Jurala Water: జూరాలలో నీరు ఉన్నప్పటికీ నీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు స్పష్టంగా చెప్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. వరద జలాలపై కట్టిన ప్రాజెక్టులకు ఏపీ నీరు తీసుకెళ్తుంటే.. ఇక్కడ నికర జలాలపై నిర్మించిన ప్రాజెక్టుల కింద కూడా నీరు ఇవ్వడం లేదని అన్నారు. ఈ ఏడాది వచ్చిన 248 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణ కేవలం 28 టీఎంసీలు మాత్రమే వాడిందని అన్నారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరు రైతులకు మొదటి శత్రువులా అయ్యారు.
ఎల్ నినో తరహాలో.. ఎల్ కాంగో వల్లే ఈ దుస్థితని రైతుల కోసం వెళ్లిన మా నేతలను దుర్మార్గంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అరెస్టులతో బయటపెట్టలేరని జూరాల కింద ఒక్క ఎకరం పంట ఎండినా కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోకుంటే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చూడతామని, ప్రభుత్వ కార్యాలయాలు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాలు కాదు.. రైతుల ప్రయోజనాలు ముఖ్యం కావాలన్నారు.
Also read: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. హోంమంత్రి అనిత హెచ్చరికలు జారీ!
రైతుల విషయంలో రాజకీయం చేయవద్దు. కన్నేపల్లి, నార్లపూర్ పంపులు ఆన్ చేయండి. కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి పది టీఎంసీల నీరు తీసుకొచ్చి పంటలు కాపాడండని అన్నారు. మేం ఏమైనా తప్పులు తీసుకొని ఉంటే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు అయినా తీసుకోవచ్చని అన్నారు. డ్రామాలు తగవు.. భూముల వద్దకు వెళ్లి ఏం చేస్తారు? సరైన విషయంలో తగు రీతిన స్పందిస్తామని కేటీఆర్ అన్నారు. ఆస్తులపై సిట్టింగ్ విచారణకు సిద్ధమని సవాల్ చేస్తే ఇప్పటి వరకు కనీసం స్పందన లేదని అన్నారు.
సిరిసిల్ల వెళ్లి ముఖ్యమంత్రి ఏం చెబుతారు? నేతన్నల ఆత్మహత్యలు, రైతుబంధు ఎగ్గొట్టింది వివరిస్తారా? సిరిసిల్లలో చేసిన అభివృద్ధి చూసి కొడంగల్‌లో అమలు చేసేందుకు వస్తున్నారేమో? అసెంబ్లీలో సీఎం చెప్పినట్లు సిరిసిల్లలో 8000 ఎకరాలు ఎవరు కబ్జా చేశారో.. వాటిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డి రాజన్న దర్శనం చేసుకొని పాప ప్రక్షాళన చేసుకోవాలన్నారు.
Also read: టీచర్లపై దాడి చేస్తే ఊరుకునేది లేదు.. వైసీపీకి మంత్రి నారా లోకేష్ వార్నింగ్