Flipkart Freedom Sale: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్రీడమ్ సేల్’ ను ప్రారంభించబోతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించనున్నాయి. ముఖ్యంగా శాంంసంగ్ ప్రియులకు ఎంతో నచ్చిన Samsung Galaxy S25 FE ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వస్తోంది. దీంతో పాటు Samsung Galaxy S25 కూడా తక్కువ ధరకే లభించనుంది.
ఈ ఆఫర్ల పండగ ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు ఒక రోజు ముందే ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. సేల్ సమయంలో SBI క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. దీనికి తోడు నో-కాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
Also Read: ఛార్జింగ్ కేబుల్స్ మురికిగా మారాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
సేల్ సమయంలో Samsung Galaxy S25 FE ఫోన్ బ్యాంక్ ఆఫర్లతో కలిపి కేవలం రూ.47,999 లభించనుంది. దీని కొనుగోలుపై నెలవారీ EMIలు రూ.8,333 నుంచి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోడల్ ప్రారంభ వేరియంట్ ధర రూ.54,999గా ఉంది. అలాగే గెలాక్సీ S25 ఫోన్ కూడా అసలు ధర రూ.74,999కి బదులుగా రూ.57,999లకే లభిస్తుంది.
Samsung Galaxy S25 FE ఫోన్ 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ ఉంది. ఎక్సినోస్ 2400 ప్రొసెసర్‌పై పనిచేసే ఈ హ్యాండ్ సెట్‌లో 50MP ప్రధాన కెమెరాతో కూడిన త్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 4,900 mAh బ్యాటరీతో పాటు 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. తక్కువ ధరలో మంచి ప్రీమియం ఫోన్ కొనాలనుకునే ఈ సేల్ సరైన అవకాశం అనే చెప్పాలి.
Also Read: యాడ్స్ లేవు.. 4 నెలలు ఫ్రీ సాంగ్స్, స్పాటిఫైతో జతకట్టిన బోట్.. ఆఫర్ ఎలా పొందాలంటే?