రనేతలకు కోర్టు సమన్లు!

కాంగ్రెస్ మూడేళ్ల పాలన ఫెయిల్.. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం: కవిత

ఒక్క వ్యక్తిని కాపాడేందుకే ఈ తాపత్రయమా? కేంద్ర ఎన్నికల సంఘంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సర్కార్ మరో సంచలన నిర్ణయం!

Big Stories

Advertisement
×