E-Paper
Advertisement

వైజాగ్ లో బన్నీ AAA సినిమాస్ ఓపెనింగ్…. కానీ ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!

వైజాగ్ లో బన్నీ AAA సినిమాస్ ఓపెనింగ్…. కానీ ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
Advertisement

AAA Cinemas:ఒకప్పుడు ఎంచక్కా సినిమా చేసామా.. వచ్చిన థియేటర్‌లో సినిమాను చూసామా అన్నట్టుగా ఉండేది మన హీరోల మైండ్‌సెట్.కానీ ఇప్పుడు కాలం మారింది. “ఆ థియేటర్ ఏదో మనకే ఉంటే పోలే” అంటూ వరుసగా థియేటర్ల బిజినెస్‌లోకి అడుగు పెట్టేస్తున్నారు మన స్టార్ హీరోలు.ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు థియేటర్ల వ్యాపారంలోకి అడుగుపెట్టినవాళ్లే.

వైజాగ్‌లో AAA సినిమాస్ 

అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్‌తో కలిసి అమీర్‌పేటలో AAA అనే భారీ మల్టీప్లెక్స్‌కు శ్రీకారం చుట్టగా.. తాజాగా హైదరాబాద్ మాత్రమే కాదు, వైజాగ్‌లోనూ మా థియేటర్‌ను ఎక్స్‌పాన్షన్ చేస్తామంటూ ఆగస్టు 9న వైజాగ్‌లోని ఇనార్బిట్ మాల్‌లో AAA సినిమాస్‌ను గ్రాండ్‌గా ఓపెన్ చేయబోతున్నాడు మన ఐకాన్ స్టార్.ఇందులో 8 స్క్రీన్స్ ఉండటం ఇక్కడ విశేషం.

Advertisement

ఇక బన్నీ వైజాగ్‌కు వస్తున్నాడని వార్త రావడంతో మురిసిపోతున్నారు బన్నీ ఫ్యాన్స్.

బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

అయితే ఇక్కడ బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. బన్నీ వస్తున్నాడని తెలిసినప్పటికీ ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ ఉండటమే.అవును.. మన పుష్పరాజ్ వచ్చాడని తెలిస్తే అభిమానులు సునామీలా వచ్చేస్తారన్న అంచనాలతో పోలీసులు భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారట.

Advertisement

అందుకే ఈ థియేటర్ ఓపెనింగ్‌కు అటు సాధారణ ప్రేక్షకులను, ఇటు అభిమానులను ఎవరినీ అనుమతించడం లేదట వైజాగ్ పోలీసులు.

అతిథులు,మీడియాకే మాత్రమే 

దీంతో ఈ ఓపెనింగ్‌కు కేవలం అతిథులు, థియేటర్ ఓనర్స్, మీడియా వారికి మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది.అయితే తన కోసం వచ్చి గంటల తరబడి ఎదురు చూసే అభిమానులు డిసప్పాయింట్ కాకుండా.. మాల్ పైభాగానికి వచ్చి ఫ్యాన్స్‌ను పలకరిస్తూ చేతులు ఊపి వెళ్లిపోతాడని తెలుస్తోంది.

రిబ్బన్ కట్ తర్వాతే 

ఇక ఆ తర్వాత అఫీషియల్‌గా లోపల రిబ్బన్ కట్ చేసి AAA సినిమాస్‌ను ప్రారంభిస్తారని సమాచారం.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాతే సోషల్ మీడియాకు, మీడియాకు విడుదల చేయనున్నారట.

స్టార్ హీరోల ఫోకస్ మల్టీప్లెక్స్‌లపైనా?

అయితే ఇదిలా ఉంటే.. ఒక ఆసక్తికరమైన డిస్కషన్ ఇప్పుడు నెట్టింట్లో జరుగుతోంది.ఒకవైపు ఆడియన్స్ థియేటర్లకే రావట్లేదు.. చాలా థియేటర్లు వెలవెలబోతున్నాయన్న మాటలు ప్రతిరోజూ వినిపిస్తుంటే.. మరోవైపు ఇలా తారలంతా వరుసగా మల్టీప్లెక్స్‌ల మీద పడటం కాస్త ఆశ్చర్యంగా కనిపిస్తోంది.

ఒక రకంగా మహేష్ బాబు, రవితేజ, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఇలా థియేటర్ల వ్యాపారంలోకి వస్తుండటంతో.. ముందు ముందు సినిమాల కన్నా థియేటర్ల బిజినెస్‌లోనే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తారక్, చరణ్ ఎంట్రీ?

ఇక ఇదే బిజినెస్‌లోకి తారక్, చరణ్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.చూడాలి.. ముందు ముందు ఈ థియేటర్లు ఎంతవరకు ఫలితాలను ఇస్తాయో.

అందరి చూపు ఇప్పుడు ఆగస్టు 9పైనే

ఏది ఏమైనా.. వైజాగ్‌లో ఏం జరిగిందో తెలియాలంటే ఆగస్టు 9 వరకు వెయిట్ చేయాల్సిందే!

ALSO READ:లీకులు ఫుల్.. అప్‌డేట్ నిల్.. ఇదేం గేమ్ జక్కన్నా?

Tags

Related News

విభిన్న గెటప్స్ లో శర్వానంద్.. ‘జార్జ్ క్రిష్’ నుండి ఫస్ట్ బూస్టర్ రిలీజ్!

ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

Big Stories

Advertisement
×